View

మహేశ్ బాబు గురించి తెలియని పలు నిజాలు!

Wednesday,October21st,2015, 07:44 AM

టాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో మహేశ్ బాబు కు బోల్డంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ అందగాడి గురించి ఏ విషయం అయినా చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు. అలాంటి అభిమానుల కోసం మహేశ్ బాబు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం...

 

- మహేశ్ బాబు పుట్టింది చెన్నయ్ లో. అక్కడి కల్యాణి నర్సింగ్ హోమ్ లో ఉదయం 8 గంటల 30 నిముషాలకు పుట్టాడు.


- మహేశ్ పుట్టినప్పుడు ఆయన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ చెన్నయ్ లోనే ఉన్నారు. కానీ, ఆస్పత్రిలో లేరు. మెరీనా బీచ్ లో జరిగిన 'గాజుల కిష్టయ్య' షూటింగ్ లో ఉన్నారు. కొడుకు పుట్టిన విషయం తెలియగానే, ఆయన ఆస్పత్రికి వెళ్లారు.


- మహేశ్ బాబు ముద్దు పేరు నాని. ఇంట్లో అందరూ తనను అలానే పిలుస్తారు.


- చిన్నప్పుడు మహేశ్ పెద్దగా అల్లరి చేసేవాడు కాదు. కానీ, స్కూల్ హాలిడేస్ అంటే ఊటీ తీసుకెళ్లమనేవాడు. ఊటీలో సవాయ్ హోటల్ లోనే ఉండాలనేవాడు. ఆ హోటల్ లో గార్డెన్ కాటే్జ్ ఉండేది. అప్పట్లో ఊటీలో అదే ఖరీదు గల సూట్. కొడుకు కోరిక మేరకు ఊటీ తీసుకెళ్లడంతో పాటు ఆ హోటల్ లోనే కాటేజ్ బుక్ చేసేవారు.


- ఓ స్టార్ హీరో కొడుకులా మహేశ్ పెరగలేదు. స్కూల్ కి ఆటోలోనే వెళ్లేవాడు. అలాగే తాను సినిమాల్లో నటిస్తున్నానని కూడా స్కూల్లో చెప్పలేదు. అలా చెప్తే ప్రత్యేకంగా చూస్తారని మామూలు పిల్లాడిలా ఉండేవాడు.


- మహేశ్ కి చిన్నప్పుడు మ్యాక్స్ సబ్జెక్ట్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. లెక్కల్లోనే తక్కువ మార్కులు వచ్చేవి. ఓవరాల్ గా మహేశ్ యావరేజ్ స్టూడెంట్. కానీ, టెన్త్ వరకే. ఇంటర్ లో కష్టపడి చదివి, డిస్టింక్షన్ లో పాసయ్యాడు.


- చిన్నప్పుడు మహేశ్ బాబు షూటింగ్ లొకేషన్స్ కి వెళ్లడానికి ఇష్టపడేవాడట. అయితే చదవు పాడైపోతుందని శని, ఆదివారం నాడు మాత్రమే షూటింగ్ కి తీసుకెళ్లేవారట కృష్ణ.


- కృష్ణ నటించిన 'పోరాటం' షూటింగ్ చూడ్డానికి మహేశ్ బాబు వెళ్లాడు. ఆ చిత్రంలో కృష్ణ తమ్ముడి పాత్రకు మహేశ్ అయితే బాగుంటుందని దర్శకుడు కోడి రామకృష్ణ అన్నారట. కానీ, నేను నటించనంటూ మహేశ్ ఆ స్టూడియో చుట్టూ తిప్పించాడు. ఆ తర్వాత ఎలాగోలా మహేశ్ ని నటింపజేశారు.


- తండ్రి కృష్ణ నటించిన చిత్రాల్లో మహేశ్ కి 'అల్లూరి సీతారామరాజు', 'అగ్నిపర్వతం' చాలా ఇష్టం.


- చిన్నప్పుడు మహేశ్ బాబు ధర్మ రాజ్ మాస్టర్ దగ్గర కొన్ని రోజులు డ్యాన్స్ నేర్చుకున్నాడు. అప్పుడే ఓ రెండు నెలలు భరతనాట్యంలో ట్రైనింగ్ తీసుకున్నాడు. అలాగే, వైజాగ్ సత్యానంద్ దగ్గర కొన్ని నెలలు నటన నేర్చుకున్నాడు.


- మహేశ్ బాబుకి బుక్స్ చదవడం అలవాటు. 'ది ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్' అనే పుస్తకం చదివి, సిగరెట్లు కాల్చడం మానేశాడు. ఇప్పటికి మహేశ్ సిగరెట్లు మానేసి, ఆరేడేళ్లయ్యింది. సిగరెట్లు ఆరోగ్యానికి చాలా హానికరం అని, కాల్చకూడదని సలహా కూడా ఇస్తాడు.


- చెన్నయ్ లో చదువుకున్నందువల్ల మహేశ్ కి తెలుగు చదవడం, రాయడం రాదు. ఎంత లెంగ్తీ డైలాగ్ ని అయినా మనసులోనే మననం చేసుకుని, చెప్పేస్తాడు.


- చెన్నయ్ లోని సెయింట్ బీడ్స్ స్కూల్ లో చదువుకున్నాడు. ఆ తర్వాత లయోలా కాలేజీలో చదువుకున్నాడు.


- మహేశ్ బాబు, నమ్రతలది లవ్ మ్యారేజ్ అనే విషయం తెలిసిందే. 2003లో పెళ్లి గురించి ఈ ఇద్దరూ మాట్లాడుకున్నారు. చివరికి 2005లో పెళ్లి చేసుకున్నారు.


- మహేశ్ బాబుని నమ్రత ఏమని పిలుస్తుందో తెలుసా?.. 'బేబీ' అని పిలుస్తుంది.


- నమ్రత డెలివరీ జరుగుతున్నప్పుడు మహేశ్ కూడా ఉన్నాడు. గౌతమ్ పుట్టడం స్వయంగా చూశాడు. ఆ బర్త్ ఓ అద్భుతంగా అనిపించిందని ఓ సందర్భంలో మహేశ్ పేర్కొన్నాడు.


- షూటింగ్స్ లేనప్పుడు మహేశ్ బాబు ఫ్యామిలీతోనే ఎక్కువగా గడుపుతాడు. భార్య, పిల్లలతో ఎక్కువగా హాలిడే ట్రిప్స్ వెళుతుంటాడు.


- గౌతమ్, సితార చదువుకుంటున్న స్కూల్స్ కి వెళుతుంటాడు మహేశ్.


- మహేశ్ కి సింపుల్ గా ఉండటం ఇష్టం. ముఖ్యంగా డ్రెస్సింగ్ విషయంలో చాలా సింపుల్. నమ్రత అతని జీవితంలోకి వచ్చాకే డ్రెస్సింగ్ స్టయిల్ మారింది.


- సౌత్ లో ఎక్కువ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఘనత మహేశ్ బాబుదే.


- కుటుంబమే తన బలం అంటున్నాడు. పర్సనల్ లైఫ్ బాగుంటే ప్రొఫెషనల్ లైఫ్ మీద పూర్తి దృష్టి సారించవచ్చని మహేశ్ అంటాడు. నమ్రత మంచి హోమ్ మేకర్ కావడంతో లైఫ్ పీస్ ఫుల్ గా ఉందని భార్యకు క్రెడిట్ ఇస్తాడు.


- చిన్నప్పుడు మహేశ్ బాబు నటన చూసి, పెద్దయ్యాక పెద్ద స్టార్ అవుతాడని కృష్ణ అనుకునేవారు. అది నిజం చేశాడు మహేశ్ బాబు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !