View

69 రోజులు... 22 సినిమాలు... ఫలితం?

Monday,March10th,2014, 02:42 AM

అన్నీ ఉన్నా... అల్లుడు నోట్లో శని అన్నట్లుగా తయారైంది టాలీవుడ్ పరిస్థితి. మొన్నటివరకు ఓ వైపు ఉద్యమాలు, మరోవైపు పైరసీ సినిమాను పీల్చి పిప్పి చేశాయి. తెలుగు నేల రెండు ముక్కలవ్వడంతో ఎట్టకేలకు ఉద్యమకాలానికి తెరపడింది. దీంతో టాలీవుడ్ కు ఓ పెద్ద సమస్య తప్పింది. ఇక మిగిలింది పైరసీ. దాన్ని టెక్నాలజీ సాయంతో ఎలాగోలా అధిగమించేయొచ్చు అనుకుంటున్న సమయంలో వరుస పరాజయాలు తెలుగు సినిమాకు శరాఘాతాలుగా మారాయి. వందకు పైచిలుకు సినిమాలు విడుదలవ్వడం... అందులో ఓ పదిపదిహేను మాత్రమే విజయవంతం అవ్వడం గత కొన్నాళ్లుగా జరుగుతున్నదే. అయితే ... ఈ దఫా పరిస్థితిని గమనిస్తే... గతం కంటే దారుణంగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఏడాదిలోని 365రోజుల్లో... 69రోజులు ఇప్పటికే పూర్తయిపోయాయి. ఈ కాలంలో పెద్దవి, చిన్నవి, ఓ మోస్తరువి కలిపి 22సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో సరైన విజయం దక్కించుకున్నవి ఒక్కటీ అరా మాత్రమే. ఇదీ ప్రస్తుత టాలీవుడ్ దుస్థితి.


నంబర్'వన్' అనిపించుకోలేకపోయింది
ఈ యేడాది విడుదలైన తొలి ప్రతిష్టాత్మక చిత్రం '1'. మహేశ్ హీరోగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ రేస్ లో మాత్రం నంబర్ వన్ అనిపించుకోలేకపోయింది. ఒక్కోసారి అంచనాలు కూడా సినిమాకు శాపాలుగా మారుతాయనడానికి '1' పెద్ద నిదర్శనం. నిర్మాణం నుంచీ ఈ సినిమాకు సంబంధించిన ప్రతిదీ న్యూసే. దూకుడు, బిజినెస్ మేన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు... హ్యాట్రిక్ తర్వాత మహేశ్ తదుపరి చిత్రం ఇది. పైగా యువతరం అమితంగా ఇష్టపడే సుకుమార్ దర్శకుడు. మహేశ్ సిక్స్ ప్యాక్ చేయడం, ఆయన తనయుడు గౌతమ్ ఇందులో నటించడం, దేవిశ్రీ ప్రసాద్-సుకుమార్ ల కాంబినేషన్... ఇత్యాది అంశాలన్నీ '1' పై ఎక్కడలేని క్రేజ్ ని పెంచాయి. నిజానికి సుకుమార్ కూడా హాలీవుడ్ చిత్రాలను తలపించేలా '1' సినిమాను తీర్చిదిద్దారు. కథలోని సోల్ సరిగ్గా ఉండి... కథనం ఎంత ఇంటలెక్చువల్ గా ఉన్నా... దాన్ని ఆదరించే పరిణితి తెలుగు ప్రేక్షకులకు ఉంది. అయితే... '1' కు సంబంధించి కథనం ఇంటలెక్చువల్ గా ఉంది కానీ, కథలోని సోల్ సరిగ్గా లేదని కొందరి అభిప్రాయం. అందుకే... ఆశించిన ఫలితం రాలేదు. మహేశ్, సుకుమార్ లు మాత్రం విమర్శకుల ప్రశంసలందుకున్నారు.


జాప్యం 'ఎవడు'కి శాపం
రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరూ ఓ సినిమాలో నటిస్తున్నారంటే... అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాలా. విడుదలకు ఏడాది ముందు రిలీజైన 'ఎవడు' పాటలు కూడా జనాదరణ పొందాయి. దిల్ రాజు మేకింగ్, పైడిపల్లి వంశీ టేకింగ్, శ్రుతిహాసన్, కాజల్, అమీజాక్సన్ అందచందాలు... ఇలా అన్నీ ప్రత్యేకతలే. చూసిన ప్రేక్షకులు కూడా 'ఫర్లేదు' అనేశారు. కానీ... నిర్మాతకు మాత్రం లాభాలు రాలేదని టాక్. దానికి కారణం జాప్యం. అనుకున్న సమయంలో విడుదలైనట్లయితే... రామ్ చరణ్ ఖాతాలో ఓ భారీ విజయంగా నిలిచేదీ సినిమా. ఉద్యమాల వల్ల కొన్నాళ్లు, 'అత్తారింటికి దారేది' కారణంగా కొన్నాళ్లు... ఇలా రకరకాల రీజన్స్ తో ఏడాది క్రితమే విడుదలవ్వాల్సిన 'ఎవడు' ఎట్టకేలకు ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై, యావరేజ్ అనిపించాడు.


పూరీ జడ్జిమెంటే శ్రీరామరక్షయ్యింది
జనవరిలోనే విడుదలైన ఇంకో యావరేజ్ 'హార్ట్ ఎటాక్'. 'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే' విజయాల తర్వాత వచ్చిన నితిన్ సినిమా ఇది. పూరీజగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. దర్శకునిగా పూరీ కున్న జడ్జిమెంటే à°ˆ సినిమాకు శ్రీరామరక్ష  అయ్యింది. తక్కువ బడ్జెట్ లో అనుకున్న టైమ్ లో సినిమాను పూర్తి చేసి విడుదల చేశారాయన. దాంతో సినిమాకు మంచి లాభాలొచ్చాయని ట్రేడ్ టాక్ అయితే... నితిన్ à°—à°¤ చిత్రాలతో పోలిస్తే... ఇది పెద్ద చెప్పుకోదగ్గ విజయం కాదనే చెప్పాలి. కేవలం యువతరాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని పూరీ à°ˆ సినిమాను తెరకెక్కించారు. అందుకే అందరికీ à°ˆ చిత్రం చేరువ కాలేదని  టాక్.


పాండవులు నవ్వించారు కానీ...
మోహన్ బాబు చాలారోజుల తర్వాత ముఖానికి రంగేసుకున్నారు. కొడుకులు విష్ణు, మనోజ్ లతో కలిసి నటించారు. ఈ రీజన్ చాలు... జనాలు థియేటర్ కి రావడానికి. ఇంకా వరుణ్ సందేశ్, తనీష్ కూడా వీళ్లతో జత కలిశారు. హన్సిక, ప్రణీత, రవీనా టాండాన్ అందచందాలు... ఇన్ని ప్రత్యేకలతో విడుదలైంది 'పాండవులు పాండవులు తుమ్మెద'. బాలీవుడ్ 'గోల్ మాల్-3' రీమేక్ అంటూ మీడియా కావాల్సినంత ఫ్రీ పబ్లిసిటీ కూడా ఇచ్చింది. ఇది రీమేక్ కాదని విడుదల తర్వాత తేలిపోయింది. దర్శకుడు శ్రీవాస్ జనాల్ని బాగానే నవ్వించారు. అయితే... ఎందుకోగానీ... లాంగ్ రన్ లో సినిమా నిలబడలేకపోయింది. బడ్జెట్ పరిధిని దాటడం... ఈ సినిమాకు ఓ మైనస్. ఓపెనింగ్స్ బాగానే వచ్చినా... పెట్టుబడి మాత్రం తిరిగి రాలేదని వినికిడి.


రెండు సినిమాలకూ 'పైసా'లు రాలలేదు
గత ఏడాది నాని నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో... రెండు సినిమాలు విడుదలయ్యాయి. అవే... 'పైసా', 'ఆహా కళ్యాణం'. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'పైసా' చిత్రం... కొంతమంది క్రిటిక్స్ అభినందనలైతే అందుకుంది కానీ... నిర్మాతకు 'పైసా' తేలేదు. నటుడిగా నానికి మాత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇక 'ఆహా కళ్యాణం' అయితే నాని... కెరీర్ లోనే డిజాస్టర్. ఏడాది విరామం తర్వాత విడుదలైన నాని సినిమాలు రెండూ పరాజయం చవిచూడ్డం నానికి పెద్ద దెబ్బే. ఇక తనని 'జెండా పై కపిరాజు' కాపాడాలి.


చీకట్లో వెలుగును నింపింది
సినిమా జయాపజయాలకు డబ్బే కొలమానం. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. అయితే... కొన్ని సినిమాలుంటాయి. మనసుల్ని కట్టిపడేస్తాయి. డబ్బు సంపాదించి పెట్లేదని వాటిని ఫ్లాప్ అనలేం. అలాంటి సినిమానే 'మిణుగురులు'. విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమా ఇది. మనో నేత్రంతో సృష్టిని వీక్షించే జ్ఞానమూర్తుల కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది చెప్పుకోదగ్గ చిత్రం.


బూతు రా బంగారం
ట్రెండ్ ని బట్టి పరిగెత్తడం తెలుగు సినిమాకు పరిపాటైపోయింది. రెండేళ్ల క్రితం ఓ మూడక్షరాల సినిమా వచ్చింది. ప్రస్తుతం సినిమాలన్నీ దాన్నే అనుసరిస్తున్నాయి. రోడ్డు మీద ఎటు చూసినా... ఆ తరహా సినిమాల పోస్టర్లే. ఇటీవల వచ్చిన 'లవ్ యు బంగారం' సినిమా కూడా అలాంటిదే. ఆద్యంతం ద్వందార్థ సంభాషణలతో ఈ సినిమా సాగింది. విలువైన సినిమాలను నిర్మించిన కేఎస్ రామారావు ఈ సినిమా నిర్మాత. బహుశా ఆయనకు ముందు వేరే చెప్పి, తర్వాత వేరే తీసి ఉంటారేమో. తన సంస్థలో ఇలాంటి సినిమా వస్తుందని ఆయన కూడా ఊహించి ఉండరు.


బుల్లోడు, కోడిపెట్ట
'భీమవరం బుల్లోడు'తో ఈ ఏడాది ప్రప్రధమంగా థియేటర్లలోకొచ్చాడు సునీల్. ఒకప్పుడు పది రోజుల తర్వాత కానీ సినిమా హిట్టో, ఫట్టో చెప్పలేకపోయేవారు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. మూడ్రోజుల్లోనే భవిష్యత్ తేలిపోతోంది. 'భీమవరం బుల్లోడు' రిజల్ట్ కూడా త్వరగానే తేలిపోయింది. ఈ బుల్లోడు ఆకట్టుకోలేదు. అలాగే నవదీప్, స్వాతిల 'బంగారు కోడిపెట్ట' కూడా ఈ శుక్రవారం విడుదలైంది. ఇది కూడా నిరుత్సాహపరిచింది.


'సృజనాత్మక లోపం' అనేది చిత్ర పరిశ్రమకు పైరసీ కంటే ప్రమాద హేతువు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా... పరిశ్రమనే నిర్వీర్యం చేసే శక్తి దానికుంది. à°ˆ విషయంలో నిర్మాతలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సాంకేతికత అనేది పరిథులు దాటొచ్చు. కానీ... కథలు మన పరిథులు దాటకూడదు. మన జీవితాలకు దర్పణంలా ఉండాలి. అప్పుడు తప్పకుండా మంచి కథలొస్తాయి. పక్క రాష్ర్టాల్లో జరుగుతుంది అదే. నేటివిటికి తగ్గట్టుగా సినిమాలు తీస్తున్నారు వాళ్లు. తెలుగు సినిమా పరిస్థితి అలా లేదు. అంతా మూస ధోరణి. ప్రస్తుత తెలుగు సినిమా కథల్లో చాలావరకు మట్టి వాసన  అస్సలు లేదు. 'పబ్'à°² కంపు కొడుతున్నాయి. సొంతంగా ఆలోచించకుండా ల్యాప్ టాపుల్లో పరభాషా డీవీడీలను పెట్టుకుని తిరిగే దర్శకులు, రచయితలు ఎక్కువైనందునే అపజయాల శాతం ఎక్కువైంది. మరి.. à°ˆ ఏడాది మిగిలిన 9 నెలల్లో విడుదలయ్యే సినిమాలైనా మంచి ఫలితాన్ని సాధించాలని కోరుకుందాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !