View

Gopala Gopala Movie Review

Saturday,January10th,2015, 07:01 AM

చిత్రం - గోపాల గోపాల
బ్యానర్స్ - సురేష్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.లిమిటెడ్
నటీనటులు - వెంకటేష్, పవన్ కళ్యాణ్, శ్రియ, మిధున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, మధుషాలిని, దీక్షా పంధ్, వెన్నెల కిషోర్, రఘుబాబు, రంగనాధ్ తదితరులు
కధ - ఉమేష్ శుక్లా, బావేష్ మండాలియా
మాటలు - సాయిమాధవ్ బుర్రా
స్ర్కీన్ ప్లే - కిషోర్ కుమార్ పార్ధసాని, భూపతిరాజా, దీపక్ రాజ్
సంగీతం - అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ - జయనన్ విన్సెంట్
ఎడిటింగ్ - గౌతంరాజు
నిర్మాతలు - డి.సురేష్ బాబు, శరత్ మరార్
దర్శకత్వం - కిషోర్ కుమార్ పార్ధసాని
విడుదల - 10th, జనవరి 2015

ఈ తరం హీరోల్లో మల్టీస్టారర్ ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది వెంకటేష్. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తో ఈ మల్టీస్టారర్ ట్రెండ్ ఆరంభమయ్యింది. ఇది సింఫుల్ స్టోరీ అయినప్పటికీ వెంకటేష్, మహేష్ బాబును తెరపై చూడటమే కనువిందుగా భావించి ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆస్వాదించారు. ఆ తర్వాత కుర్ర హీరో రామ్ తో కలిసి మల్టీస్టారర్ 'మసాలా' చిత్రం చేసాడు వెంకటేష్. తాజాగా వెంకటేష్, పవన్ కళ్యాణ్ తెర పంచుకుని 'గోపాల గోపాల' చిత్రం చేసారు. అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసే వెంకటేష్, తన అపియరెన్స్ తోనే మ్యాజిక్ చేయగల సత్తా ఉన్న పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే మామూలు విషయం కాదు. దాంతో ఈ ఇద్దరూ కలిసి నటించిన 'గోపాల గోపాల' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బాక్సీఫీస్ వసూళ్లను భారీగా ఈ చిత్రం కొల్లగొట్టేస్తుందనే లెక్కలు ట్రేడ్ వర్గాలు వేస్తున్నాయి. మరి.. అందరి అంచనాలను మించే విధంగా ఈ చిత్రం ఉందా.... ఆ విషయంలోకే వెళదాం...

à°•à°¥
గోపాలరావు (వెంకటేష్) ఓ షాపు ఓనర్. తన షాపులో పూజ సామాగ్రి, దేవుడు బొమ్మలు అమ్ముతుంటాడు. గోపాలరావుకు మాత్రం దేవుడిపై నమ్మకం ఉండదు. గోపాలరావు భార్య మీనాక్షి (శ్రియ)కి దేవుడంటే అపారమైన నమ్మకం. పరమ భక్తురాలు. ఈ దంపతులకు ఓ కొడుకు ఉంటాడు. సాపీగా జీవితాన్ని సాగించే వీరికి భూకంపం రూపంలో పెద్ద కష్టం వచ్చి పడుతుంది. భూకంపం రావడంతో గోపాలరావు షాపు కూలిపోతుంది. షాపులోని దేవుడు విగ్రహాలు, పూజా సామాగ్రి మొత్తం పాడయిపోతాయి. దేవుడు మీద నమ్మకం లేకపోవడం వల్లే గోపాలరావు ఇంత నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని జనాలు నానా మాటలు అంటారు. అయితే తన షాపుకు ఇన్సూరెన్స్ చేయించి ఉంటాడు గోపాలరావు. ఆ ధీమాతో ఇన్సూరెన్స్ కంపెనీని ఆశ్రయిస్తాడు. 'యాక్ట్ ఆఫ్ గాడ్' క్లాజ్ చూపించి సదురు ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి నిరాకరిస్తుంది. దాంతో గోపాలరావు దేవుడిని కోర్టుకీడ్చడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. దైవదూతలుగా భావించి, ఆశ్రమాలు నడిపే స్వామీజీలకు,, బాబాలకు లీగల్ నోటీసులు పంపిస్తాడు.
ఈ ప్రాసెస్ లో పలువురు భక్తులు, ఆశ్రమాలు అడ్డుపెట్టుకుని కొల్లగొడుతున్న కొందరు స్వామీజీలు గోపాలరావుకి శత్రువులవుతారు. కానీ మంచి మనిషి అయిన గోపాలరావును ఆదుకోవడానికి దేవుడు (పవన్ కళ్యాణ్) స్వయంగా అతని జీవితంలోకి ఎంటర్ అవుతాడు. కనిపించని దేవుడు మీద కేసు వేసి గోపాలరావు ఏం సాధించాడు. స్వయంగా గోపాలరావు జీవితంలోకి ఎంటరైన దేవుడు ఏం చేస్తాడు తదితర అంశాలతో ఈ చిత్రం సెకండాఫ్ సాగుతుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్
ఎలాంటి పాత్రను అయినా సునాయాసంగా చేయగల సత్తా వెంకటేష్ కి ఉంది. గోపాలరావు పాత్రలో వెంకీ అలవోకగా ఒదిగిపోయాడు. స్వతహాగా దేవుణ్ణి నమ్మే వెంకీ ఇందులో నాస్తికుడిగా వ్యక్తిత్వానికి భిన్నమైన పాత్రను చాలా బాగా చేశాడు. ముఖ్యంగా కోర్టు సన్నివేశాల్లో భగవద్గీతలోని శ్లోకాలను వెంకీ అలవోకగా చెప్పిన వైనం చాలా బాగుంది. దేవుడిగా పవన్ కల్యాణ్ బాగా చేశాడు. సహజంగా దేవుడి పాత్రలంటేనే కరుణ రసం, శాంత రసం ఉట్టిపడుతుంటాయి. హావభావాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. వీటిని పవన్ కరెక్ట్ గా బ్యాలెన్స్ చేశాడు. గృహిణి పాత్రలో శ్రియ ఫర్వాలేనిపించుకుంది. వెంకీ, శ్రియల తనయుడిగా నటించిన అర్జున్ క్యూట్ గా ఉండటంతో పాటు ఉన్నంతలో చక్కని హావబావాలు పలికించాడు. పోసాని తన పాత్రకు న్యాయం చేశాడు. ఇక.. హిందీ నటుడు మిథున్ చక్రవర్తి కూడా బాగా చేశాడు. ఇతర పాత్రధారులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతిక వర్గం
ఈ సినిమాకి చెందిన సాంకేతిక వర్గంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బుర్రా సాయిమాధవ్ గురించి. "దారి చూపించడం వరకే నా పని, గమ్యానికి చేరుకోవడం మీ పని..., బరువు చూసే వాడికి కాదు మిత్రమా.. మోసేవాడికి తెలుస్తుంది..., సమర్థులు ఇంట్లో ఉండిపోతే... అసమర్థులు రాజ్యమేలతారు..., నాయకుడంటే నమ్మించే వాడు కాదు.... నడిపించేవాడు..'' వంటి పలు సంభాషణలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడి పనితనం ఓకే. అనూప్ రూబెన్స్ పాటలు బాగున్నాయి. రీ-రికార్డింగ్ మాత్రం ఆశించినంతగా లేదు. గౌతంరాజు ఎడిటింగ్ బాగుంది. కెమెరా పనితనం చెప్పుకోదగ్గ విధంగా ఉంది.

ఫిల్మీబజ్ విశ్లేషణ
దేవుడి మీద కేసు వేయాలనుకోవడం అనే ఆలోచన రావడం ఓ సాహసం.. ఆ అంశాన్ని ఏమాత్రం సరిగ్గా ఆవిష్కకరించకపోయినా మతపరమైన గొడవలు జరిగే అవకాశం చాలా ఎక్కువ. హిందీ 'ఓ మై గాడ్'ని చాలా కన్విన్సింగ్ గా తెరకెక్కించారు కాబట్టే, ఎలాంటి విమర్శలు ఎదురు కాలేదు. హిందీ వెర్షన్ చూసేసారు కాబట్టి, తెలుగు వెర్షన్ ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా తెరకెక్కంచారు. సో... ఈ క్రెడిట్ మొత్తం ముందు హిందీ చిత్రబృందానికే దక్కుతుంది. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు లైటర్ వీన్ గా సాగుతుంది కాబట్టి, ప్రేక్షకులు రిలీఫ్ గా చూస్తారు. ఎంత బలమైన సన్నివేశం అయినా అందులో కామెడీ టచ్ ఉండటం ప్లస్ పాయింట్. వెంకటేష్, పవన్ కల్యాణ్ కాంబినేషన్ ప్రధాన ఆకర్షణ. ఒకవేళ ఈ చిత్రం కనుక ఈ ఇద్దరూ కాకుంండా వేరే హీరోలెవరైనా చేసి ఉంటే పెద్దగా క్రేజ్ వచ్చేది కాదు. సినిమా మంచి వసూళ్లు సాధించడానికి ఈ కాంబినేషనే కారణం అవుతుంది. కృష్ణుడి గెటప్ లో పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు కనిపిస్తాడా అని ఎదురు చూసే ఆయన అభిమానులకు సినిమా చివర్లో ఆ సన్నివేశం కనిపిస్తుంది. కానీ, పవన్ కృష్ణావతారాన్ని స్పష్టంగా చూపించకపోవడం ఓ నిరాశ. పైగా... కృష్ణుడు గెటప్ అంటే మహానటుడు ఎన్టీఆర్ అనే బలమైన ముద్ర పడేంతగా అన్నగారు ఆ పాత్రలో ఒదిగిపోయారు. ఆ అవతారం ముందు ఈ కృష్ణావతారం సోసోగా అనిపించింది.

ఫైనల్ గా చెప్పాలంటే.. 'గోపాల గోపాల' ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్. హాయిగా ఎంజాయ్ చేయొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !