View

Friday,April18th,2014, 02:32 AM

లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.వెంకటేశ్వరరావు నిర్మించిన చిత్రం 'రేసు గుర్రం'. అల్లు అర్జున్, శృతిహాసన్ గా జంటగా రూపొందిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. సలోని, శ్యామ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు చేసారు. ఇటీల విడుదలైన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం యూనిట్ గురువారం అన్నపూర్ణ 7 ఎకరాల్లో సక్సెస్ మీట్ ని జరిపింది. ఇందులో భాగంగా...

డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ - ''నా కెరియర్ లో బ్లాక్ బస్టర్లు, మంచి విజయవంతమైన చిత్రాలు లేవనే కొరత 'రేసు గుర్రం' తీర్చింది. ప్రతి సినిమాకి కష్టపడతాము. కానీ ప్రతిఫలం అన్నింటికీ దక్కదు. కానీ 'రేసు గుర్రం' సినిమాకి అన్నీ చక్కగా కుదిరాయి. వక్కంతం వంశీ ఇచ్చిన కథ, కెమెరామాన్ మనోజ్ పరమహంస విజువల్స్, సంగీత దర్శకుడు తమన్, స్ర్కీన్ ప్లే విషయంలో సహకారం అందించిన విక్కీ, దీపక్ వల్లే ఈ చిత్రాన్నిఅద్భుతంగా తీర్చదిద్దగలిగాను. వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక బన్నీ (అల్లు అర్జున్) లక్కీ పాత్రను చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. పూర్తిగా పాత్రలో ఒదిగిపోయాడు. ఈ సినిమా విజయంలో  నా తల్లిదండ్రలు, భార్య, పిల్లల సహకారం కూడా ఉంది. మా నిర్మాతలు బుజ్జి, వెంకటేశ్వరరావుగారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని చాలా రిచ్ గా నిర్మించారు. నన్ను ఎంకరేజ్ చేసిన వారికి కృతజ్ఞతలు'' అని తెలిపారు.

అల్లు అరవింద్ మట్లాడుతూ - ''ఈ సినిమాని చూసినన వారు అల్లు అర్జున్ నటన చిరంజీవిని గుర్తుకు తెస్తుందని చెబుతున్నారు. ఈ మాటలు మా కుటుంబానికి అందిన అభినందనలుగా భావిస్తున్నాము. కొడుకు సినిమా హిట్ అయితే ఆ కిక్కే వేరబ్బా. ఈ సినిమా హిట్ అవ్వడానికి వెనుక ఈ చిత్రం యూనిట్ కృషి ఉంది. వారందరికీ నా అభినందనలు'' అని చెప్పారు.

డా.కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ - ''నటన విషయంలో చిరంజీవిగారిరకి బన్నీ బాగా దగ్గరవుతున్నాడు. ఇంత పెద్ద విజయం అందుకున్నందుకు ఆనందంగా ఉంది'' అని తెలిపారు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ - ''నా ఖాతాలో బ్లాక్ బస్టర్ సినిమాగా నమోదయ్యింది 'రేసు గుర్రం'. చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నా పేరు లక్కీ. ఆ పేరు నాకు సరిగ్గా సరిపోతుంది. మంచి కుటుంబంలో పుట్టాను.  పది మెట్లు సక్సెస్ ఫుల్ గా నా కుటుంబ సభ్యులు నన్నుఎక్కించి 11వ మెట్టు నుంచి నేను ఎక్కేలా చేసారు. అంతకంటే అదృష్టం ఏముంటుంది. రేసు గుర్రం చిత్రానికి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నా సినిమాలు వన్ మాన్ షో అవ్వాలని నేనెప్పుడూ అనుకోను. చివరి 15నిముషాలు బ్రహ్మానందంకి ఇంపార్టెంట్స్ ఇవ్వడమేంటనీ అందరూ అడుగుతున్నారు. కానీ కథ ప్రకారం వెళ్ళడమే నాకు ఇష్టం. తమన్ సంగీతం, రామ్ లక్ష్మణ్ ఫైట్లు, మనోజ్ పరమహంసగారి కెమెరా వర్క్, సురేందర్ రెడ్డిగారి దర్శకత్వం, కథ, స్ర్కీన్ ప్లే అన్నీ ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఈ సినిమా కథను సురేందర్ రెడ్డి 10సార్లు చెప్పారు. అతని తపన చూసి, సినిమా బాగా రావాలని, అతని కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని కోరుకున్నాను. ఎందుకంటే నా వరకూ నేను ఇంట్లో ఎలా ఉంటానో అలానే సెట్ లో కూడా ఉన్నాను. డైరెక్టర్ ఏం చెబితే అది చేసాను. ఈ రోజు దక్కిన విజయం చాలా ఆనందాన్ని ఇస్తోంది. సినిమా హిట్ అవ్వడానికి అందరం కష్టపడ్డాం. ఈ రోజు అందరం ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నాం'' అని అన్నారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ - ''ఇప్పటివరకూ 987సినిమాల్లో నటించాను. కిల్ బిల్ పాండేగా నా పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు. బన్నీ ఈ సినిమాకి బాగా కష్టపడ్డాడు. కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. సురేందర్ రెడ్డి నా పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు. సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు'' అని చెప్పారు.

ఇంకా ఈ సినిమా విజయం పట్ల హీరోయిన్ శృతిహాసన్, రైటర్ వక్కంతం వంశీ, దిల్ రాజు, కోట శ్రీనివాసరావు, రవికిషన్, కిక్ శ్యామ్, తాగుబోతు రమేష్, తమన్, పోసాని కృష్ణమురళి, రామ్ లక్ష్మణ్, మనోజ్ పరమహంస తదితరులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for an exciting project. The film is going to have ..

Read More !

We all know that stylish star Allu Arjun bagged a humongous success with 2014's blockbuster hit film Race G ..

Read More !

Creative director Krishna Vamsi who scored a debacle with his previous film Nakshatram is currently busy wi ..

Read More !

Mahesh Babu and Jr. NTR are two huge stars of Telugu Cinema. If Pawan Kalyan, stops making movies, then Mah ..

Read More !

Hansika Motwani is the popular South Indian actress who has made it big with Tamil movies. Though she made ..

Read More !

Koratala Siva is busy with his new movie, Bharat Ane Nenu with Mahesh Babu. The combination has a lot of cr ..

Read More !

Young hero Nithiin is currently very much busy with the shooting of his new film in the direction of Krishn ..

Read More !

Young Tiger JR NTR always wanted to make it big with the selection of the scripts. Tarak was ready to exper ..

Read More !

Gossips

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for ..

We all know that stylish star Allu Arjun bagged a humongous ..

Creative director Krishna Vamsi who scored a debacle with hi ..

Mahesh Babu and Jr. NTR are two huge stars of Telugu Cinema. ..

Hansika Motwani is the popular South Indian actress who has ..

Koratala Siva is busy with his new movie, Bharat Ane Nenu wi ..

Young hero Nithiin is currently very much busy with the shoo ..

Young Tiger JR NTR always wanted to make it big with the sel ..

Young Rebel Star Prabhas, who is currently busy with Saaho, ..

Manchu Vishnu was supposed to be seen in a film based on Bha ..

Rashmi Gautham is a popular TV host on Telugu Television spa ..

Once a director enters the Mega compound, he will be offered ..

Well, as they in politics no one is permanent friend and for ..

Ram Charan’s film with legendary director Mani Ratnam ..

These days, most of the heroines step into female-oriented r ..

As Mega Star Chiranjeevi’s comeback film ‘Khaidi ..

Pawan Kalyan has been in the news from the past few days wit ..

A strong grapevine has been making rounds about pretty Rakul ..

Do you know that Megastar Chiranjeevi considered several her ..

Ever since her relation with Akkineni Naga Chaitanya became ..

Read More !

responsive web development company in hyderabad india

Videos

Allu Arjun Starrer son of satyamurthy 50 days Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor

Satya Karthik Starrer Tippu Movie Theatrical Trailor

Ram, Rakul, Sonal Starrer Pandaga Chesko Movie New Trailor

Read More !