View

హిట్ హిట్ హుర్రే... వారెవ్వా... వారాహి!

Sunday,October12th,2014, 06:18 AM

'V' for victory... 'v' for Vaarahi... వరుస విజయాలతో victoryకి చిరునామాగా నిలిచింది Vaarahi. వారాహి పేరు సూచించింది సంగీత దర్శకుడు కీరవాణి. ఏ ముహూర్తాన 'వారాహి చలన చిత్రం' అని నామకరణం చేశారో కానీ.. వరుస విజయాలే. ఈ సంస్థ అధినేత సాయి కొర్రపాటి భాగస్వామ్యంలో సినిమాలు తీసినా హిట్ గ్యారంటీ. 'ఈగ'లాంటి భారీ చిత్రం నిర్మించి, ఘనవిజయాన్ని సొంతం చేసుకోవడంతో సాయి కొర్రపాటి విజయ పరంపర మొదలైంది. ఆ తర్వాత నిర్మించిన 'లెజెండ్' బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. రెండు భారీ చిత్రాలు నిర్మించిన సాయి కొర్రపాటి 'స్టార్ ప్రొడ్యూసర్' అయ్యారు. ఈ స్టార్ అడిగితే.. ఏ స్టార్ అయినా డేట్స్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. కానీ, సాయి కొర్రపాటి డిఫరెంట్. కేవలం పెద్ద చిత్రాలకు మాత్రమే పరిమితం అవ్వాలా అని ఆలోచించారు. చిన్న బడ్జెట్ తో చిన్న చిత్రాలు తీస్తే బాగుంటుంది కదా అనుకున్నారు. దాన్ని ఊహలకే పరిమితం చేయలేదు. 'ఊహలు గుసగుసలాడే' అంటూ చిన్న చిత్రానికి శ్రీకారం చుట్టేశారు.

అప్పటివరకు కామెడీ టచ్ ఉన్న హీరో క్యారక్టర్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ కి దర్శకత్వ బాధ్యతలు ఇవ్వడంతో పాటు, కీలక పాత్ర చేస్తానంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు సాయి కొర్రపాటి. చాక్లెట్ బోయ్ లా ఉండే నాగశౌర్యను హీరోగా తీసుకున్నారు. రాశి ఖన్నా అనే అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేశారు. తక్కువ రోజుల్లో, తక్కువ నిర్మాణ వ్యయంతో తీసిన ఈ బొమ్మ వెండితెరకొచ్చింది. చూసినవాళ్లందరూ 'భేష్.. మంచి అనుభూతికి గురి చేసింది. ఎలాంటి వల్గారిటీ లేదు. చాలా హాయిగా అనిపించింది' అని గుసగుసలాడుకోలేదు.. బహిరంగంగానే చెప్పారు. కట్ చేస్తే.. అవసరాలకు దర్శకునిగా మంచి పేరు, నాగశౌర్యకు మంచి గుర్తింపు, ఆ చిత్రం తర్వాత రాశీ ఖన్నా చేతిలో నాలుగు చిత్రాలు. దీన్నిబట్టి ఈ చిత్రం ఏ స్థాయిలో రీచ్ అయ్యిందో చెప్పొచ్చు. 'లెజండ్' వంటి పక్కా కమర్షియల్ చిత్రం తీసిన నిర్మాత, ఆ వెంటనే ఓ స్టార్ హీరో డేట్స్ చేజిక్కించుకుని మంచి మాస్ మసాలా సినిమా తీసేసి, క్యాష్ చేసుకోవాలనే ఆలోచన లేకుండా.. ప్రేక్షకులకు 'ఊహలు గుసగుసలాడే' వంటి చిత్రాలు కూడా ఇవ్వాలనుకోవడం గొప్ప విషయం.

ఈసారీ చిన్న చిత్రమే.. విజయం భారీ!

ఇక, 'ఊహలు గుసగుపసలాడే హిట్టయ్యింది కదా.. ఈసారి వారాహి నుంచి భారీ చిత్రం వస్తుందని చాలామంది భావించారు. కానీ, అందరి ఊహలకు భిన్నంగా ఈసారి కూడా చిన్న చిత్రమే మొదలుపెట్టారు. మళ్లీ అచ్చ తెలుగు టైటిల్ తో 'దిక్కులు చూడకు రామయ్య'  à°¸à°¿à°¨à°¿à°®à°¾ మొదలుపెట్టారు. ఎప్పట్నుంచో దర్శకత్వ శాఖలో పని చేస్తూ.. దర్శకునిగా ఇట్టే అవకాశాలు వచ్చి అట్టే చేజారిపోయిన నేపథ్యంలో ఇక మెగాఫోన్ పడతారా? లేదా? అని కొంతమంది త్రికోటి గురించి ఆలోచించి ఉంటారు. కానీ, వారాహి కొండంత à°…à°‚à°¡ అయ్యింది. à°ˆ చిత్రం ద్వారా త్రికోటిని దర్శకునిగా పరిచయం చేస్తూ, దాదాపు విలన్ పాత్రలకు పరిమితమై, à°“ మూడు, నాలుగు చిత్రాల్లో హీరోగా తన అదృష్టాన్ని పరిక్షించుకున్న అజయ్ ని 'దిక్కులు చూడకు రామయ్య'లో à°“ హీరోగా నటింపజేశారు. అంతకు ముందెన్నడూ నటునిగా అజయ్ లో చూడని కోణాన్ని à°ˆ చిత్రం ఆవిష్కరించింది. అలాగే, నటుడిగా నాగశౌర్యను మరో మెట్టు పైకి ఎక్కించింది. దాదాపు పధ్నాలుగేళ్ల విరామం తర్వాత తెలుగు తెరపై à°ˆ చిత్రం ద్వారా మెరిసింది ఇంద్రజ. నూతన నాయిక సనా మక్బూల్ కు à°ˆ చిత్రం మరో నాలుగైదు చిత్రాలకు అవకాశం తెచ్చిపెట్టేంత గుర్తింపు తెచ్చింది. త్రికోటి లాంటి ప్రతిభ à°—à°² దర్శకుణ్ణి ఇన్నేళ్లు తెలుగు పరిశ్రమ ఎందుకు వాడుకోలేకపోయిందా? అని à°ˆ చిత్రం చూసినవాళ్లకి అనిపించకమానదు. మొత్తం మీద ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్స్ ని నిర్మించాలనే సాయి కొర్రపాటి ఆకాంక్ష  à°¤à±à°°à°¿à°•à±‹à°Ÿà°¿ లాంటి ప్రతిభావంతుల్ని వెలికి తీసేలా చేసింది.

8 నెలలు... 3 విజయాలు

ఇప్పటివరకు సాయి కొర్రపాటి నిర్మించిన చిత్రాలు ఐదు. వాటిలో అందాల రాక్షసి, ఈగ, లెజెండ్ భాగస్వామ్యంలో రూపొందినవి. ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య చిత్రాలను సోలోగా చేశారు. ఈ ఐదూ విజయవంతమైన చిత్రాలే. 2012లో ఈగ విడుదలై, సూపర్ డూపర్ హిట్టయ్యింది. అదే ఏడాది విడుదలైన అందాల రాక్షసి చిన్న చిత్రాల్లో పెద్ద చిత్రంగా నిలిచింది. ఇక, ఈ ఏడాది లెజెండ్, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య..ఈ మూడూ విడుదలై, ఘనవిజయం సాధించాయి. మూడు వరుస విజయాలతో.. అది కూడా ఎనిమిది నెలల కాలంలో విడుదలైన ఈ చిత్రాలు విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ సాధించారు సాయి కొర్రపాటి.

మామూలుగా ఏ బ్యానర్ ఆరంభించినా గుర్తింపు రావడానికి కొంచెం టైమ్ పడుతుంది. కానీ,  'వారాహి చలన చిత్రం'ని ఆరంభించిన అతి తక్కువ సమయంలోనే 'అగ్ర సంస్థ'à°² జాబితాలోకి చేరిపోవడం గొప్ప విషయం.

 

Vaarahi Successfull Journey



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !