View

Dongata movie review

Friday,May08th,2015, 09:25 AM

చిత్రం - దొంగాట
సమర్పణ - విద్యా నిర్వాణ
బ్యానర్ - మంచు ఎంటర్ టైన్స్ మెంట్స్
నటీనటులు - మంచు లక్ష్మీ, అడవి శేష్, ప్రభాకర్, మధు నందన్, బ్రహ్మానందం, జె.పి, గిరిబాబు, అన్నపూర్ణ, పృథ్వి, ప్రగతి, ప్రభాస్‌ శ్రీను, నర్సింగ్‌ యాదవ్‌, అనంత్‌, శ్రీనివాసరాజు, సందీప్తి, మాస్టర్‌ ప్రేమ్‌, బేబీ కావేరి, లత తదితరులు
సంగీతం - సత్య మహావీర్‌, రఘు కుంచె
పాటలు - రామజోగయ్యశాస్త్రి, వరికుప్పల యాదగిరి
సినిమాటోగ్రఫీ - సామల భాస్కర్‌
మాటలు - సాయిమాధవ్‌ బుర్రా
స్క్రీన్‌ప్లే - ఎన్‌.వంశీకృష్ణ, మోహన్‌ భరద్వాజ్‌
ఎడిటింగ్‌ - ఎస్‌.ఆర్‌.శేఖర్‌
ఫైట్స్‌ - రాంబాబు, వెంకట్‌
కో - ప్రొడ్యూసర్‌ - గాంధీ
నిర్మాత - మంచు లక్ష్మీ
à°•à°¥, దర్శకత్వం - ఎన్‌.వంశీకృష్ణ

ఐరేంద్రి, అమృతవల్లి, చిత్ర, లిసా స్మిత్... అనగనగా ఓ ధీరుడు, ఊ కొడతారా ఉలిక్కి పడతారా, గుండెల్లో గోదారి, చందమామ కథలు చిత్రాల్లో మంచు లక్ష్మీప్రసన్న చేసిన పాత్రలివి. ఈ పాత్రల్లో లక్ష్మీ పరకాయ ప్రవేశం చేసిన వైనాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ పాత్ర చేస్తే... అందులో పూర్తిగా ఒదిగిపోగల సత్తా ఉన్న నటి లక్ష్మీ. అలాగే, నిర్మాతగా కూడా భేష్ అనిపించుకుంది. అందుకే తను నటించి, నిర్మించిన తాజా చిత్రం 'దొంగాట'పై అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కోసం 'ఏందిరో...' పాటను కూడా పాడింది లక్ష్మీ. అలాగే, నాగార్జున, రవితేజ, మనోజ్, నాని వంటి హీరోలు ఓ పాటలో కనిపిస్తారు. మొత్తం మీద 'దొంగాట' అందర్నీ ఆకర్షించడానికి ఇలా రకరకాల కారణాలున్నాయి. మరి.. సినిమా కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటుందా?.. లక్ష్మీప్రసన్న ఖాతాలో మరో హిట్ ఖాయమా?.. తెలుసుకుందాం...

à°•à°¥
శృతి (మంచు లక్ష్మీ) పాపులర్ సినిమా హీరోయిన్. వెంకట్ (అడవి శేష్), కాటంరాజు (ప్రభాకర్), విజ్జు (మధు నందన్) కలిసి శృతిని కిడ్నాప్ చేసి, ఆమె తల్లి జ్యోతిలక్ష్మీ (ప్రగతి) దగ్గర 10కోట్లు డిమాండ్ చేస్తారు. పోలీసులకు శృతి కిడ్నాప్ అయిన విషయం చెప్పి మీడియాకి, పబ్లిక్ కి లీక్ అవ్వకుండా చూసుకోమని చెబుతుంది జ్యోతిలక్ష్మీ . ఈ కేసును ఏసీపీ కనకాంబరం (పృథ్వీ) స్పెషల్ కేర్ తీసుకుని ఇన్వెస్ట్ గేట్ చేస్తుంటాడు. డిటెక్టివ్ బ్రహ్మి (బ్రహ్మానందం) కూడా ఈ కేసు నిమిత్తం యు.యస్ నుంచి ఇండియా వస్తాడు. జ్యోతిలక్ష్మీ డబ్బు ఇవ్వగానే, ఆ డబ్బును తీసుకుని కాటంరాజును వదిలించుకుని వెళ్లిపోదామని శృతితో వెంకట్ చెబుతాడు. ఇది కాటంరాజు వింటాడు. ఇదే ఇంటర్వెల్ ట్విస్ట్.
శృతి ఎందుకు తన తల్లిని మోసం చేసి తను కిడ్నాప్ అయినట్టు వెంకట్ తో కలిసి ప్లాన్ చేస్తుంది? వెంకట్, శృతి కలిసి కిడ్నాప్ ప్లాన్ చేసారని తెలుసుకున్న కాటంరాజు ఎలా రియాక్ట్ అవుతాడు? అసలు శృతిని కిడ్నాప్ చేయమని కాంటరాజుకు చెప్పిందెవరు? తల్లిని మోసం చేసి 10కోట్లు డబ్బు తీసుకోవడానికి శృతికి ఉన్న కారణం ఏంటీ? కూతురిని కాపాడుకోవడానికి జ్యోతిలక్ష్మీ 10కోట్లు కిడ్నాపర్స్ కి ఇస్తుందా? వెంకట్ తో శృతి చేసిన ప్లాన్ వర్కవుట్ అవుతుందా? శృతికీ, వెంకట్ కీ ఉన్న సంబంధం ఏంటీ అనేదే 'దొంగాట' సెకండాఫ్.

నటీనటుల పర్ఫార్మెన్స్
శృతి పాత్రను లక్ష్మీ ప్రసన్న చాలా బాగా చేసింది. లైటర్ వీన్ సీన్స్ మాత్రమే కాదు... అనాథ శరణాలయంలోని ఎమోషనల్ సీన్స్ ని హృదయానికి హత్తుకునేలా చేసింది. 'ఏందిరో....' పాటను బాగా పాడటమే కాకుండా డాన్సుల పరంగా కూడా భేష్ అనిపించుకుంది. అలాగే, ఇంట్రడక్షన్ సీన్ ఫైట్ ని కూడా బాగా చేసింది. ఓవరాల్ 'షీ స్టీల్స్ ది షో'. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రముఖంగా నిలిచే వెంకట్ పాత్రను అడవి శేష్ బాగా చేశాడు. పాజిటివ్ గా ఉంటూ చివర్లో నెగటివ్ యాంగిల్ ని బయటపెడతాడు. ఈ రెండు షేడ్స్ ని బాగా చేశాడు. ప్రభాకర్, మధు, ప్రగతి పాత్రల్లో ఒదిగిపోయారు. బ్రహ్మీ.. మ్యాన్ ఆఫ్ ఫైర్ అంటూ బ్రహ్మానందం నవ్వించాడు. పోలీసాఫీసర్ పాత్రల్లో జయప్రకాశ్ రెడ్డి, పృథ్వీ నటన బాగుంది. రానా ఓ సీన్ లో నటించాడు. ఆ సీన్ ఇంప్రసివ్ గా ఉంది. 'బ్రేకప్ అంటూ..' అనే పార్టీ సాంగ్ లో నాగార్జున, రవితేజ, రానా, మనోజ్, నాని, సుధీర్, నవదీప్, శింబు, తాప్సీ కనిపించడం ఓ హైలైట్.

సాంకేతిక వర్గం
కిడ్నాప్ నేపథ్యంలో సాగే ఈ కథను చక్కని స్ర్కీన్ ప్లేతో నడిపించారు. డైరెక్టర్ వంశీకృష్ణతో పాటు స్ర్కీన్ ప్లే ని ఆసక్తికరంగా మలిచిన మోహన్ భరద్వాజ్ ని మెచ్చుకోవాల్సిందే. దర్శకుడిగా వంశీకృష్ణకు మంచి భవిష్యత్తు ఉంది. టేకింగ్ బాగుంది. లక్ష్మీ పాడిన 'ఏందిరో...' పాట చిత్రీకరణ బాగుంది. ఆ పాటకు తను వేసిన స్టెప్స్ బాగున్నాయి. పాటలన్నీ కథానుసారం ఉన్నాయి. బుర్రా సాయిమాధవ్ రాసిన సంభాషణలు కథకు తగ్గ విధంగా ఉన్నాయి. షార్ట్ అండ్ స్వీట్ గా, అక్కడక్కడా పంచ్ లతో డైలాగులు వినసొంపుగా ఉన్నాయి. సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సామల భాస్కర్ కెమెరా పనితనం, ఎస్.ఆర్. శేఖర్ ఎడిటింగ్... బాగున్నాయి.

ఫిల్మీబజ్ విశ్లేషణ
శృతి పాత్రధారి బాగా నటించకపోతే ఈ కథ పండేది కాదు. ఆ పాత్రను లక్ష్మీప్రసన్న సునాయాసంగా చేయడంతో కథ పండింది. పైగా, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తె అనే ఇమేజ్ ఉండటంతో, కొన్ని విషయాల్లో హద్దులు దాటే అవకాశం లేదు. అది బ్యాలెన్స్ చేసుకుంటూ లక్ష్మీ చాలా నీట్ గా కనిపించడంతో పాటు, భేష్ అనిపించుకుంది. మంచి ఫిజిక్, చక్కని బాడీ లాంగ్వేజ్, కారెక్టర్ కి తగ్గట్టుగా సంభాషణలు పలికిన విధానం బాగున్నాయి. సినిమా మొత్తాన్ని లక్ష్మీ తన భుజాలపై నడిపించింది. టోటల్ గా హీరోయిన్ పాత్రను స్టైలిష్ గా చేసింది. నిర్మాతగా ఎంత ఖర్చుపెట్టాలో అంతా పెట్టింది. ఆ రకంగా తనలో మంచి ఫిలిం మేకర్ ఉందని కూడా నిరూపించుకుంది. పాత్రలకు సరిపడా ఆర్టిస్ట్ లను ఎంచుకోవడం ఈ సినిమాకి ప్లస్. ఆడియన్స్ ఎక్స్ ఫెక్ట్ చేయని ట్విస్ట్ లతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ వేసవికి మంచి 'టైమ్ పాస్'గా పనికొస్తుందీ 'దొంగాట'. పిల్లలూ, పెద్దలూ హాయిగా ఎంజాయ్ చేయొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !