View

'యమలీల 2' పరిచయ వేదిక విశేషాలు

Wednesday,April16th,2014, 02:40 AM

కె.అచ్చిరెడ్డి ఆశీస్సులతో క్రిష్వీ ఫిలింస్ నిర్మాణంలో డా.కె.వి.సతీష్, దియా నికోసల్ జంటగా ఎస్.వి.కృష్ణా రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'యమలీల 2'. ఈ చిత్రంలో యముడిగా కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు నటిస్తున్నారు. ఈ రోజు (15.4) ఈ చిత్రానికి సంబంధించిన పరిచయ వేదిక పార్క్ హయత్ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో డా.డి.రామానాయుడు, డా.మోహన్ బాబు, సుబ్బి రామిరెడ్డి, బ్రహ్మానందం, బండ్ల గణేష్, కె.రాఘవేంద్రరావు, అలీ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రం ఫస్ట్ లుక్ లోగోను రామానాయుడు ఆవిష్కరించారు.

హీరో సతీష్ ఫస్ట్ లుక్ ని టి.సుబ్బి రామిరెడ్డి ఆవిష్కరించారు.

హీరోయిన్ దియా నికోలస్ ఫస్ట్ లుక్ ని రాఘవేంద్రరావు ఆవిష్కరించారు.

డా.మోహన్ బాబు ఈ చిత్రానికి సంబంధించిన తొలి పరిచయ సంచిక ను విడుదల చేసారు.

అనంతరం మీడియా సమావేశంలో యస్వీ.కృష్ణా రెడ్డి మాట్లాడుతూ - ''20 యేళ్ల తర్వాత 'యమలీల 2' చిత్రం చేస్తున్నాను. కొత్త కథ. పాత 'యమలీల' కథకి దీనికి ఏ మాత్రం సంబంధం లేదు. మోహన్ బాబుగారు యముడి పాత్ర చేయకపోతే ఈ సినిమా లేదు. స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి తర్వాత యముడి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయే నటుడు మోహన్ బాబుగారే. ఆ యమలీల లో చిత్రగుప్తుడిగా ఏ స్థాయిలో నవ్వించారో, ఇందులో కూడా బ్రహ్మానందంగారు నవ్విస్తారు. గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే ఈ సినిమా భారీ బడ్జెట్ తో కూడుకున్నది. 8యేళ్ల క్రితం బెంగుళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆరంభించి బాగా సంపాదించాడు హీరో సతీష్. ధనార్జనే ధ్యేయం కాకుండా, సినిమా మీద మమకారంతో ఈ రంగానికి వచ్చాడు సతీష్. ముందుగా అతని ఫ్రెండ్స్ నన్ను కలిసి తమ డీఎస్ మేక్స్ పతాకంపై ఓ సినిమా చేయాలన్నారు. 'యమలీల 2' కథ నా దగ్గర ఉందని, మోహన్ బాబుగారు, బ్రహ్మానందంగారు చేస్తేనే ఈ సినిమా ఉంటుందన్నాను. వాళ్లని ఆ ఇద్దరితో పరిచయం లేకపోవడంతో నా ద్వారా కలిశారు. కథ వినగానే ఇద్దరూ వెంటనే అంగీకరించారు. ఆ తర్వాత ఓ ఫొటో చూపించి, 'ఇతన్ని హీరోగా పెట్టాలి. మా సంస్థ నుంచి ఈ సినిమాని తనకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాం' అన్నారు. ఆ ఫొటోలో ఉన్నది సతీష్. ఈ సినిమాకి తను యాప్ట్ కావడంతో సరే అన్నాను. నా తొలి సినిమాలా భావించి ఈ సినిమా చేశాను. ఇప్పటివరకు జరిపిన షూటింగ్ తో 70 శాతం పూర్తయ్యింది'. తప్పకుండా ఈ సినిమా విజయం సాధించి, అందరికీ మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు.

రామానాయుడు మాట్లాడుతూ - ''ఈ సినిమా షూటింగ్ మా రామానాయుడు స్టూడియోలో జరుగుతుంటే నేను చూశాను. 'యమలీల' ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ఈ 'యమలీల 2' కూడా అంతటి విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

సతీష్ మాట్లాడుతూ - ''నటన అనేది నా కెరీర్ కాదు. కానీ, సినిమా అంటే ఆసక్తి ఉండటంతో యాక్ట్ చేస్తున్నాను. చిన్నప్పట్నుంచీ ప్రతి సినిమా చూసి ఏదో ఒకటి నేర్చుకుంటాం. అలా నేను ఎస్వీ కృష్ణారెడ్డి గారి సినిమాలు చూసి, ఇన్ స్పయిర్ అయ్యేవాణ్ణి. ఆయనకు అభిమానిని. చాలా గ్యాప్ తర్వాత ఆయన సినిమా చేయడం, అందులో నేను నటించడం ఆనందంగా ఉంది. వాస్తవానికి ఈ సినిమాకి నేను హీరోని కాదు. మోహన్ బాబు, బ్రహ్మానందం, కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి గార్లే హీరోలు. యాక్టింగ్ కి నేనెక్కడా ట్రైనింగ్ తీసుకోలేదు. కృష్ణారెడ్డి గారే నేర్పించారు. దాంతో యాక్టింగ్ నాకు చాలా సులవైంది. ఈ సినిమా నా సంస్థలో రూపొందడం చాలా ఆనందంగా ఉంది. మా సంస్థకు రెండు విలువులున్నాయి. ఒకటి.. ఖచ్చితంగా విలువలున్న సినిమా తీయాలనిది మా ఆకాంక్ష. రెండోది.. సినిమాకి లాభాలొస్తే ఆ ఘనత మొత్తం క్రెడిట్ కి దక్కుతుంది. నష్టం వస్తే, మేం మాత్రమే భరిస్తాం'' అన్నారు.

టి.సుబ్బిరామి రెడ్డి మాట్లాడుతూ - ''కృష్ణారెడ్డి ఓ బ్రాండ్. తనదో ప్రత్యేకమైన శైలి. ఏం సినిమా చేసినా కథ మీద చాటా పట్టుతో, అందుకు తగ్గ నటీనటులతో చేస్తాడు. ప్రస్తుతం వస్తున్న సినిమాలు కరెక్ట్ గా లేవు. 'యమలీల 2' ఆ కొరత తీరుస్తుందనుకుంటున్నాను. మోహన్ బాబు విలన్ గా స్టార్ట్ అయ్యి, ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ చిత్రం విజయం సాధించి హీరో సతీష్ కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

మోహన్ బాబు మాట్లాడుతూ - ''మోహన్ బాబు పద్మశ్రీని తెచ్చుకున్నాడు. కానీ, సినిమా రంగంలోకి మోహన్ బాబుని పద్మశ్రీ తీసుకు రాలేదు. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి లను చూస్తుంటే నాకు బాపు, రమణలు గుర్తొస్తారు. వీళ్లతో సినిమా చేస్తుంటే నాకు బాపు, రమణలతో చేస్తున్నట్లుంది. ఈ సినిమాలో నేను నటించడం నా అదృష్టం. ఇదే నా చివరి యముడి గెటప్. ఇకనుంచి ఈ గెటప్ చేయను. యముడి గెటప్ చేయడం చాలా క్లిష్టం. పెద్దాయన రామారావుగారు వయసు మీద పడిన తర్వాత కూడా ఆ కేరక్టర్ చేశారు. ఆయన చాలా గ్రేట్. యముడి పాత్రకు రెండు గంటలు మేకప్ చేసుకోవాల్సి వచ్చింది. కృష్ణారెడ్డి చాలా కేర్ తీసుకునేవాడు. నటుడిగా నేను కూలివాడిలాంటివాణ్ణి. దర్శక, నిర్మాతలు ఎలా చెబితే అలా చేసే నటుడు వందేళ్లు ఉంటాడు. మాట వినకుండా తన ఇష్టం వచ్చినట్లు చేసే నటులు వెంటనే కనుమరుగవుతారు. ఈ షూటింగ్ సెట్ లోకి వచ్చేవరకు హీరో కొత్త కుర్రాడని తెలియదు. తన నటన చూసి షాక్ అయ్యాను. అంత బాగా చేశాడు. తనని చూస్తుంటే నా ఒకప్పటి కెరీర్ గుర్తొచ్చింది. ఈ సినిమాలో చేయడం తన లక్. ఇకనుంచి ప్రతి ఏడాదీ సతీష్ కనీసం పది సినిమాలైనా చేయాలని కోరుకుంటున్నా. ఈ సినిమా ఖచ్చితంగా ఘనవిజయం సాధిస్తుంది'' అన్నారు. 

చిత్రగుప్తుడు పాత్ర చేస్తున్నానని, ప్రేక్షకులను మరోసారి ఈ పాత్ర ద్వారా కడుపుబ్బా నవ్విస్తానని తెలిపారు డా.బ్రహ్మానందం.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నబండ్ల గణేష్, సుధీర్ బాబు, అలీ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేసారు.

నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు

కోటా శ్రీనివాసరావు, ఎం.ఎస్.నారాయణ, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, సదా, నిషా కొఠారి, షాయాజీ షిండే, ఉత్తేజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ - శ్రీకాంత్ నారోజ్, ఎడిటర్ - గౌతంరాజు, మాటలు - గంగోత్రి విశ్వనాధ్, భవానీ ప్రసాద్, పి.ఆర్.ఒ - బి.ఎ.రాజు, ఆర్ట్ - చిన్నా, సి.జి - మకుట, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎం.ఎ.జగన్నాధ్ రెడ్డి, క్రిష్వి ఫిలింస్ C.E.O - డి.కె.అరుణ్ కుమార్, కథ, స్ర్కీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం - ఎస్.వి.కృష్ణా రెడ్డి M.comAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !