View

4 వారాలు మెగా హీరోల సందడి... అభిమానులకు పండగే!

Saturday,September12th,2015, 08:49 AM

వచ్చే వారం వదిలేస్తే... ఆ తర్వాత రాబోయే నాలుగు వారాలు మెగా హీరోల సందడి కొనసాగనుంది. బాక్సాపీస్ వద్ద ఈ మెగా హీరోలు చేయబోతున్న సందడి మెగాభిమానుల్లో ఫుల్ జోష్ తేవడం ఖాయమని చెప్పొచ్చు. దసరా ముందు, దసరా పండగకి మెగా హీరోల నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ నాలుగు సినిమాలపైన భారీ అంచనాలే ఉన్నాయి. వాటి వివరాల్లోకి వెళితే...


సుబ్రమణ్యం ఫర్ సేల్
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన 'సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంతో సాయిధరమ్ తేజ్ మెగాభిమానులను ఫుల్ ఖుషీ చేసే అవకాశం ఉంది.


కంచె
'సుబ్రమణ్యం ఫర్ సేల్' విడుదలైన మరుసటి వారం అక్టోబర్ 2న మెగాబ్రదర్ తనయుడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'కంచె' చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్. టీజర్స్ ఆడియన్స్ లో చాలా ఆసక్తిని రేకెత్తించాయి. దేశభక్తి ప్రధాన అంశంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా విడుదల కోసం అటు మెగాభిమానులే కాకుండా, సినీ ప్రియులు కూడా ఎదురుచూస్తున్నారు.


రుద్రమదేవి
'కంచె' తర్వాత విడుదలకాబోతున్న మెగా హీరో చిత్రం అల్లు అర్జున్ నటించిన 'రుద్రమదేవి'. అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డిగా నటించాడు. పాత్ర నిడివి కూడా దాదాపు గంట పాటు ఉంటుందట. కాబట్టి ఈ సినిమా కోసం కూడా మెగాభిమానులు ఎదురుచూస్తున్నారు. 'రుద్రమదేవి' విడుదలైన రోజున మెగా సందడి ఖచ్చితంగా ఉంటుంది. ఇది 'రుద్రమదేవి' కి కూడా కలిసొస్తుంది.


బ్రూస్ లీ
రుద్రమదేవి తర్వాత రాబోయే మెగా హీరో సినిమా 'బ్రూస్ లీ'. రాంచరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ అఫియరెన్స్ ఇస్తున్నారు. దాంతో మెగాభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూపులు చూస్తున్నారు.


సో... రాబోయే నాలుగు వారాలు మెగాభిమానులకు పండగే అని చెప్పొచ్చు. మరి ఈ మెగా హీరోలు ఏ రేంజ్ విజయాన్ని ఈ చిత్రాల ద్వారా అందుకుంటారో వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !