View

LION Movie Review

Thursday,May14th,2015, 07:41 AM

చిత్రం - లయన్
బ్యానర్ - యస్.ఎల్.వి సినిమాస్
నటీనటులు - నందమూరి బాలకృష్ణ, త్రిష, రాధిక ఆప్టే, ప్రకాష్ రాజ్, చంద్రమోహన్, ప్రదీప్ రావత్, ఆదిత్య మీనన్, శ్రవణ్, రవిప్రకాష్, యం.యస్.నారాయణ, అలీ, పోసాని కృష్ణమురళి, చలపతిరావు, జయసుధ, గీత, అర్చన, వేణు తదితరులు
సంగీతం - మణిశర్మ
సినిమాటోగ్రఫీ - వెంకటప్రసాద్
ఎడిటింగ్ - గౌతంరాజు
సమర్పణ - జె.రామాంజనేయులు
నిర్మాణ సారథ్యం - రుద్రపాటి ప్రేమలత
నిర్మాత - రుద్రపాటి రమణారావు
కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం - సత్యదేవా
విడుదల తేదీ - 14.5.2015

'లయన్' అనే టైటిల్ తో నందమూరి బాలకృష్ణ సినిమా చేస్తే... భారీ అంచనాలు నెలకొనడం సహజం. పైగా సింహా, లెజెండ్... ఇలా వరుస విజయాలతో బాలయ్య దూసుకెళుతున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత వస్తున్న 'లయన్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలయ్య గెటప్ ఇప్పటికే పలు ప్రశంసలు దక్కించుకుంది.. పాటలు కూడా హిట్టయ్యాయి. నూతన దర్శకుడు సత్యదేవా దర్శకత్వంలో బాలయ్య వీరాభిమాని రుద్రపాటి రమణారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. నటనపరంగా బాలయ్య విజృంభిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక.. ఈ 'లయన్'ని సత్యదేవా ఎలా తీశాడు? సినిమా ఎలా ఉంటుంది? అనే విషయంలోకి వద్దాం.

à°•à°¥
బోస్ (నందమూరి బాలకృష్ణ) బ్రెయిన్ డెడ్ అవ్వడంతో చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారణ చేసి మార్చురీలో పెట్టేస్తారు. కానీ స్పృహ వచ్చిన బోస్ ను తనని తమ కొడుకుగా జయసుధ, చంద్రమోహన్ చెప్పడం, తన పేరు గాడ్సే అని చెప్పడంతో షాక్ అవుతాడు. ఎవ్వరికీ చెప్పకుండా హాస్పటల్ నుంచి బయటికి వచ్చేసి ముంబయ్ నుంచి హైదరాబాద్ వచ్చి తన తల్లిదండ్రుల కోసం వెతుకుతాడు బోస్. తన కంట పడిన ప్రియురాలు మహాలక్ష్మీ (త్రిష)ను గుర్తు పట్టి ఆమె వెనక పడతాడు బోస్. కానీ బోస్ ఎవ్వరో తనకు తెలీదని మహాలక్ష్మీ చెబుతుంది. దాంతో బోస్ తికమకపడతాడు. గుడిలో తన తల్లిదండ్రులు గీత, చలపతిరావును చూసి వారిని కలుస్తాడు. వారు కూడా తనని తమ కొడుకు కాదని చెప్పడంతో బోస్ షాక్ అవుతాడు. తన చెల్లెలు సైతం అలానే చెప్పడంతో ఖంగు తింటాడు. అదే సమయంలో జయసుధ, చంద్రమోహన్ అక్కడికి వచ్చి తమకు తెలీకుండా హైదరాబాద్ వచ్చేసావేంటని, నీ భార్య సరయు (రాధిక ఆప్టే) ఇదిగో అనడంతో డైలమాలో పడతాడు. ఈ సంఘటనలతో తనే గతం మర్చిపోయాననీ, తాను బోస్ కాదు గాడ్సేనని ఫిక్స్ అవుతాడు.

కరెక్ట్ గా ఆ సమయంలో గీత, చలపతిరావు కూతురు నందినిని అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తున్న సమీర్ ని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు బోస్. అప్పుడే గీత, చలపతిరావు గాడ్సేని తమ కొడుకు బోస్ అని అంగీకరిస్తారు. అసలు గీత, చలపతిరావు ఎందుకు తమ కొడుకు బోస్ ని గాడ్సే అని అంటారు? త్రిష ఎందుకు బోస్ ని తన ప్రేమికుడు అని అంగీకరించదు? బోస్ ని జయసుధ, చలపతిరావు ఎందుకు తమ కొడుకు అని చెబుతారు? బోస్ గతం ఏంటీ? రాష్ట్ర ముఖ్యమంత్రి బోస్ మీద ఎందుకు కక్ష కట్టాడు అనేదే ఈ చిత్రం సెకండాఫ్. సి.బి.ఐ ఆఫీసర్ అయిన బోస్ ముఖ్యమంత్రి అరాచకాలకు ఎలా అడ్డుకట్టవేశాడు? అనేది మిగతా కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్
ముందుగా బాలకృష్ణ నటన గురించి చెప్పుకునే ముందు ఆయన లుక్ గురించి చెప్పాలి. కొంచెం స్లిమ్ అవ్వడం వల్ల వయసు తగ్గినట్లుగా అనిపిస్తుంది. అందుకని అభిమానులకు పండగ. ఒకే మనిషిలో రెండు కోణాలు.. ఒకటి గాడ్సే.. ఇంకోటి బోస్. ఈ రెండు కోణాలకూ బాలయ్య వ్యత్యాసం చూపించగలిగారు. బాడీ లాంగ్వేజ్ చాలా స్టయిల్ గా ఉంది. అసలు సిసలు సీబీఐ ఆఫీసర్ ఎలా ఉంటాడో బోస్ పాత్రలో బాలయ్య అలా ఉన్నారు. సంభాషణలు పలికిన విధానం ఎప్పటిలా సూపర్. డాన్సులు, ఫైట్స్ కూడా ఇరగదీశారనే చెప్పాలి. ఎమోషనల్ సీన్స్ ని బాగా పండించారు. కథానాయికల్లో త్రిష సూపర్. చాలా ఫ్రెష్ గా ఉండటంతో పాటు మహాలక్ష్మీ పాత్రను అవలీలగా చేసేసింది. బాలయ్య, త్రిషల కెమిస్ర్టీ చాలా బాగుంది. రాధికా ఆప్టే ఓకే అనిపించుకుంది. విలన్ పాత్రలో ప్రకాష్ రాజ్ పర్ఫార్మెన్స్ సెటిల్డ్ గా ఉంది. నిడివి తక్కువ పాత్రలో కనిపించినా ఇంద్రజ గుర్తుండిపోతుంది. జయసుధ, గీత, చలపతిరావు, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, అలీ... ఇలా భారీ తారాగణం చిత్రంలో ఉన్నారు. అందరరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం
చిత్రదర్శకుడు సత్యదేవా మంచి కథ తయారు చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో బాలయ్యను ఇలాంటి సరికొత్త కథలో చూడలేదు. స్ర్కీన్ ప్లే బాగుంది. సంభాషణలు కూడా బాగున్నాయి. సత్యదేవాకి ఇది తొలి చిత్రం అయినప్పటికీ ఓ అనుభవం ఉన్న టెక్నీషియన్ లా సినిమాని తెరకెక్కించాడు. దర్శకునిగా సత్యదేవాకు మంచి భవిష్యత్తు ఉంది. మణిశర్మ పాటలు పసందుగా ఉన్నాయి. బ్యాగ్రౌంగ్ స్కోర్ కూడా బాగుంది. కెమెరా పనితనం, ఎడిటింగ్.. ఇలా అన్నీ బాగున్నాయి. బాలయ్య వీరాభిమాని అయిన రుద్రపాటి రమణారావు ఈ చిత్రాన్ని రాజీపడకుండా నిర్మించారు. బాలయ్య అంటే తనకెంత అభిమానమో మేకింగ్ పరంగా రుద్రపాటి రమణారావు చాటుకున్నారు. కథ డిమాండ్ చేసిన మేరకు ఖర్చుపెట్టి, మంచి ఫిలిం మేకర్ అనిపించుకున్నారు.

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఇది బాలయ్య 'వన్ మ్యాన్ షో' అనాలి. సినిమా మొత్తాన్నీ తన భుజాల మీద బాలయ్య సునాయాసంగా మోసేశారు. సత్యదేవాని ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సిందే. బాలయ్యను చూపించిన విధానం ట్రెండీగా ఉంది. డౌటే లేదు... బాలయ్యను అద్భుతంగా చూపించి, నందమూరి అభిమానులకు దగ్గరైన దర్శకుల్లో సత్యదేవా కూడా చేరతారు. క్లాస్, మాస్, ఫ్యామిలీ.. అందరూ చూసి ఆనందించదగ్గ చిత్రం. అభిమానులను మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుంది. ఓవర్సీస్ లో ఒకరోజు ముందే 'లయన్' ప్రీమియర్ షో జరిగింది. అక్కడ టాక్ సూపర్. ఇక్కడ కూడా మంచి టాక్ తెచ్చుకుంది.

సో.. సమ్మర్ లో 'లయన్' బాక్సాఫీస్ సందడి చేయడం ఖాయం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పక్కా మ్యాన్లీ 'లయన్' పైసా వసూల్ చేయగల సత్తా ఉన్న పక్కా మాస్ ఎంటర్ టైనర్. 'సింహా', 'లెజెండ్' విజయ పరంపరను 'లయన్' కొనసాగిస్తుందని కన్ ఫార్మ్ గా చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !