View

Pandaga Chesko Movie Review

Friday,May29th,2015, 08:56 AM

చిత్రం - పండగ చేస్కో
బ్యానర్ - యునైటెడ్ మూవీస్
నటీనటులు - రామ్, రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్, సాయికుమార్, రావు రమేష్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, బ్రహ్మాజీ, అభిమన్యుసింగ్, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను, తేజస్విని, యం.యస్.నారాయణ, సురేఖా వాణి, పవిత్రాలోకేష్, ప్రియ తదితరులు
à°•à°¥ - వెలిగొండ శ్రీనివాస్‌
మాటలు - కోన వెంకట్‌
రచనా సహకారం - అనిల్‌ రావిపూడి
కెమెరా - సమీర్‌రెడ్డి, ఎడిటింగ్‌ - గౌతంరాజు
సంగీతం - తమన్ ఎస్‌.ఎస్‌
సమర్పణ - పరుచూరి ప్రసాద్‌
నిర్మాత - పరుచూరి కిరీటి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం - గోపీచంద్‌ మలినేని

ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త, మసాలా... ఇలా ఈ మధ్య రామ్ చేసిన మూడు చిత్రాలూ ఆశించిన ఫలితం సాధించలేదు. ఆ విధంగా రామ్ కెరీర్ కొంత మైనస్ లో ఉందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో చేసిన 'పండగ చేస్కో' ప్లస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు రామ్. టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమా చూసే వాళ్లకి పండగ చేసుకున్నట్లుగా ఉంటుందని రామ్ చెబుతూ వచ్చాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పరుచూరి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నిజంగానే పండగలంత పసందుగా ఉందా? వరుసగా మూడు ఫెయిల్యూర్స్ లో ఉన్న రామ్ కెరీర్ ని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందా... చూద్దాం.

à°•à°¥
పోతినేని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి యం.డి కార్తీక్ పోతినేని (రామ్). యు.యస్ లో తల్లిదండ్రులు (పవిత్రాలోకేష్, రావు రమేష్)తో సెటిల్ అయిన కార్తీక్ తన తెలివితేటలతో బిజినెస్ ని విస్తరించి సెంటిమెంట్స్ కి పెద్దగా విలువ ఇవ్వకుండా, బిజినెస్ ని పెంచుకుంటూ పోవాలనే టార్గెట్ తో ఉంటాడు. ఓ బిజినెస్ డీల్ కి సంబంధించి బిజినెస్ మ్యాగ్నెట్ అనుష్క (దివ్య)ను కలుస్తాడు. బిజినెస్ పరమైన డీల్స్ చేసుకునే విషయంలో ఇద్దరిది ఒకే రకమైన మైండ్ సెట్. తన తాత వీలునామా ప్రకారం ఓ ఇండియన్ కుర్రాడిని పెళ్లి చేసుకుంటే మూడు వేల కోట్లు ప్రాపర్టీ తనకు దక్కతుంది, లేకపోతే మొత్తం ప్రాపర్టీ ట్రస్ట్ పరమైపోతుందని తెలుసుకుని కార్తీక్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది అనుష్క. బిజినెస్ పరమైన డీల్స్ ఆమెతో కుదరడంతో కార్తీక్ కూడా ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. తన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా అనుష్కతో ఎంగేజ్ మెంట్ చేసుకుంటాడు కార్తీక్.

ఎంగేజ్ మెంట్ అయిన తర్వాత కార్తీక్ తల్లి తన వల్ల కొంతమంది జీవితాలు నాశనం అయ్యాయని, వారి జీవితాలను సరిదిద్దుతావనుకున్నానని చెబుతుంది. తను ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల తన అన్నయ్యలకు తను దూరమైన వైనం, దానివల్ల తన అన్నయ్యలు తమ భార్యలను ఇంటి నుంచి గెంటివేసిన వైనం కార్తీక్ కి చెబుతుంది. అది విన్న కార్తీక్ తన తల్లి వల్ల జరిగిన పొరపాటును సరిదిద్ధి తన అత్త, మామయ్యలను కలపడంతో పాటు, తన తల్లిని ఆమె అన్నయ్యల దగ్గరకు చేర్చాలనే టార్గెట్ తో ఇండియాలో అడుగుపెడతాడు.

తన పెద్ద మామయ్య కూతురు దివ్య (రకుల్) ని కలుసుకుని ఆమె వెంటపడి ప్రేమలో దింపడానికి ట్రై చేస్తాడు. తన కూతురికి కరెక్ట్ భర్త కార్తీక్ అని భావించి అతనిని అల్లుడిని చేసుకోవడానికి దివ్య తండ్రి అంగీకరిస్తాడు. కానీ కార్తీక్ తన చెల్లెలు కొడుకు అన్న విషయం తెలియదు. దివ్యను పెళ్లి చేసుకునే నెపంతో తన తల్లి సొంత ఊరు బొబ్బిలి చేరుకుని తన అత్తయ్య, మామయ్యలను కలుసుకుంటాడు కార్తీక్. విడివిడిగా ఉంటున్న అత్త, మామయ్యలను కలపడానికి ప్లాన్ చేస్తాడు. తన తల్లిని ఆమె అన్నయ్యలతో కలపడానికి ప్లాన్ చేస్తాడు. కార్తీక్ వేసిన ప్లాన్స్ సక్సెస్ అవుతాయా? దివ్యను కార్తీక్ పెళ్లి చేసుకుంటాడా? కార్తీక్ తో ఎంగేజ్ మెంట్ అయిన అనుష్క ఏం చేస్తుందనేదే ఈ చిత్రం సెకండాఫ్.

నటీనటుల పర్ఫార్మెన్స్
రామ్ మంచి నటుడు. తొలి చిత్రం 'దేవదాసు'తోనే అది ప్రూవ్ అయ్యింది. ఈ సినిమాలో కార్తీక్ క్యారెక్టర్ ని బాగా చేశాడు. బిజినెస్ మ్యాగనెట్ కాబట్టి, అలా కనిపించడం కోసం సన్నబడ్డాడు. స్టయిలిష్ గా కనిపించాడు. ఫైట్స్, డాన్స్ బాగా చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ చూడచక్కగా ఉంది. నటనపరంగా పెద్దగా స్కోప్ లేని కారెక్టర్. యారోగెంట్ కారెక్టర్ ని సొనాల్ చౌహాన్ బాగా చేసింది. ఇంకా, రావు రమేష్, సాయికుమార్, బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, తేజస్విని... ఇలా సినిమాలో ఉన్న నటీనటులందరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతిక వర్గం
వెలిగొండ శ్రీనివాస్ అందించిన కథలో కొత్తదనం లేదు. బయటి హీరోల చిత్రాలను పక్కన పెడితే రామ్ నటించిన 'రెడీ' షేడ్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. రొటీన్ కథకు అక్కడక్కడా కొన్ని కొత్త ట్విస్టులు జోడించి, గోపీచంద్ మలినేని తీశాడు. కోన వెంకట్ రాసిన సంభాషణలు ఫర్వాలేదనిపించుకున్నాయి. తమన్ పాటలు అతని గత చిత్రాల్లానే గోల గోలగా ఉన్నాయి. ఒక్క పాట కూడా వినసొంపుగా ఉండదు. సమీర్ రెడ్డి కెమెరా పనితనం కనువిందుగా ఉంది. సినిమా మొత్తం కలర్ ఫుల్ గా ఉంది. బడ్జెట్ కి వెనకాడకుండా నిర్మించిన వైనం స్పష్టంగా కనిపిస్తుంది.

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఈ కథను రామ్ ఎలా ఒప్పుకున్నాడా? అనే ప్రశ్న ప్రేక్షకులకు కలగక మానదు. ఎందుకంటే, చిన్న చిన్న మార్పులతో కొంచెం అటూ ఇటూగా 'రెడీ'లానే ఉంటుంది. అలాగే, సెకండాఫ్ 'అత్తారింటికి దారేది'లానే ఉంటుంది. కాకపోతే, అక్కడ హీరో అత్తింటికి దారి వెతుక్కుంటూ వస్తే, ఇక్కడ హీరో మేనమామ ఇంటికి దారి వెతుక్కుంటూ వస్తాడు. అంతే తేడా. హీరో ఓ ఇంట్లో సెటిలై, కుటుంబం మొత్తాన్ని కలపడం అనే కాన్సెప్ట్ ఫీవర్ నుంచి ఇంకా టాలీవుడ్ బయటపడ్డట్లు లేదు. ఫ్యామిలీ డ్రామాలా అనిపిస్తుందేకానీ, ముఖ్యమైన సన్నివేశాల్లో కూడా సెంటిమెంట్ పండలేదు. తన తల్లి వల్ల జరిగిన పొరపాటుతో కుటుంబాలు విడిపోయాయిని హీరోకి తెలిసే సీన్ కూడా చాలా పేలవంగా సాగుతుంది. దాంతో ప్రేక్షకులు ఏ సీన్ కి కనెక్ట్ అవ్వరు. తీసిందే తీసి.. తీసి.. తీసి.. ఇంకా ఏం తీస్తారు? అరిగిపోయిన రికార్డులా అనిపిస్తోందని ప్రేక్షకులు విసుగు చెందడం ఖాయం. ఈ సినిమా ఫస్టాఫ్ సోసోగా అనిపించింది. సెకండాఫ్ బ్రహ్మాండంగా ఉంటుందిలే అని ఏ పాప్ కార్నో, కూల్ డ్రింకో ఆస్వాదిస్తూ, చూడ్డానికి ప్రిపేర్ అయిన ప్రేక్షకులకు సినిమాకన్నా ఆ రెండూ పసందుగా ఉన్నట్లు అనిపిస్తాయి. ఆ రెండూ చేతిలో లేనివాళ్లకి కనీసం ఆ కాలక్షేపం కూడా ఉండదు. 'పండగ చేస్కో' అని పెట్టారు కాబట్టి, ఏదో ఒక పండగను గుర్తు చేసుకుంటూ సినిమా చూద్దాం అంటే.. ప్చ్ ఒక్క పండగ గుర్తుకు రాదు. సినిమా ఎప్పుడెప్పుడు అవుతుందా? అప్పుడు థియేటర్లోంచి బయటికెళ్లి, పండగ చేసుకుందామా? అనిపిస్తుంది. దర్శకుడు గోపీచంద్ మలినేని మంచి కథ ఎన్నుకోవడంలో విఫలమయ్యాడు. అందుకని దర్శకత్వ ప్రతిభ గురించి చెప్పడానికి ఏమీ లేదు.

ఫైనల్ గా చెప్పాలంటే.. థియేటర్లో ఉన్నంతసేపూ పండగ చేసుకోవడం కష్టమే. బయటికొచ్చాక మాత్రం పండగే పండగ. హమ్మయ్య ఇంటి దారి పట్టి, సినిమా తాలూకు హ్యాంగోవర్ తగ్గడానికి కాసిన్ని టీ నీళ్లు తాగితే, అదే పెద్ద పండగలా అనిపిస్తుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !