View

సూపర్ స్టార్ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు

Sunday,May31st,2015, 05:22 AM

'మనిషి మేని ఛాయ మాత్రమే కాదు.. మనసు కూడా తెలుపే..' సూపర్ స్టార్ కృష్ణ గురించి ఏదైనా చెప్పాలంటే ముందుగా ఈ మాటలను చెబితేనే బాగుంటుంది. స్వచ్ఛమైన తెల్ల కాగితంలాంటి మనసు కృష్ణది. చిత్రసీమకు ఎంతోమంది నటీనటులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, కొంతమందే ఎప్పటికీ అందరి మనసుల్లో నిలిచిపోతారు. అలాంటివాళ్లల్లో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. నటుడిగానే కాకుండా వ్యక్తిగా కూడా అందరి అభిమానాన్నీ సంపాదించుకున్నారు. నేడు (31.5.2015) ఈ నటశేఖరుడి పుట్టినరోజు. ఈ సందర్భంగా 'సూపర్ స్టార్ కృష్ణ' గురించి ప్రత్యేక కథనం...

పదండి ముందుకుతో నటుడిగా ముందుకు...
గుంటూరు జిల్లా తెనాలిలోని బుర్రిపాలెం కృష్ణ స్వస్థలం. బీయస్సీ వరకు చదువుకున్నారు. కాలేజీ డేస్ లో అక్కినేని నాగేశ్వరరావుకి జరిగిన సన్మానం చూసి, సినిమా హీరో అయితే బాగుండు అనుకున్నారు కృష్ణ. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అప్పటికే మ్రదాసులో సినిమాల్లో రాణిస్తున్న నిర్మాత చక్రపాణిని కలిశారు. కానీ, వయసు తక్కువ ఉందనీ, కొన్నాళ్లు ఆగమని ఆయన సలహా ఇవ్వడంతో ఈ బుర్రిపాలెం బుల్లోడు వెనక్కి వచ్చేశారు. తన ఊళ్లోనే కొన్ని నాటకాల్లో నటించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ మద్రాసు వెళితే, 'పదండి ముందుకు' చిత్రంలో చిన్న పాత్ర చేసే అవకాశం దక్కింది. ఆ తర్వాత రెండు మూడు చిత్రాల్లో చిన్నపాటి పాత్రలు పోషించారు కృష్ణ.

'తేనె మనసులు'తో జోరుగా...
సరిగ్గా ఆ సమయంలో నూతన నటీనటులతో దర్శక, నిర్మాత ఆదుర్తి సుబ్బరావు ఓ సినిమా తీస్తున్నారని తెలిసి, కృష్ణ తన ఫొటోలను, బయోడేటాను పంపించారు. ఆ సినిమాకి కృష్ణంరాజు, హేమ మాలిని, జయలలితలు కూడా స్ర్కీన్ టెస్ట్ కి వచ్చారు. కానీ, సెలక్ట్ కాలేదు. ఆ అవకాశం కృష్ణను వరించింది. ఆదుర్తి దగ్గర సహాయ దర్శకునిగా చేసిన కె. విశ్వనాథ్ డైలాగులు ఎలా పలకాలో కృష్ణకు నేర్పించారు. హీరాలాల్ మాస్టర్ డాన్స్ నేర్పించారు. అన్నీ శ్రద్ధగా నేర్చుకున్నారు. స్వతహాగా అందగాడు కావడంతో, తొలి చూపులోనే అందర్నీ ఆకట్టుకున్నారు కృష్ణ. దాంతో పాటు 'తేనె మనసులు'లో చక్కగా అభినయించడం, ఆ సినిమా కూడా బాగుండటంతో తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నారు. 'తేనె మనసులు' సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా అప్పటి ప్రముఖ దర్శక, నిర్మాతల దృష్టి కృష్ణ పై పడింది. ఆ తర్వాత కన్నె మనసులు, గూఢచారి 116, ఇద్దరు మొనగాళ్లు, సాక్షి.. ఇలా వరుసగా సినిమాలు చేశారు కృష్ణ.

రోజుకి మూడు షిఫ్టులు...
కృష్ణ ఎంత బిజీగా సినిమాలు చేశారో చెప్పడానికి చాలా ఉదాహరణలున్నాయి. 1969 నుంచి 72 లోపు కృష్ణ ఏకంగా 60 సినిమాల వరకూ నటించారు. నేటితరం హీరోలు తమ కెరీర్ మొత్తంలో 60 చిత్రాలు చేయగలుగుతారా? అనే పరిస్థితి ఉంది. అలాంటిది నాలుగేళ్లల్లో 60 చిత్రాలు చేశారంటే ఎంత కష్టపడి ఉంటారో ఊహించవచ్చు. ఉదయం ఏడు గంటలకు మొదలుపెట్టి రాత్రి పది గంటల వరకు కృష్ణ మూడు షిఫ్టులు చేసిన రోజులు ఎక్కువ. కంటి నిండా నిద్రపోయిన రోజులూ తక్కువే. అంత కష్టపడ్డారు కాబట్టే, నటుడిగా ఎప్పటికీ చర్రితలో మిగిలిపోయే పేరుని సంపాదించుకున్నారు. దాదాపు 350 పై చిలుకు చిత్రాల్లో నటించిన ఘనత కృష్ణది.

ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చిత్రాలన్నీ కృష్ణవే...
తెలుగులో తొలి ఈస్ట్ మన్ కలర్ చిత్రం (ఈనాడు)లో నటించిన ఘనత కృష్ణదే. అలాగే, తొలి 70ఎంఎం చిత్రం (సింహాసనం), తొలి స్కోప్ చిత్రం (అల్లూరి సీతారామరాజు), తొలి డీటీయస్ చిత్రం (తెలుగు వీర లేవరా).. ఇలా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనదగ్గ చిత్రాలు చేసిన ఘనత కృష్ణకే దక్కుతుంది. అది మాత్రమే కాదు.. 'మోసగాళ్లకు మోసగాడు'తో తెలుగులో కౌబోయ్ చిత్రాలకు నాంది పలికిన క్రెడిట్ కూడా ఆయనదే. 'అల్లూరి సీతారామరాజు' గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది,. ఎన్నో వ్యయ ప్రయాసకోర్చి సొంత సంస్థ పై కృష్ణ తీసిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పట్లో 'మాయాబజార్' తర్వాత భారీ తారాగణం నటించిన చిత్రం ఇదే.

ఎన్నో అవార్డులు.. రివార్డులు...
తన 50 ఏళ్ల సినీ జీవితంలో కృష్ణ అందుకున్న అవార్డులు, రివార్డులు ఎన్నో. వాటిలో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం ఉండటం గమనార్హం. ఎన్టీఆర్ జాతీ అవార్డు, నంది అవార్డు.. ఇలా ఎన్నో ఆయనకు దక్కాయి. నటుడిగా మాత్రమే కాదు.. వ్యక్తిగా కూడా మంచితనానికి చిరునామా అనిపించుకున్న ఈ నటశేఖరుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన పుట్టినరోజు సందర్భంగా 'ఫిల్మీబజ్..కామ్' శుభాకాంక్షలు అందజేస్తోంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !