View

Ladies & Gentlemen movie Review

Friday,January30th,2015, 01:24 PM

చిత్రం - లేడీస్ & జెంటిల్ మెన్
సమర్పణ - గో తెలుగు.కామ్
బ్యానర్ - పి.యల్.క్రియేషన్స్, షిర్డిసాయి కంబైన్స్
నటీనటులు - చైతన్య కృష్ణ, మహత్ రాఘవేంద్ర, అడవి శేషు, కమల్ కామరాజు, నిఖిత నారాయణ్, స్వాతిదీక్షిత్, జాస్మిన్ భషీన్ తదితరులు
సంగీతం - రఘు కుంచె
సినిమాటోగ్రఫీ - జగన్ చావలి
ఎడిటింగ్ - నవీన్ నూలి
కథ - సంజీవ్ రెడ్డి
పాటలు - సిరాశ్రీ
మాటలు - నివాస్
ఆర్ట్ - సాహి సురేష్
నిర్మాతలు - డా.యం.వి.కె.రెడ్డి, మధుర శ్రీధర్ రెడ్డి
దర్శకత్వం - పి.బి.మంజునాథ్
విడుదల తేదీ - 30.1.2015

స్నేహగీతం, ఇట్స్ మై లవ్ స్టోరీ మరియు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ లాంటి యువతరం మనోభావాలకు అద్దం పట్టే సినిమాలకు దర్శకత్వం వహించిన 'మధుర' శ్రీధర్ రెడ్డి ఇప్పుడు నిర్మాతగా మారి తన వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన పి.బి.మంజునాథ్ ను దర్శకునిగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం 'లేడీస్ & జెంటిల్ మెన్'. కొత్త కాన్సెఫ్ట్ లతో, రోటీన్ కి భిన్నంగా ఉండే సినిమాలను ప్రేక్షకులకు అందించాలని తపించే మధుర శ్రీధర్ చేసిన ఈ కొత్త ప్రయత్నం ప్రేక్షకులను రంజింపజేసే విధంగా ఉందా? దర్శకుడిగా మంజునాధ్ కి, నిర్మాతగా మధుర శ్రీధర్ కి ఈ సినిమా ఎలాంటి పేరు తెచ్చి పెడుతుంది, కాన్సెఫ్ట్ ఓరియంటెడ్ గా రూపొందిన ఈ చిత్రం కమర్షియల్ సక్సెస్ సాధించే విధంగా ఉందా అనే విషయాలను తెలుసుకుందాం.

à°•à°¥
ముగ్గురు వ్యక్తుల జీవితాలు ఇంటర్నెట్ వల్ల ఎలాంటి మలుపులు తీసుకున్నాయనేదే ఈ సినిమా కాన్సెఫ్ట్. గర్ల్ ఫ్రెండ్ కోసం వెతికే కుర్రాడు క్రిష్ (కృష్ణ చైతన్య). బిజినెస్ లో తలమునకలైపోయి, కనీసం తన భార్య (నిఖితా నారాయణ్) ని కూడా పట్టించుకోని ఆనంద్ (కమల్ కామరాజు). తను ఎంతగానో ప్రేమించే అమ్మాయి (జాస్మిన్ భషీన్)కి అప్పు చేసి అయినా సరే అన్ని సౌకర్యాలు సమకూర్చడానికి ఈజీ మనీ కోసం వెంప్లరాడే విజయ్ (మహత్ రాఘవేంద్ర). ఈ ముగ్గురు జీవితాలు ఇంటర్నెట్ తో లింక్ అయి ఉంటాయి, దానివల్ల వీరి జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయనేదే ఈ సినిమా కథ.

నటీనటుల పెర్ ఫామెన్స్
చైతన్య కృష్ణ, అడవి శేష్, మహత్, కమల్ కామరాజు తమ పాత్రల్లో లీనమై నటించారు. నిఖితా నారాయణ్, జాస్మిన్ భషీన్ తమ పాత్రలకు న్యాయం చేసారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేరకు నటించారు.

సాంకేతిక వర్గం
సంజీవ్ రెడ్డి చక్కటి కథ అందించారు. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండే కాన్సెఫ్ట్. దర్శకుడు మంజునాధ్ కి తొలి సినిమా అయినప్పటికీ ఆర్టిస్ట్ ల నుంచి నటన రాబట్టుకోవడంలో పూర్తిగా సఫలమయ్యారు. టేకింగ్ పరంగా కూడా ఎక్కడా తడబాటు కనిపించలేదు. కాకపోతే గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే చేయలేకపోవడం నిరాశపరిచే విషయం. విజువల్ గా సినిమా చాలా బాగుంది. రఘు కుంచె అందించిన పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సీన్స్ లో ఆడియన్స్ ని లీనమయ్యేలా చేస్తుంది. నిర్మాణపు విలువలు కూడా బాగున్నాయి.

ఫిల్మీబజ్ విశ్లేషణ
కాన్సెఫ్ట్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అందులో నో డౌట్. ఇలాంటి కాన్సెఫ్ట్ లను డీల్ చేసేటప్పుడు ఎంటర్ టైన్ మెంట్ ఉండటం చాలా అవసరం. కేవలం కాన్సెఫ్ట్ పైనే కాన్ సెన్ ట్రేట్ చేయడం వల్ల ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే అవకాశముంది. సినిమా చాలా స్లో గా సాగుతున్నట్టు అనిపిస్తుంది. సాగదీసినట్టు అనిపిస్తుంది. యదార్ధ సంఘటనలు తీసుకోవడం బాగానే ఉన్నప్పటికీ, సినిమాని ప్రజెంట్ చేసిన విధానం ఆకట్టుకోలేకపోయింది. ఫస్టాప్ అంతా క్యారెక్టర్స్ ని పరిచయం చేయడం, సైబర్ క్రైమ్ కి సంబంధించి కొన్నిసీన్లు మినహా పెద్ద ఇంట్రస్టింగ్ గా అనిపించలేదు. సెకండాఫ్ లో కథ ఊపందుకుంటుంది. ప్రేక్షకులు సినిమాలో లీనమయ్యే సమయానికి, తదుపరి వచ్చే సీన్స్ ఎలా ఉంటాయనేది ఊహించేస్తారు. దాంతో ధ్రిల్ అనిపించదు. క్లయిమ్యాక్స్ ట్విస్ట్ బాగుంటుంది. సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి, దాని ద్వారా తమకు పరిచయం అయ్యే వ్యక్తులను గుడ్డిగా నమ్మి మోసపోవద్దనే విషయాన్ని క్లయిమ్యాక్స్ ముందు వచ్చే సన్నివేశాల ద్వారా చక్కగా చెప్పగలిగారు. కేవలం కాన్సెఫ్ట్ బాగుంటే మాత్రం సరిపోదు. ఖజానా నిండాలంటే కమర్షియల్ హంగులు కావాలి. ఏ సినిమా అయినా కమర్షియల్ గా హిట్ అయినప్పుడే లాంగ్ రన్ ఉంటుంది.

ఫైనల్ గా చెప్పాలంటే ఈ లేడీస్ అండ్ జెంటిల్ మెన్ కి కమర్షియల్ బ్రేక్ రావడం కాస్త కష్టమే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !