View

Oka laila kosam movie review

Friday,October17th,2014, 08:31 AM

చిత్రం - ఒక లైలా కోసం
నటీనటులు - నాగచైతన్య, పూజా హెగ్డే, సుమన్, షయాజీ షిండే, సుధ, రోహిణి, అలీ, పోసాని, శ్యామల, శ్రీ చరణ్ తదితరులు
సంగీతం - అనూప్ రూబెన్స్
కెమెరా - ఆండ్రూ
ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి
నిర్మాత - అక్కినేని నాగార్జున
కథ-మాటలు-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం - విజయ్ కుమార్ కొండా

'లవర్ బోయ్' ఇమేజ్... అక్కినేని కుటుంబానికి చెందిన హీరోలపై ఉంటుంది. డా. అక్కినేని నాగేశ్వరరావు నాటి తరంలో ఆ తర్వాత తరంలో అక్కినేని నాగార్జున ఆ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. కానీ, లవర్ బోయ్ ఇమేజ్ కి మాత్రమే పరిమితం కాకుండా మాస్ చిత్రాలు సైతం చేసి, ఆ రకంగా కూడా నిరూపించుకున్నారు. ఇక, ఈ కుటుంబానికి చెందిన మూడో తరం హీరో నాగచైతన్య కూడా 'లవర్ బోయ్' ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. అప్పడప్పుడూ మాస్ చిత్రాలు చేస్తూ ఆ విధంగా కూడా నిరూపించుకునే పని మీద ఉన్నాడు చైతూ. ఇక.. ఈ లవర్ బోయ్ 'ఒక లైలా కోసం' అనే టైటిల్ తో సినిమా చేస్తే.. 'ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ' చేసి ఉంటాడని అందరూ ఊహించేస్తారు. టైటిల్ ప్రకటించినప్పట్నుంచి సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా టీజర్, పోస్టర్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి.. 'గుండె జారి గల్లంతయ్యిందే' వంటి అందమైన ప్రేమకథా చిత్రానికి దర్శకత్వం వహించిన విజయ్ కుమార్ కొండా ఈ చిత్రానికి దర్శత్వం వహించడం కూడా భారీ అంచనాలకు కారణమైంది. మరి.. అందరి అంచనాలను చేరుకునే విధంగా ఈ చిత్రం ఉందా?.... ఆ విషయంలోకే వెళదాం...

à°•à°¥
కార్తీక్ (నాగచైతన్య) పి.హెచ్.à°¡à°¿. పూర్తి చేస్తాడు. జీవితాన్ని తెలుసుకోవాలని తన తల్లిదండ్రులు సుమన్, సుధ (చంద్రకాంత్, సుధ) దగ్గర అనుమతి తీసుకుని ఏడాది పాటు సరదాగా గడపాలనుకుంటాడు. à°ˆ క్రమంలో ఆర్నెల్లు విదేశాలు వెళ్లి, ఇండియా వస్తాడు. ఇంకా మిగిలింది ఆర్నెల్లే అని, ఈలోపు జీవితంలో ఎలా సెటిల్ కాబోతున్నాడో చెప్పాలని, లేకపోతే తను చెప్పేలా స్థిరపడాలని అంటాడు కార్తీక్ తండ్రి. ఇదిలా ఉంటే... నందన (పూజా హెగ్డే)ని చూసి మనసు పారేసుకుంటాడు కార్తీక్. కానీ, తొలి చూపులోనే అతని మీద దురభిప్రాయం పెంచుకుంటుంది నందన. తన తండ్రి (రాంప్రసాద్) నిర్ణయాలపై నందనకి నమ్మకం ఎక్కువ. కూతురిపై రాంప్రసాద్ à°•à°¿ నమ్మకం ఎక్కువ. à°“ మ్యారేజ్  బ్యూరో ద్వారా కార్తీక్ కుటుంబం నందనను తమ ఇంటి కోడలిగా, నందన కుటుంబం కార్తీక్ తమ ఇంటల్లుడుగా చేసుకుంటే బాగుంటుందనుకుంటారు. మరో వారం రోజుల్లో రెండు కుటుంబాలు మాట్లాడుకోవాలనుకుంటారు. అనుకోకుండా కార్తీక్, నందన కుటుంబం తమ కామన్ ఫ్రెండ్ (చలపతిరావు) ఇంట్లో జరిగే పెళ్లిలో  కలుస్తాయి. ఒకరిపట్ల à°’à°•à°°à°¿à°•à°¿ సదభిప్రాయం ఏర్పడుతుంది. అయితే నందనతోనే తనకు పెళ్లి చేయాలనుకుంటున్నారని కార్తీక్ à°•à°¿, కార్తీక్ తోనే తనకు పెళ్లి కుదురుస్తున్నారని నందనకు తెలియదు. పెళ్లి చూపులకు వెళ్లి, అమ్మాయి నచ్చలేదని చెప్పాలని ఫిక్స్ అయిన కార్తీక్... నందనను చూడగానే ఒప్పేసుకుంటాడు. అప్పటివరకూ తండ్రి ఏ  కుర్రాణ్ణి చూపిస్తే.. అతన్నే చేసుకోవాలనుకున్న నందన.. కార్తీక్ ని చూసి షాక్ అవుతుంది. తండ్రి మాట కాదనలేక తలూపేస్తుంది. కార్తీక్ పై చిన్నప్పటి పగతో అతని మేనమామ (అలీ) à°ˆ పెళ్లి చెడగొట్టాలనుకుంటాడు. à°ˆ పెళ్లి ఎలాగైనా ఆగిపోవాలని నందన కోరుకుంటుంది. చివరికి ఏం జరిగింది? అనేది తెరపై చూడాల్సిందే.

నటీనటుల పర్ఫార్మెన్స్

ఒక లైలా కోసం తపన పడే యువకుడి పాత్రను నాగచైతన్య బాగా చేశాడు. అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న చైతూ ఈ చిత్రంతో మరింత దగ్గరవుతాడు. తన తాత నటించిన 'ఒక లైలా కోసం..' పాట రీమిక్స్ లో చైతూ చాలా జోష్ గా చేశాడు. స్నేహితులతో సరదా పన్నివేశాల్లోనూ, ప్రేమించిన అమ్మాయి తన ప్రేమను అంగీకరించాలనే తపన పడే సీన్స్ లోనూ ఆకట్టుకున్నాడు. పూజా హెగ్డే అందంగా ఉంది. తనలో మంచి నటి ఉంది. గాళ్ నెక్ట్స్ డోర్ అనిపించే పాత్ర తనది. మనం కూడా తనను 'మన పక్కింటి అమ్మాయి'లానే ఫీలవుతాం. పాజిటివ్ కేరక్టర్ లో షయాజీ షిండే ఆకట్టుకున్నాడు. ఇంకా ఇతర పాత్రల్లో సుమన్, సుధ, రోహిణి, అలీ తదితరులు ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం
ఈ స్టోరీ లైన్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రేమకథా చిత్రాలన్నిటికన్నా భిన్నంగా ఉంది. నాయిక చివరి వరకు కథానాయకుణ్ణి ప్రేమించదు. మరి.. తన ప్రేమను హీరో ఎలా దక్కించుకున్నాడు? అనేది చివరి వరకూ దర్శకుడు ఆసక్తకిరంగా మలిచాడు. అనూప్ ఇచ్చిన పాటలు ఫర్వాలేదనిపించే విధంగా ఉన్నాయి. ఆండ్రూ ఫొటో్గ్రఫీ ఓ బ్యూటిఫుల్ మ్యాజిక్ అనే అనాలి. ప్రతి సీను అందంగా, కలర్ ఫుల్ గా ఉంది. ఆహ్లాదకరంగా ఉంది. మాటలు ఓకే. ఎడిటింగ్, ఇతర విభాగాల పని తీరు బాగానే ఉంది. కథ పరిధి మేరకు బాగానే ఖర్చు పెట్టారు.

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఏ సినిమా తీసుకున్నా.. ఫస్టాఫ్, సెకండాఫ్ అని విభజించి తమ అభిప్రాయాన్ని చెబుతుంటారు. అలా ఈ సినిమా ప్రథమార్థం, ద్వితీయార్థాన్ని తీసుకుంటే... సెకండాఫ్ కన్నా ఫస్టాఫ్ చాలా బాగుంది. ఇంటర్వెల్ ఎప్పుడు వచ్చిందో తెలియనంత వేగంగా, సరదాగా సాగుతుంది. సెకండాఫ్ స్లో గా ఉందని చెప్పలేం కానీ.. బలంగా ఉండాల్సిన రెండు, మూడు సన్నివేశాల చిత్రీకరణ అంత చెప్పుకోదగ్గ విధంగా లేదు. ఆ ఒక్క లోపం కూడా లేకుండా ఉండి ఉంటే.. లైలా సుపర్బ్. దాదాపు రెండు గంటలు అసహ్యించుకున్న అబ్బాయి మనసుని పుస్తకం ద్వారా తెలుసుకుంటుంది హీరోయిన్. ఆ సన్నివేశం మరింత బలంగా ఉండి ఉంటే బాగుండేది. అలీ పాత్ర ఎంటర్ అయినప్పట్నుంచి.. ఎండింగ్ వరకు నవ్విస్తుంది. ఆ పాత్ర ఓ రిలీఫ్. ఓవరాల్ గా ఇది నీట్ మూవీ. లవర్స్ చూడొచ్చు, ఫ్రెండ్స్ చూడొచ్చు, కుటుంబ సమేతంగా చూసే సినిమా. యూత్ బాగా ఎంజాయ్ చేస్తారని ఊహించవచ్చు.
ఒక్క లైన్ లో చెప్పాలంటే.. ప్రస్తుతం రేస్ లో వేరే సినిమా లేదు. నీట్ గా, కూల్ గా సాగే మూవీ కాబట్టి.. ఎంజాయ్ చేయొచ్చు.

Oka laila kosam movie review



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !