View

డా.మోహన్ బాబు @ 40 ఇయర్స్ సినీ కెరియర్

Sunday,November22nd,2015, 04:18 PM

నాయకుడు, ప్రతి నాయకుడు... ఈ రెండు కోణాలను అద్భుతంగా ఆవిష్కరించిన గొప్ప నటుడు. 500పై చిలుకు చిత్రాల్లో నటించిన ఘనత ఆయనది. నిర్మాతగా పలు విజయాలు. 40 యేళ్ల సినీ కెరియర్. ఇది డా.మంచు మోహన్ బాబు ట్రాక్ రికార్డ్. డా.దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన 'స్వర్గం నరకం' చిత్రం ద్వారా నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు మోహన్ బాబు. 1975, నవంబర్ 22న ఈ చిత్రం విడుదలయ్యింది. నటుడిగా నేటితో 40యేళ్లు పూర్తి చేసుకుంటున్న మోహన్ బాబు సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తి. తల్లిదండ్రులు పెట్టిన పేరు భక్తవత్సతం నాయుడు అయితే, ఆయన సినిమా గురువు దాసరి నారాయణరావుగారు మోహన్ బాబుగా పేరు మార్చి చిత్ర పరిశ్రమకు పరిచయం చేసారు. 40 యేళ్ల కెరియర్ అంటే మామూలు విషయం కాదు. ఇంత పెద్ద అచీవ్ మెంట్ ని సాధించిన తమ తండ్రికి ఆయన వారసులు మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మీప్రసన్న ఆనంద్ జస్ట్ ఒక్క ముక్కలో శుభాకాంక్షలు చెప్పేయకుండా కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈ యేడాది అంతా సంబరాలు జరపాలని ప్లాన్ చేసారు. ఈ విశేషాలను తెలియజేయడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.


ఈ సమావేశంలో డా.దాసరి మాట్లాడుతూ - ''మోహన్ బాబు నటించిన 'స్వర్గం నరకం' సినిమా విడుదలై నేటితో 40 సంవత్సరాలయ్యింది. నా జీవితంలో ఎన్నో కార్యక్రమాలను చూసాను. ఎన్నో వేడుకలను చేసాను. కాని ఈ కార్యక్రమం చూస్తుంటే నా కళ్ళు చెమర్చాయి. ఎందుకంటే ఇది నా కుటుంబం. మా ఇంటి పెద్ద కొడుకు మోహన్ బాబు. ఈ వేదికపై సంపూర్ణమైన మోహన్ బాబు కుటుంబాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. జీవితంలో నేను సాధించనిది.. మోహన్ బాబు ద్వారా సాధించుకున్నాను. కొంతమంది యాక్టర్స్ ను పరిచయం చేసి వొదిలేస్తారు. కాని నేను మోహన్ బాబుని సంపూర్ణ నటునిగా చేసి వదిలాను. 'కేటుగాడు' సినిమాతో హీరోగా విజృంభించి 'పాలు నీళ్ళు' చిత్రంతో సిల్వర్ జూబ్లీ జాబితాలో చేరాడు. ఈ నలభై సంవత్సరాల్లో మోహన్ బాబు ప్రతి కదలిక నాకు తెలుసు. స్వర్గం నరకం సినిమా తరువాత తూర్పు పడమర సినిమా చేసాను. ఆ సినిమాలో మోహన్ బాబునే హీరోగా అనుకున్నాను. రజినీకాంత్ హీరోగా నేను నటిస్తానని ముందుకొచ్చాడు. రెండో చిత్రానికే పోటీ పడ్డారు. ఈ రోజు వారిద్దరు మంచి స్నేహితులు. సొంతంగా బ్యానర్ పెట్టి హిట్స్ కొట్టాడు. 'అల్లుడు గారు','అసెంబ్లీ రౌడీ' వంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించాడు. తనకు సమయంలేక వదిలేసిన చిత్రాలతో కొందరు హీరోలు అయిపోయారు. మల్టిపుల్ టాలెంట్ ఉన్న నటుడు. భారత సినీ చరిత్రలో మోహన్ బాబు కు ఉన్న గ్రాఫ్ నాగేశ్వరావు, రామారావు, దిలీప్ కుమార్ లాంటి నటులకు కూడా లేదు. తను నటించిన 'పెదరాయుడు' చిత్రం ఓ ఆణిముత్యంగా మిగిలిపోయింది. వందకు వంద శాతం రిజల్ట్ ఇచ్చే అతి తక్కువ మంది నటుల్లో మోహన్ బాబు ఒకడు. తన బిడ్డల్ని ప్రమోట్ చేసి వాళ్ళని మంచి స్థానాలకు తీసుకురావాలని ఎంతో శ్రమ పడ్డాడు. నలభై సంవత్సరాలు మోహన్ బాబు జీవితానికి ముగింపు కాదు. వెటకారం, వెక్కిరింపులతో ఆరు పాటలు, ఆరు ఫైట్స్ తో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది. ఈ కోణంలో మోహన్ బాబు సినిమా తీసి చరిత్ర సృష్టిస్తాడనే నమ్మకం నాకుంది'' అని చెప్పారు.


డా. సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ - ''మోహన్ బాబు గారిది రిమార్కబుల్ లైఫ్. దాసరి గారి సినిమా ద్వారా హీరోగా పరిచయమై అరవై సినిమాలను నిర్మించే స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు. లాభనష్టాల గురించి ఆలోచించకుండా బిడ్డల ఎదుగుదల కోసం కృషి చేసాడు'' అని చెప్పారు.


హీరో వెంకటేష్ మాట్లాడుతూ - ''నలభై సంవత్సరాలు నటునిగా, నిర్మాతగా, విద్యావేత్తగా తన జీవితాన్ని సాగించారు. సింపుల్ గా ఉండే గొప్ప మనిషి మోహన్ బాబుగారు. ఏ పాత్రలో అయిన ఒదిగిపోయి నటిస్తారు'' అని తెలిపారు.


à°¡à°¾. మోహన్ బాబు మాట్లాడుతూ - ''à°ˆ నలభై సంవత్సరాలు ఎలా గడిచాయో తెలియట్లేదు. నాన్నగారు టీచర్. మా ఊర్లో మూడు ఎకరాల పొలం ఉండేది. ఏదైనా ఉద్యోగం చేయి.. లేదా వ్యవసాయం చూసుకోమని చెప్పేవారు. నా తండ్రి తరువాత తండ్రి లాంటి వారు దాసరి నారాయణరావు గారు. కో డైరెక్టర్ à°—à°¾ పని చేస్తున్న నన్ను నటునిగా మార్చారు. నా తండ్రి à°­‌క్త‌à°µ‌త్స‌లం నాయుడు అని పేరు పెడితే మోహన్ బాబు అని మరో పేరు పెట్టారు దాసరి గారు. క్రమశిక్షణ నేర్పించారు. మహానటుడు ఎన్టీఆర్ తరువాత అంతటి నటుడు మోహన్ బాబు మాత్రమే అని చెప్పారు. నేను నటించిన 550 చిత్రాల్లో ఎక్కువ శాతం నటించింది ఆయన సినిమాల్లోనే. ఆత్రేయ, బి.గోపాల్, రాఘవేంద్ర రావు వంటి వారందరూ నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసారు. నేను à°ˆ రోజు à°ˆ స్థానంలో ఉండడానికి కారణం నా తల్లితండ్రులు చేసిన పుణ్యమే. నా తండ్రి టీచర్ అవ్వడంతో à°“ విద్యాసంస్థను మొదలు పెట్టాలని 400 మంది విద్యార్థులతో స్థాపించిన శ్రీ విద్యానికేత‌న్ ఎడ్యుకేష‌à°¨‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్‌ à°ˆ రోజు 12500 మంది విద్యార్థులతో విజవంతంగా నడుస్తోంది. కులమతాలకు అతీతంగా 25శాతం ఉచితంగా విద్యను అందిస్తున్నాం. 40యేళ్ల సినీ కెరియర్ ని పూర్తి చేసుకుంటున్నాను. నా ఎదుగుదలకు కారణమైన ప్రతి ఒక్కరికి à°ˆ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను'' అని చెప్పారు.


ఈ యేడాది పాటు నిర్వహించనున్న మోహన్ బాబు 40 వసంతాల సంబరాల వివరాలను మంచు విష్ణు, మనోజ్, లక్ష్మీప్రసన్న తెలియజేసారు.


1. మోహన్ బాబుకుగారికి నచ్చిన 'అసెంబ్లీ రౌడీ','రాయలసీమ రామన్న చౌదరి' సినిమాలకు సంబంధించిన స్ర్కిఫ్ట్, షూటింగ్ విశేషాలతో పుస్తకావిష్కరణ.
2. రెండు తెలుగు రాష్టాల్లోని టీచర్లకు బెస్ట్ టీచర్ అవార్డ్స్
3. మోహన్ బాబుగారు నటించిన సినిమాల్లో అరవై హిట్ సాంగ్స్ ను సీడీలు, డివిడిల రూపంలో విడుదల చేయడం
4. మోహన్ బాబుగారి నలభై సంవత్సరాల కెరీర్ లో ట్రావెల్ చేసిన దర్శకులు, నటీనటులతో, నిర్మాతలతో ఒక టాక్ షో ను నిర్వహించనున్నారు.
5. మోహన్ బాబు గారి అరుదైన ఫోటోలను సేకరించి పిక్చర్ ఎగ్జిబిషన్ ను కండక్ట్ చేయడానికి ప్లాన్ చేసారు.
6. మోహన్ బాబు గారి ఫేమస్ డైలాగ్స్ అన్ని ఒక పుస్తకంగా విడుదల చేయనున్నారు.
7. వ్యక్తిగతమైన, వృత్తికి సంబంధించిన ఫోటోలను ఓ పుస్తకంగా తయారు చేయనున్నారు.
8. మోహన్ బాబుగారు నటించిన 550 చిత్రాల్లో తెరవెనుక జరిగిన సన్నివేశాలను ప్రేక్షకులకు తెలియబరచనున్నారు.
9. ఆయన చిత్రాల్లో సూపర్ డూపర్ హిట్ అయిన పెదరాయుడు చిత్రాన్ని డిజిటల్ చేసి మరోసారి విడుదల చేయనున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !