filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz

View

ఆ '6' వదులుకుని ఎన్టీఆర్ తప్పు చేశాడా?

Monday,December22nd,2014, 03:51 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ఆశించినంత ఎత్తుకు ఎదగలేకపోతోంది.  ఎన్టీఆర్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం వచ్చి చాలా కాలమయ్యింది. ఇది ఎన్టీఆర్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. నెం.1 స్థానానికి పోటీ ఇవ్వగల సత్తా ఉన్న ఎన్టీఆర్ హిట్ సినిమా ఇస్తే చాలనే రేంజ్ కి దిగజారిపోవడం అభిమానులను ఆవేదనకు గురి చేస్తోంది. ఈ పరిస్థితికి ఎన్టీఆర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా కారణమని పరిశీకులు అంటున్నారు. తన కెరీర్ ని ఓ చట్రంలో ఇరుక్కోకుండా చేయగల సత్తా ఉన్న 6 సినిమాలను వదులుకుని ఎన్టీఆర్ పెద్ద తప్పు చేసాడని వారు భావిస్తున్నారు. ఆ 6 చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి.  ఎన్టీఆర్ వదులుకున్న ఆ 6 చిత్రాల వివరాల్లోకి వెళితే...

దిల్

ఎన్టీఆర్ కి 'ఆది'లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ఇచ్చిన వి.వి.వినాయక్ ముందుగా 'దిల్' కథతోనే ఎన్టీఆర్ ని కలిసాడు. కానీ ఎన్టీఆర్ కి 'దిల్' కథ నచ్చకపోవడంతో 'ఆది' కథతో ఎన్టీఆర్ ని కలవడం, ఆ సినిమా చేయడం జరిగింది. 'ఆది' బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఎన్టీఆర్ రేంజ్ ని అమాంతం పెంచేసింది. ఈ సినిమా పెంచిన అంచనాలను ఎన్టీఆర్ తర్వాతి సినిమాలు అందుకోవడం చాలా కష్టమయ్యింది. 'ఆది'లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత  'దిల్' కథ నితిన్ కి చెప్పి వర్కవుట్ చేసాడు వినాయక్. ఈ సినిమా హిట్టయ్యింది. నితిన్ కి లవర్ బోయ్, ఓ పక్కింటి అబ్బాయి ఇమేజ్ ని తెచ్చిపెట్టిందీ చిత్రం. ఈ సినిమా నితిన్ కి అమ్మాయిల ఫాలోయింగ్ ని కూడా బాగా పెంచింది.  ఒకవేళ ఎన్టీఆర్ ఆ సినిమా చేసి ఉంటే కెరీర్ ఆరంభంలోనే అమ్మాయిల ఫాలోయింగ్ ఏర్పడి ఉండేది. 'దిల్'లాంటి సినిమా చేసి ఉంటే, ఎన్టీఆర్ ఇమేజ్ వేరే రకంగా ఉండేది... అలాగే మొదటి చిత్రంతో లవర్ బోయ్ గా స్టార్ట్ అయ్యుంటే.. ఆ తర్వాతి చిత్రంపై భారీ అంచనాలు ఉండేవి కావు. సో కూల్ గా సినిమా చేసి ఉండొచ్చు. కానీ, 'అది' బ్లాక్ బస్టర్ హిట్ కావడం.. స్కై హై అనే రేంజ్ కి ఎన్టీఆర్ ఇమేజ్ పెరిగిపోవడం.. కాస్త మైనస్ అయ్యిందని చెప్పాలి.

అతనొక్కడే

డైరెక్టర్ సురేందర్ రెడ్డి 'అతనొక్కడే' కథను ముందుగా ఎన్టీఆర్ కే చెప్పాడట. కానీ ఆ కథ ఎన్టీఆర్ కి నచ్చకపోవడంతో కళ్యాణ్ రామ్  ఈ కథతో సినిమా చేసి, బ్లాక్ బస్టర్ హిట్ ని కైవసం చేసుకున్నాడు. ఇది మాస్ యాక్షన్ ఫిల్మ్. 'సింహాద్రి' చేసి బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్, తర్వాతి సినిమా కూడా యాక్షన్ ఎంటర్ టైనర్ చేయకూడదనే భావనతోనే 'అతనొక్కడే' చిత్రాన్ని వదిలేసుకున్నాడు. ఆ విధంగా ఎన్టీఆర్ కెరీర్ లో ఓ హిట్ మిస్ అయ్యింది.

ఆర్య

'అతనొక్కడే' చిత్రాన్ని వదులుకున్న ఎన్టీఆర్ ఆ సమయంలో వదులుకున్న మరో చిత్రం 'ఆర్య'. సుకుమార్ ముందుగా 'ఆర్య' కథను ఎన్టీఆర్ కే చెప్పాడు. ఈ లైన్ క్లాస్ గా ఉందని చెప్పి ఎన్టీఆర్ నిరాకరించాడట. ఇదే స్టోరీ లైన్ తో అల్లు అర్జున్ 'ఆర్య' సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. అల్లు అర్జున్ ని యూత్, క్లాస్ ఆడియన్స్ కి దగ్గర చేసిన సినిమా ఇది. సో... మంచి యూత్ ఫుల్  ఎంటర్ టైనర్ సినిమా విషయంలో ఎన్టీఆర్ కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోవడం  మైనస్ అయ్యింది.

భద్ర

రవితేజకు 'భద్ర' కథ చెప్పకముందు బోయపాటి శ్రీను ఈ కథ ఎన్టీఆర్ కే చెప్పాడు. కానీ ఎన్టీఆర్ ఈ సినిమాని అంగీకరించలేదు. రవితేజ  అంగీకరించి చేసాడు. యాక్షన్ తో కూడుకున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'భద్ర'. ఈ సినిమా రవితేజ కెరియర్ కి మంచి మలుపు అయ్యింది. నిజం చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి రవితేజను దగ్గరకు చేసిన సినిమా ఇదే. ఎన్టీఆర్ ఈ సినిమాని వదులుకుని తప్పే చేసాడు.

కృష్ణ

రవితేజ కెరీర్ లో మంచి విజయం సాధించిన 'కృష్ణ' సినిమాని ఎన్టీఆర్ చేయాల్సి ఉంది. వి.వి.వినాయక్ ఈ కథను ఎన్టీఆర్ కే  చెప్పాడు. అయితే ఎన్టీఆర్ వేరే కథతో సినిమా చేద్దామని చెప్పి, 'కృష్ణ'ను వదులుకున్నాడు. 2008లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన చిత్రం 'కృష్ణ'. సో... ఈ సినిమాని వదులుకుని ఎన్టీఆర్ పెద్ద తప్పటడుగు వేసాడని చెప్పక తప్పదు.

కిక్

ఎన్టీఆర్ వదులుకున్న 'భద్ర', 'కృష్ణ' సినిమాలు రవితేజ అంగీకరించి చేసి, వరుసగా హిట్స్ కొట్టి స్టార్ హీరోల జాబితాలోకి చేరిపోయాడు. ఈ సినిమాలు మంచి వసూళ్లు సాధించడంతో రవితేజ స్టామినా పెరిగింది. ఈ సినిమాల తర్వాత కూడా ఎన్టీఆర్ వదులుకున్న ఓ సినిమానే రవితేజ రేంజ్ ని మరింత పెంచేసింది. ఆ సినిమా 'కిక్'. సురేందర్ రెడ్డి 'కిక్' కథను ఎన్టీఆర్ కే చెప్పాడు. అయితే ఎన్టీఆర్ ఈ సినిమా అంగీకరించకపోవడంతో రవితేజకు 'కిక్' చేసే అవకాశం దక్కింది. ఈ సినిమా ఏ రేంజ్ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా హిందీ రీమేక్ లో నటించి సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.

ఇలా అరడజను సూపర్ హిట్స్ ను ఎన్టీఆర్ మిస్ చేసుకున్నాడు. కానీ, సింహాద్రి, యమదొంగ, రాఖీ, బృందావనం వంటి హిట్స్ చేశాడు. అయితే, ఎన్టీఆర్ వదులుకున్న ఆరు సినిమాలూ అతన్ని ఆరు కోణాల్లో ఆవిష్కరించి ఉండేవి కాబట్టి, కెరీర్ ఇంకా బాగుండి ఉండేది. పైగా బాగా నటించగల సత్తా ఉన్ననటుడు ఎన్టీఆర్. తన కెరీర్ ఇలా డైలమాలో పడటంవల్లే... మొత్తం కెరీర్ ని విశ్లేషించి.. ఎన్టీఆర్ వదులుకున్న ఆరు చిత్రాల ప్రస్తావన తీసుకురావాల్సి వచ్చింది. ఒకవేళ వరుస విజయాలతో ఎన్టీఆర్ దూసుకెళితే.. ఈ ఆరు చిత్రాల ప్రస్తావన వచ్చి ఉండేది కాదు.

ఏదేమైనా.. 'టెంపర్'తో ఎన్టీఆర్ కి పూర్వ వైభవం వస్తుందనే ఆశతో అభిమానులున్నారు. ఆ ఆశ నిజం అయ్యే అవకాశం లేకపోలేదు.

Actor NTR missed Six Super hits!Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !