View

Yamaleela 2 Movie Review

Friday,November28th,2014, 08:14 AM

చిత్రం - యమలీల 2

బ్యానర్ - క్రిష్వీ ఫిలింస్

నటీనటులు - డా.మోహన్ బాబు, డా.కె.వి.సతీష్, దియా నికోలస్, బ్రహ్మానందం, సదా, కోటా శ్రీనివాసరావు, ఎం.ఎస్.నారాయణ, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, గీతాంజలి, నిషా కొఠారి, షాయాజీ షిండే, ఉత్తేజ్ తదితరులు

ఫొటోగ్రఫీ - శ్రీకాంత్ నారోజ్

ఎడిటర్ - గౌతంరాజు

మాటలు - గంగోత్రి విశ్వనాధ్, భవానీ ప్రసాద్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - ఎం.ఎ.జగన్నాధ్ రెడ్డి, క్రిష్వి ఫిలింస్ C.E.O - డి.కె.అరుణ్ కుమార్

కథ, స్ర్కీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం - ఎస్.వి.కృష్ణా రెడ్డి M.com

సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'యమలీల' ఏ స్థాయిలో అలరించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. à°† చిత్రంలోని హిమక్రీములను, ధూంతక ధూంతకలను ఎప్పటికీ  à°®à°°à±à°šà°¿à°ªà±‹à°²à±‡à°‚.. మళ్లీ హిమక్రీముల రుచి, ధూంతకల సందడి ప్రేక్షకుల ముందు ఆవిష్కరించడానికి కృష్ణారెడ్డి 'యమలీల 2' à°•à°¿ శ్రీకారం చుట్టారు. మళ్లీ యమసందడి ఖాయం అని ప్రేక్షకులు అంచనాలు పెంచుకున్నారు. à°¡à°¾. కేవీ సతీశ్ ని హీరోగా పరిచయం చేస్తూ.. à°¡à°¾. మోహన్ బాబు యమునిగా, బ్రహ్మానందం చిత్రగుప్తునిగా ఎస్వీకె à°ˆ చిత్రం రూపొందించారు. ఇక.. à°ˆ 'యమలీల 2' ఎలా ఉందో చూద్దాం...

à°•à°¥

దేవకన్యలు మానస సరోవరంలో జలకాలాడుతుంటే, వారిని చూసి ఆస్వాదించడానికి చిత్రగుప్తుడుతో సహా యమలోకం నుంచి భూలోకానికి వస్తాడు యమధర్మరాజు (మోహన్ బాబు). వ్యత్తి ధర్మం నిర్వర్తించాలి కాబట్టి చిత్రగుప్తుడు (బ్రహ్మానందం) తనతో పాటు భవిష్యవాణిని కూడా తీసుకువస్తాడు. తన కోసం ఎదురుచూస్తూ ఉండమని చెప్పి మానస సరోవరంలోకి వెళ్లిన యముడు 15రోజులు అయినా రాకపోయేసరికి కంగారుపడతాడు చిత్రగుప్తుడు. మానస సరోవరం దగ్గర కనిపించిన క్రిష్ (కె.వి.సతీష్) చేతికి భవిష్యవాణిని ఇచ్చి, ఆ పుస్తకంని తెరిచి చూడొద్దని చెప్పి యముడిని వెతకడానికి వెళతాడు చిత్రగుప్తుడు. కానీ భవిష్యవాణిని తెరచి చూసిన క్రిష్ కి తను మూడు రోజుల్లో చనిపోతాననే విషయం తెలుసుకుంటాడు. దాంతో భవిష్యవాణిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. యముడితో సహా తిరిగొచ్చిన చిత్రగుప్తుడికి తను భవిష్యవాణి అప్పజెప్పిన కుర్రాడు కనబడకపోవడంతో కంగారుపడతాడు. యముడు, చిత్రగుప్తుడు కలిసి బ్రహ్మదేవుడు ఇచ్చిన క్లూతో క్రిష్ ని పట్టుకోవడానికి బయలుదేరతారు. ఇంతకీ క్రిష్ ఎవరు? అనే విషయంలోకి వస్తే...

క్రిష్ ది చక్కటి ఫ్యామిలీ. అమ్మా, నాన్న, అన్నయ్యలు, వదినలు, అక్కయ్యలు, బావలు, వాళ్ల పిల్లలతో కళకళలాడే కుటుంబంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాడు క్రిష్. వృత్తి పరంగా ఆంకాలజిస్ట్. à°’à°• సందర్భంలో తన అన్నయ్య కూతురు  à°¶à±à°µà±‡à°¤ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుందని తెలుసుకున్న క్రిష్ తన కుటుంబానికి à°ˆ విషయం తెలియనివ్వకుండా పాప వ్యాధి కోసం మందుని కనిపెడతానికి మానస సరోవరం వస్తాడు. అక్కడే చిత్రగుప్తుడిని కలవడం, తను మూడు రోజుల్లో చనిపోతానని క్రిష్ తెలుసుకోవడం జరుగుతుంది. దాంతో తను చనిపోయేలోపల పాపను కాపాడాలనే ఉద్దేశ్యంతో భవిష్యవాణిని దొంగిలించి దాచేస్తాడు. మరి యముడు, చిత్రగుప్తుడు భవిష్యవాణిని కనిపెట్టారా? క్రిష్ చావుకు ఎదురీది శ్వేతను కాపాడుకుంటాడా? క్రిష్ తయారు చేసిన మందు శ్వేత వ్యాధిని నయం చేస్తుందా? అన్న కూతుర్ని కాపాడకుండానే క్రిష్ తిరిగి రాని లోకాలకు వెళతాడా? తదితర ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే 'యమలీల 2' చూడాల్సిందే.

నటీనటుల పర్ఫార్మెన్స్

యముడి పాత్ర చేయాలంటే ఆహార్యం ముఖ్యం. ఆహార్యం ఉంటే.. సరిపోతుందా? శక్తిమంతమైన మాటలు పలకాలి కదా. అందుకే యముడి పాత్రను ఎవరు పడితే వాళ్లు చేయలేరు. నాడు ఎస్వీ రంగారావు ఈ పాత్రలో భేష్ అనిపించుకున్నారు. ఇరవయ్యేళ్ల క్రితం 'యమలీల'లో కైకాల సత్యనారాయణ కూడా ఆ పాత్రను అద్భుతంగా చేశారు. ఆ తర్వాత 'యమదొంగ'కు మోహన్ బాబు మంచి అండ అయ్యారు. నేడు 'యమలీల 2'లో కూడా అంతే. యముడి పాత్రను మోహన్ బాబు అద్భుతంగా పోషించారు. ఆహార్యం, అభినయం అద్భుతం. డైలాగులు పలికిన తీరు భేష్. ఈ సినిమాకి పెద్ద ప్లస్ మోహన్ బాబు. చిత్రగుప్తుడి పాత్ర అంటే బ్రహ్మానందం చేయాల్సిందే అని నాటి 'యమలీల', నేటి 'యమలీల 2' నిరూపించాయి.. తొలి పరిచయం సతీశ్ విషయానికొస్తే.. అతని స్ర్కీన్ అఫియరెన్స్ బాగుంది. ఫైట్స్ లో కనబర్చిన ఎమోషన్ బాగుంది. సెంటిమెంట్ సీన్స్ లో ఇంకాస్త ఎమోషన్ పలికిస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. కానీ, తొలి అడుగుకే జోరుండాలని ఎదురుచూడలేం కాబట్టి, సతీశ్ ఓకె అని చెప్పొచ్చు. ఒక పాటలో సదా మెరిసింది. ఇంకా కోట, గీతాంజలి, రావు రమేఫ్, ఆశిష్ విధ్యార్థి, షయాజీ, దియా నికొలస్, బేబి శ్వేతా తదితరులు పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతిక వర్గం

ఓ కొత్త హీరోతో ఏ స్థాయి నటన రాబట్టుకుంటే అతని భవిష్యత్తుకి మంచిదో ఆ స్థాయి నటననే రాబట్టుకున్నారు ఎస్వీకే. హీరోయిజమ్ ని ఎలివేట్ చేయాలనే ప్రాసెస్ లో అతి చేసి ఉంటే.. సతీశ్ కి మైనస్ మార్కులు పడి ఉండేవి. కానీ, ఎస్వీకే లౌక్యంగా తీశారు. ఆయన దర్శకత్వ ప్రతిభకు ఇదో నిదర్శనం. పాటల్లో 'కృష్ణం భజే...' థియేటర్ నుంచి వచ్చాక కూడా హాంట్ చేస్తుంది. మిగతా పాటలు వినసొంపుగానే ఉన్నాయి. శ్రీకాంత్ నారోజు కెమెరా పనితనం బాగుంది. గంగోత్రి విశ్వనాథ్, భవానీ ప్రసాద్ అందించిన సంభాషణలు అక్కడక్కడా బాగున్నాయి. ఇతర శాఖల తీరు బాగానే ఉంది.

ఫిల్మీబజ్ విశ్లేషణ

అనుభవం ఉన్న దర్శకులెవరైనా అన్ని సన్నివేశాలూ ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఉండాలనుకుంటారు, ఎస్వీకే అలానే అనుకున్నారు. అందుకే, 20, 30మంది కండలు తిరిగిన రౌడీలను à°“ యువకుడు రఫ్ఫాడిస్తే నమ్మశక్యంగా ఉండదని, à°† కుర్రాడికి యమ పవర్ వచ్చినట్లు సన్నివేశం అల్లారు. హిమక్రీములు, ధూంతకల సందడి  à°¬à°¾à°—ానే ఉన్నా, ఎస్వీకే à°—à°¤ 'యమలీల'లో ఇంకా పండాయి. సెంటిమెంట్ కూడా అంతే. పాత 'యమలీల'లో మనసుని మెలిపెడుతుంది. à°ˆ చిత్రంలో కూడా ఫీల్ ఉన్నా.. అంతగా మెలిపెట్టదు. లైటర్ వీన్ లో సాగుతుంది. ఇలా పాత, కొత్తతో పోల్చడకుండా.. 'యమలీల 2' చూస్తే... బాగానే ఉన్నట్లనిపిస్తుంది. క్రిష్వీ ఫిలింస్ నిర్మాణ విలువలు బాగున్నాయి. కనువిందైన సెట్స్, తారల కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్.. సినిమా మొత్తం అద్భుతమైన పెయింటింగ్ లా ఉంది.

ఫైనల్ à°—à°¾  à°šà±†à°ªà±à°ªà°¾à°²à°‚టే... కుటుంబ సమేతంగా చేసే చిత్రాలు మనకు తక్కువయ్యాయి.à°ˆ తరహా చిత్రాలు అడపా దడపా మాత్రమే వస్తున్నాయి కాబట్టి, కుటుంబంతో సహా 'యమలీల 2'ను ఓసారి చూడొచ్చు. బాక్సాఫీస్ దగ్గర యమ సందడి ఏ రేంజ్ లో ఉంటుందో.. వేచి చూద్దాం.

Yamaleela 2 Movie Review



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !