View

చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని వెనకడుగు వేస్తారా?

Saturday,February22nd,2014, 06:19 AM

స్వార్ధ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ని రెండు ముక్కలు చేసాయి. తెలుగు ప్రజలు సీమంధ్రావాదులుగా, తెలంగాణావాదులుగా చీలిపోయారు. ప్రస్తుతం తెలుగుజాతికి రెండు రాష్ర్టాలు నెలకొనడం తెలుగువారికి మింగుడుపడకపోయినప్పటికీ, వాస్తవం ఇదే కాబట్టి మెల్లిమెల్లిగా ప్రజలు ఈ పరిస్థితిని తట్టుకుని ముందుకు సాగడానికి సమాయత్తమవుతున్నారు. కానీ ఈ పరిస్థితులను ఆకళింపు చేసుకునే ప్రయత్నంలో జరుగుతున్న చర్చల్లో చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు నటుల గురించి మాత్రం మాట్లాడక తప్పడం లేదు.

ముక్కుసూటితనమే ఎన్టీఆర్ ఆయుధం...
నటుడిగా, వ్యక్తిగా తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవం ఎన్టీఆర్. మంచి నటుడిగా మాత్రమే కాకుండా, తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని కాపాడిన వ్యక్తిగా తెలుగు ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్న వ్యక్తి ఎన్టీఆర్. మేకప్ వేసుకుని చేతినిండా డబ్బులు సంపాదించేస్తూ, నటుడిగా ఉన్నత శిఖరాలను అందుకున్న ఎన్టీఆర్ అక్కడితో ఆగిపోలేదు. తను పుట్టిన నేలకు ఏదో చేయాలి, తనను ఇంత ఎదిగేలా చేసిన తెలుగు చిత్ర పరిశ్రమను పొరుగు రాష్రం నుంచి తరలించి సొంత రాష్ట్రంలో స్థిరపడేలా చేయాలి, తెలుగు జాతిని ఏకతాటిపైన నడిచేలా చేయాలి, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కాపాడటం కోసం తెలుగునాట రాజకీయ పార్టీ ఏర్పడాలి అనే ఆలోచనలకు రూపకల్పన చేసి 9 నెలలో 'తెలుగుదేశం' పార్టీ ఏర్పాటు చేసి అధికారాన్ని కైవసం చేసుకున్నవ్యక్తి ఎన్టీఆర్. ఆయన మీద ఉన్న అభిమానం, ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఏంటి? ప్రాంతీయ పాలన ఉండాలనే ఆకాంక్షతో, ఎన్టీఆర్ మీద నమ్మకం, గౌరవాభిమానాలతో తెలుగు ప్రజలు ఆయనకు పట్టం కట్టారు.అధికారంలోకి వచ్చిన ఆయన కేవలం మాటల్లోనే కాదు... చేతల్లో కూడా తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని కాపాడటానికి శాయశక్తులా కృషి చేశారు. తన ప్రజల బాగోగుల విషయాల్లో ముక్కుసూటిగా వ్యవహరిస్తూ, ఎలాంటి నిర్ణయాన్ని అయినా  సమర్ధవంతంగా, ధైర్యంగా  తీసుకుని ముందుకుసాగారు. ఫలితంగా 'అన్నగారి'à°—à°¾ తెలుగు ప్రజలు తమ గుండెల్లో ఎన్టీఆర్ à°•à°¿ చోటు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేజిక్కించుకోవడం చాలా కష్టమనే భావన జాతీయ పార్టీ కాంగ్రెస్ కు కలిగేలా చేసి, ప్రాంతీయ పార్టీలదే హవా అనే విషయాన్ని తేటతెల్లం చేసారు ఎన్టీఆర్. ఇక భవిష్య్తతులో మేకప్ వేసుకున్న ఏ వ్యక్తీ ఎన్టీఆర్ లా ఎదగలేరని, అలాంటి వ్యక్తి మళ్లీ తెలుగు ప్రజలకు దొరకరని జనాలు ఫిక్స్ అయ్యారు.

కట్ చేస్తే...
కష్టపడి నటుడిగా అంచలంచెలుగా ఎదిగిన చిరంజీవి ఎన్టీఆర్ ని స్ఫూర్తిగా తీసుకుని, రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నానని చెప్పడంతో రాష్ట్రంలో పెను మార్పులు వస్తాయని, భవిష్యత్తు బంగారంలా ఉంటుందని చాలామంది కలలు కన్నారు. తను అనుకున్నట్లు ఓ శుభముహూర్తాన 'ప్రజారాజ్యం' పార్టీని ప్రకటించారు చిరంజీవి. అప్పట్లో అన్నగారికి పట్టం కట్టినట్లుగానే తెలుగు ప్రజలు ఈ పార్టీకి కూడా పట్టం కడతారని, చిరంజీవిని ముఖ్యమంత్రిగా చూడటం ఖాయమని చాలామంది ఊహించారు. కానీ జరిగిన పరిణామాలు చిరంజీవిని అంత ఎత్తుకు తీసుకెళ్లలేకపోయాయి.


నమ్మకాన్ని వమ్ము చేసిన చిరంజీవి...
ఎన్టీఆర్ తర్వాతి తరంలో చిత్ర పరిశ్రమలో గాడ్ పాధర్ లేకుండా ఎదగడం కష్టం అనే మాటలను అబద్ధం చేస్తూ స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి చిరంజీవి. కష్టపడే తత్వం, క్రమశిక్షణ, తను అనుకున్నది సాధించి తీరాలనే పట్టుదల... à°ˆ గుణాలు చిరంజీవిని మెగాస్టార్ పట్టాన్ని అందిపుచ్చకునేలా చేయడంతో పాటు కొన్నేళ్లు హీరోగా 'నంబర్ వన్'  స్థానాన్ని కైవసం చేసుకునేలా చేసాయి. అలాగే ఉండి ఉంటే, నటుడిగా చిరంజీవి కెరీర్ ఇంకా మంచి ఊపులోనే ఉండేదేమో.
కానీ, సినిమాలకు గుడ్ బై చెప్పేసి 'ప్రజారాజ్యం' పార్టీ ఏర్పాటు చేసిన చిరంజీవి రాజకీయాల్లో తనకంటూ ఓ సొంత అభిప్రాయాలు, ఆశయాలు లేకుండా ముందుకు సాగారు. పార్టీ పెట్టారు కానీ ఎన్టీఆర్ మాటల్లో కనిపించిన కాన్ఫిడెన్స్ చిరంజీవి మాట్లల్లో ప్రజలకు కనిపించలేదు. ముక్కుసూటిగా మాట్లాడలేకపోవడం, ఎలాంటి నిర్ణయాన్ని అయినా స్వయంగా తీసుకోలేకపోవడం చిరంజీవికి మైనస్ అయ్యింది. పైగా, రాసిచ్చిన స్వీచ్ లను బట్టీపట్టి అప్పజెప్పడం, ఆయన బావమరిది అల్లు అరవింద్ లేనిదే ఎలాంటి నిర్ణయం తీసుకోలేరనే అపవాదు మూటగట్టుకోవడంతో చిరంజీవికి నాయకత్వ లక్షణాలు తక్కువని, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే సీన్ లేదని ప్రజలు ఫిక్స్ అయ్యారు. ఫలితంగా చిరంజీవి పెట్టిన 'ప్రజారాజ్యం' పార్టీకి కేవలం 17శాతం మంది మాత్రమే ఒటేసి, ఆయన పార్టీని అట్టర్ ఫ్లాప్ చేసారు. ఎన్టీఆర్ లా చిరంజీవి ముక్కుసూటితనంగా వ్యవహరించకపోవడం, ఎలాంటి నిర్ణయాన్ని అయినా సొంతంగా తీసుకునే కెపాసిటీ లేకపోవడంతో ఆయన పెట్టిన 'ప్రజారాజ్యం' పార్టీ కాంగ్రెస్ లో విలీనమవ్వడానికి దోహదపడింది. చివరికి రాజ్యసభలో కూడా సమైక్యవాదాన్ని బలంగా వినిపించలేకపోయారు చిరంజీవి.


గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన అంశం తెలుగు ప్రజలను ఆందోళనకు గురి చేసింది. రాజకీయ నేతల రంగులు తెలిసిన ప్రజలు ఎవరికి వారు స్వలాభం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని గ్రహించారు. కానీ సమైక్య నినాదంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ఇంకా నటుడిగానే ప్రజల మనసుల్లో నిలిచిపోయిన చిరంజీవి మాత్రం రాజ్యసభ సాక్షిగా సమైక్య వాణిని ఒక్కసారైనా వినిపించకపోతారా అని చాలామంది ఎదురుచూసారు. ఆయన అభిమానులు సైతం తమ హీరో రాజసభ్యలో హీరోయిజం చూపిస్తారని, గట్టిగా తన మనసులోని మాటలను చెబుతారని ఆశించారు. ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడటానికి, స్వయంగా నిర్ణయం తీసుకోవడానికి వెనుకడుగు వేసే చిరంజీవి, విభజన బిల్లు గురించి ఫైనల్ గా మాట్లాడినప్పుడు కూడా కప్పదాటును ప్రదర్శించారు. అరువు తెచ్చుకున్న మాటలనే మాట్లాడారు. ఇది ఆయన అభిమానులను సైతం నిరాశపరిచింది. ఫైనల్ గా చిరంజీవి మంచి నటుడుగానే మిగిలిపోయారు తప్ప... ఎన్టీఆర్ లా నిజమైన రాజకీయవేత్త కాలేకపోయారు.

ఇకముందు రాజకీయాల్లోకి నటులు రావడం, పోవడం జరుగుతుంది  కానీ... ఎవ్వరూ à°† మాహానుభావుడు ఎన్టీఆర్ లా రాష్ట్రాన్ని పాలించలేరని చదువులేని వారు సైతం బల్లగుద్ది మరీ చెప్పేలా చేసేసారు చిరంజీవి.


ఎన్టీఆర్ ని స్ఫూర్తిగా తీసుకుని చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే...చిరంజీవి రాజకీయ భవిష్యత్తును చూసిన నటులు మాత్రం రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి ఇష్టపడరు. తమ ఇమేజ్ ని ప్రజల్లో దిగజార్చుకోవడానికి అసలు ఇష్టపడరని చెప్పొచ్చు.


ఓ నటుడు తెలుగు జాతి ఆత్మ గౌరవం కాపాడటం కోసం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. మరో నటుడు ఇదే మాట చెప్పి పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్ ని రెండు ముక్కలుగా విడగొట్టడానికి పెట్టిన విభజన బిల్లుకు సాక్ష్యంగా నిలిచారు. పైగా రాజ్యసభలో రాష్ట్రం కోసం ఆయన మాట్లాడుతున్న మాటలు సినిమా డైలాగుల్లానే ఉన్నాయే తప్ప, సహజ ధోరణి కనిపించలేదు. అందుకని, చిరంజీవి రాజకీయ రంగు పులుముకుని తప్పు చేశారనే చెప్పాలి. హాయిగా సినిమాలు చేసుకుంటూ ఉంటే కనీసం గౌరవం అయినా మిగిలేది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !