View

రిసెర్చ్ అవసరం లేదు - డైరెక్టర్ మణిరత్నం

Thursday,April16th,2015, 05:23 AM

సమాజంలో జరుగుతున్న అంశాలను కథాంశంగా తీసుకుని సినిమాలు చేస్తుంటారు డైరెక్టర్ మణిరత్నం. ఆయన దర్శకత్వం వహించిన 'రోజా', 'ముంబయ్', 'సఖి', 'యువ', 'రావణ్'.... ఇలా ఏ సినిమా తీసుకున్నా అందులో ఓ మెసేజ్ ఉంటుంది. ప్రేమ, త్రీవవాదం, రాజకీయాలు... ఏ అంశాన్ని అయినా ప్రేక్షకుల మనసుల్లోకి చొచ్చుకునిపోయేలా వెండితెరపై ఆవిష్కరించడం మణిరత్నం స్టైల్. క్లాస్, మాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకూ ఈ చిత్రాలు కనెక్ట్ అవుతాయి. తాజాగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఓకే కన్మణి'. ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకాలపై 'ఓకే బంగారం' టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల అందిస్తున్నారు దిల్ రాజు. దుల్హర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఏ.ఆర్.రహమాన్ ఈ చిత్రానికి సంగీతమందించగా, పి.సి.శ్రీరామ్ కెమెరా మ్యాన్ గా వ్యవహరించారు. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా డైరెక్టర్ మణిరత్నం, ఏ.ఆర్.రహమాన్ హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మణిరత్నం ఈ సినిమా గురించి చెప్పిన విశేషాలు ఈ విధంగా...

ముంబయ్ అందరికీ కనెక్ట్ అవుతుంది...
నా సినిమాల్లో ఎక్కువగా ముంబయ్ బ్యాక్ డ్రాప్ ని తీసుకుంటానని అందరూ అంటుంటారు. దీనికి ఓ కారణం ఉంది. నేను కొంతకాలం ముంబయ్ లో చదువుకున్నాను. ఆ సిటీ అంటే ఇష్టం. ఇండియాలోనే పెద్ద మెట్రో పాలిటిన్ సిటీ. పైగా ముంబయ్ లో అన్ని స్టేట్స్ కి సంబంధించిన వాళ్లు నివసిస్తుంటారు. ఆ రకంగా ప్రతి ఒక్కరికీ ఈ సిటీ ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. అందుకే ముంబయ్ బ్యాక్ డ్రాప్ ని తీసుకుంటాను.

యూత్ జీవన శైలిని తీసుకున్నాను...
నా సినిమాలన్నీ సమాజంలో జరిగే అంశాలతోనే ఉంటాయి. ఈ సినిమా కూడా సమాజంలో జరుగుతున్న ఓ పాయింట్ ని తీసుకుని తీసిన సినిమానే. ప్రస్తుతం యువతీ, యవకుల జీవన శైలి, వారి యాటిట్యూడ్, ఆలోచనలు ఎలా ఉంటున్నాయనేది ఈ సినిమాలో చర్చించాము. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా మెసేజ్ ఉంది.

సహజీవనం గురించి మాత్రమే కాదు...
ఈ సినిమా సహజీవనం అంశంతో మాత్రమే రూపొందింది కాదు. వివాహం గురించి, వివాహ వ్యవస్థపై సినిమాలోని పాత్రలకున్న అభిప్రాయాన్ని, మనుషుల యాటిట్యూట్, తద్వారా వారి జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకుంటున్నాయనే అంశాన్ని చూపించాము. ఇండివిడ్యువల్ గా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయంలో ఓ నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. ఆ అంశాన్నే ఈ సినిమాలో చూపించాము.

రిసెర్చ్ అవసరం లేదు...
ఓ సినిమాకి కథ అనుకున్నప్పుడు రిసెర్చ్ లాంటివి చేయాల్సిన అవసరంలేదు. పర్టిక్యులర్ గా ఏదో ఒక అంశాన్ని తీసుకుని సినిమా తెరకెక్కిస్తుంటే అప్పుడు రిసెర్చ్ అవసరం. కానీ సమాజంలో జరిగే అంశం నేపధ్యం అయితే రిసెర్చ్ అవసరం లేదు. ఆ ఎమోషన్స్ ని మనం ఫీల్ చేయగలిగితే చాలు...

నా సౌలభ్యం కోసమే వారిని తీసుకున్నాను...
దుల్హర్ సల్మాన్, నిత్యామీనన్ ని ఈ సినిమా కోసం తీసుకోవడానికి ఓ కారణం ఉంది. కథలో ఇమిడిపోగలరు. అందుబాటులో ఉంటారు. కథలోని పాత్రలకు అదనంగా విలువలు జోడించగల నటీనటులు. అందుకే వారిని ఎంచుకున్నాను.

తండ్రికి పూర్తి భిన్నం...
మమ్ముటీతో సినిమా చేసాను. ఆయన కొడుకు దుల్హర్ ఆయనకు పూర్తి భిన్నం. తనకంటూ ఓ శైలి ఉంది. తన తండ్రి ఇన్ ఫ్లూయెన్స్ దుల్హర్ పై అసలు లేదు. ఈ చిత్రంలోని పాత్రను అద్భుతంగా చేసాడు.

మంచి నటి...
నిత్యామీనన్ కి కథ చెబితే చాలు... తన పాత్రలో పూర్తిగా లీనమై నటించగలదు. మంచి నటి. ఈ సినిమాలోని పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది.

వేటూరిగారి ఫ్లేవర్ శాస్ర్తిగారిలో ఉంది...
నా సినిమాల్లోని పాటలను వేటూరిగారు చాలా గొప్పగా రాసారు. ఆయన ఫ్లేవర్ సీతారామశాస్ర్తిగారి పాటల్లో కనిపించింది. ఆయన ఈ సినిమాలోని పాటలను రాయడం గర్వంగా ఫీలవుతున్నాను.

పి.సి.శ్రీరామ్ నాతోనే ఉంటారు...
నేను, పి.సి.శ్రీరామ్ కలిసి సినిమా చేసినా, చేయకపోయినా... నేను చేసే ప్రతి సినిమా కథ శ్రీరామ్ కి చెబుతుంటాను. మేమిద్దరం కలిసి కథా చర్చల్లో పాల్గొంటాము. కాబట్టి ఆయనతో మళ్లీ కలిసి సినిమా చేస్తున్నాననే విషయంలో అర్ధం లేదు. మేమెప్పుడూ విడిపోలేదు.

ఏ.ఆర్.రహమాన్ ని వేధిస్తుంటాను...
ఏ.ఆర్.రహమాన్ కి కథ చెప్పి, ఆ ట్యూన్, ఈ ట్యూన్ అని వేధిస్తుంటాను. కానీ తను నాకు ఏం కావాలో అది చేసి పెడతారు.

ఒక వర్గం కోసం సినిమా చేయను...
యూత్, ఫ్యామిలీ, మాస్... చిన్న వయసు వాళ్లు... పెద్ద వయసు వాళ్లు... మధ్య వయస్కులు... ఎలా ఎవరినీ విడిగా చూసి సినిమా చేయను. అందరికీ కనెక్ట్ అయ్యేలా సినిమా ఉండాలనుకుంటాను. ముందుగా ఏ సినిమా చేసినా నాకు నచ్చాలి. అనుకున్న కథని నిజాయితీగా తెరకెక్కించాలి. అప్పుడు ఏ తేడా లేకుండా అన్ని వర్గాల వారికి ఆ సినిమా చేరిపోతుందనేది నా ఆలోచన.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !