View

ఇటు నీటు.. అటు బూతు... ప్రేక్షకుల దారెటు?

Saturday,January25th,2014, 12:46 PM

'నేడు విలువలున్న సినిమాలు ఎక్కడొస్తున్నాయి?' అని నాటి తరం పెద్దలు వాపోతుంటారు. నేటి తరంలో కూడా ఈ వేదన లేకపోలేదు. అందుకే, అడపా దడపా వస్తున్న 'మిథునం', 'మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు'లాంటి చిత్రాలు ఎడారిలో ఒయాసిస్ దొరికినంత హాయిని కలుగజేస్తున్నాయి. ఈ తరహా విలువలున్న చిత్రాలు ఏడాదికి పట్టుమని పది కూడా రావడంలేదు. కానీ, శృంగారం ప్రధానంగా రూపొందే చిత్రాలకు కొదవే లేదు. నీటు సినిమాలకన్నా బూతూ సినిమాల నిర్మాణం జోరుగానే సాగుతోంది. ముఖ్యంగా 'ఈ రోజుల్లో'వంటి చిన్న చిత్రంతో దర్శకునిగా కెరీర్ ఆరంభించిన మారుతి ఆ తరహా చిత్రాలను బాగానే అందిస్తున్నాడు. మారుతి టాకీస్ పై అతను అందించే సినిమాలు దాదాపు శృంగార ప్రధానంగా సాగేవే. ఇటీవల గోవీ దర్శకత్వంలో కె.యస్. రామారావు సమర్పణలో మారుతి నిర్మించిన 'లవ్ యు బంగారం'లో అయితే, బూతు శృతి మించిందనే చెప్పాలి. నిన్న (24.01.13) ఈ సినిమా విడుదలైంది. ఇదే రోజున విడుదలైన మరో చిత్రం 'మిణుగురులు'. అయోధ్యకుమార్ క్రిష్ణం శెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. 'లవ్ యు బంగారం'కి పూర్తి భిన్నం ఈ 'మిణుగురులు'. నీట్ సినిమా. హృదయాన్ని హత్తుకుంటుంది. ఒకే రోజున ఓ బూతు, ఓ నీటు సినిమా తెరకొచ్చాయి. ఈ రెండు చిత్రాల కథా కమామీషులోకి ఓ లుక్కేద్దాం.


లవ్ యు బంగారం
ఈ సినిమాలో కథ పెద్దగా ఉండదు. సెల్ ఫోన్ కంపెనీలో పని చేస్తూ, ప్రేమించి, పెళ్లి చేసుకునే యువకుడి కథ ఇది. సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసే తన భార్యపై అనుమానం కలుగుతుంది ఈ భర్తకి. ఫలితంగా వీరి కాపురం ఎలాంటి టర్నింగ్ తీసుకుంటుందనేది కథ. ఇలాంటి కథలు చాలానే విన్నాం.. చూసాం. కాకపోతే, ఒక్కో కథను తెరకెక్కించడంలో దర్శక, నిర్మాతలు అనురించే విధానం వేరుగా ఉంటుంది. ఈ కథను తెరపై ఆవిష్కరించడానికి మారుతి ఎంచుకున్న మార్గం 'బూతు'. సాఫ్ట్ వేర్ నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో వీలైనంత బూతు జోడించి, తీశారు. అసలు సాఫ్ట్ వేర్ కంపెనీలో జరిగే వ్యవహారలన్నీ పరమ బూతుగా ఉంటాయా? అని ఆశ్చర్యపోయే స్థాయిలో ఈ సినిమా ఉంటుంది. 'క్యాష్' చేసుకోవాలనే ధ్యేయంతోనే నిర్మాతలు ఈ సినిమాకి శ్రీకారం చుట్టినట్లుగా క్లియర్ కట్ గా అర్థమవుతోంది. కానీ, సమాజం' గురించి ఆలోచించాల్సిన బాధ్యత లేదా? ఓ మంచి సినిమా తీసి కూడా, ఆర్థికంగా లాభాలు చూడొచ్చనే విషయాన్ని మర్చిపోయారా? కాలక్షేపం కోసం పొరపాటున ఫ్యామిలీని వెంటబెట్టుకుని వెళ్లే వాళ్లు సిగ్గుతో చితికిపోవాల్సిందేనా? అంటే.. తన సినిమాలను కుటుంబసమేతంగా చూడాలని మారుతి ఆశించడంలేదా? ఆ మాటకొస్తే అతని టార్గెట్ అయిన యూత్ కూడా 'లవ్ యు బంగారం' చూసి నివ్వెరపోతున్నారు. కొంతమంది యువకులు ఛీ కొడుతున్నారు. పైగా సీనియర్ నిర్మాత కె.ఎస్. రామారావు ఈ సినిమాని సమర్పించడమేంటి? సినిమా ఇలా ఉంటుంది? అని స్పష్టంగా తెలుసుకునే రామారావు ఒప్పుకున్నారా? లేకపోతే, మసిపూసి మారేడు కాయ చేసిన చందంగా మారుతి అండ్ కో ఈ సినిమాని తీశారా? ఎందుకంటే, 'మాతృదేవో భవ'లాంటి ఉత్తమ విలువలున్న చిత్రాన్ని నిర్మించిన కె.ఎస్. రామారావు ఈ బూతు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఏంటి? ఏదేమైనా 'బూతే.. భవిష్యతి' అనే తీరుని మార్చుకుని దర్శక, నిర్మాతగా మారుతి మంచి సినిమాలను అందిస్తే బెటర్. భక్తిరసాత్మకాలు, సందేశాత్మక సినిమాలు కాకపోయినా, దిగుజారుడుగా సాగే బూతు సినిమాలు కాకుండా, మంచి కమర్షియల్ సినిమాలు చేయడానికి ట్రై చేస్తే బెటర్.


మిణుగురులు
చూపు లేని బాల, బాలికల జీవితాల చుట్టూ తిరిగే కథతో రూపొందించిన ఈ సినిమాని మనసుతో చూడాలి. సుహాసిని, ఆశిష్ విద్యార్థి ఈ చిత్రంలో ముఖ్య తారలు. కాదేదీ అనర్హం అన్నట్లు.. ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటే, అంగ వైకల్యం అడ్డురాదని ఫిజికల్లీ చాలెంజ్డ్ పీపుల్ కి ఆత్మస్థయిర్యాన్ని ఇచ్చే సినిమా ఇది. అంథ బాల, బాలికలకు సంబంధించిన హాస్టల్ లో ఘోరమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉందనే ఆలోచనను రేకెత్తించే సినిమా. చూపు లేని పిల్లల పట్ల చూపు ఉండీ.. లేనట్లుగా ప్రవర్తించే ఓ వార్డన్ కథ ఇది. కనీస వసతులు లేని హాస్టల్ లో పిల్లలు ఎంత దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటారో చూపించిన సన్నివేశాలు మనసుని తడిపేశాయి. ఎదురు తిరిగితే దెబ్బలు తప్పవని వార్డెన్ బెదిరింపులకు భయపడి, మౌనంగా రోదిస్తూ బతికే పిల్లల్లో చైతన్యం నింపుతాడు ఓ బాలుడు. కళ్లు లేకపోయినా.. ఓ పథకం ప్రకారం వార్డెన్ లీలలను కెమెరా కంట్లో బంధించి, వ్యయ ప్రయాసలకోర్చి ప్రభుత్వానికి అందజేసి, తమ జీవితాల్లో మంచి మార్పు తెచ్చుకుంటారు బాల, బాలికలు. హాస్టల్ లో వాళ్లు పడే వేదన వర్ణనాతీతం. ఒక సినిమా చూస్తున్నట్లుగా మాత్రం అనిపించదు. జీవితం కనిపిస్తుంది. ప్రభుత్వాధికారులు కనుక ఈ సినిమా చూస్తే.. నిజంగానే ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే వసతి గృహాల్లో ఇలా పరిస్థితులు ఉండే అవకాశం ఉందని, నిర్వాహకులపై బాధ్యత పెట్టేసి, చేతులు దులుపుకోవడం కాకుండా అడపా దడపా స్వయంగా వెళ్లి పర్యవేక్షించాలనే ఆలోచనను రేకెత్తిస్తుంది. ఈ సినిమాని ప్రేక్షకులు అంత సులువుగా మర్చిపోలేరు. అయోధ్యకుమార్ క్రిష్ణం శెట్టి చేసిన చాలా మంచి ప్రయత్నం ఇది.


విశ్లేషణ
విలువలున్న సినిమాలు తీస్తే నిర్మాత నెత్తిన చెంగేసుకోవాల్సిందేననే ఆలోచన బలంగా పడిపోయింది. అది వాస్తవం కూడా. నిన్నగాక మొన్న విడుదలైన 'మల్లెల తీరం...' దర్శక, నిర్మాతలకు ఓ మంచి సినిమా తీశామనే సంతృప్తిని మిగిల్చింది కానీ, ఆర్థిక సంతృప్తి మాత్రం మిగల్లేదు. ఇప్పుడు 'మిణుగురులు' పరిస్థితి కూడా అంతేనా? ఈ సినిమాకి జరిగిన లాభం ఏంటంటే, 'దాసరి నారాయణరావు' విడుదల చేయడం. మంచి సినిమాని విడుదల చేయాలనే సదాశయంతో దాసరి తన సహకారం అందించి ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి సినిమాలు రావడంలేదు.. అందుకే థియేటర్స్ కి రావడంలేదు అని చెప్పే ప్రేక్షకులు 'మిణుగురులు'ని చూస్తే, దర్శక, నిర్మాతలకు ప్రోత్సాహంగా ఉంటుంది. మరిన్ని విలువలున్న సినిమాలొస్తాయి. కాబట్టి.. ఇటువంటి చిత్రాలను ఆదరించాల్సిన అవసరం చాలా ఉంది.


ఒకేరోజున ఓ బూతు (లవ్ యు బంగారం), ఓ నీటు (మిణుగురులు) సినిమాలు తెరకొచ్చాయి. మరి.. మంచి సినిమాని ఆదరిస్తామంటూ ప్రేక్షకులు 'మిణుగురులు' థియేటర్ కి దారి వెతుక్కుని వెళితే.. హృదయం ఉన్నవాళ్లనిపించుకుంటారు. లేదు.. బూతు సినిమావైపే మా దారి అంటే.. చేసేదేం లేదు. ఇక బూతు దారిలోనే చాలామంది వెళతారు. ఫలితంగా 'మంచి' దారి దూరమైపోతుంది. మంచి సినిమా కనుమరుగవుతుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !