View

కోట్లు తీసుకునే అనుష్క, తమన్నా, నయనతార ఏమయ్యారు?

Thursday,October16th,2014, 06:28 AM

హుదుద్ సైక్లోన్ వల్ల వైజాగ్, ఉత్తరాంధ్ర ప్రాంతాలు అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రకృతి సృష్టించిన ఈ విలయ తాండవం వల్ల వేలాది ఇళ్లు కుప్పకూలాయి. జన జీవనం స్థంభించింది. ఈ వరద బాధితులను ఆదుకోవడానికి చిత్ర పరిశ్రమ భారీగా స్పందించింది.

రేణూ దేశాయ్, సమంత, కాజల్, రకుల్ బేష్...

హీరోలు, నిర్మాతలు భారీగా విరాళాలు ఇచ్చి తమ వంతు సహాయం చేస్తున్నారు. ముగ్గురు, నలుగురు దర్శకులు, ఆరేడుగురు కేరక్టర్ నటులు కూడా స్పందించారు. కోట్లు పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లు నుంచి మాత్రం సరైన స్పందన రాలేదు. సేవా, సహాయ కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే సమంత 10లక్షలు తుఫాన్ బాధితుల కోసం విరాళం ప్రకటించి తన మంచి మనసును చాటుకుంది. కాజల్ అగర్వాల్ కూడా 5లక్షలు విరాళం ఇచ్చి తెలుగు నేలపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా పైకొస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ కూడా లక్ష రూపాయలు విరాళం ఇచ్చి భేష్ అనిపించుకుంది. తెలుగు పరిశ్రమతో పూర్తిగా సంబంధాలు తెగిపోయిన రేణూ దేశాయ్ సైతం 20 లక్షలు విరాళం ప్రకటించింది. కానీ, ఇంకా స్పందించాల్సిన లలనామణులు ఉన్నారు.

అనుష్క, తమన్నా, నయనతార, శృతిహాసన్ మనసు కరగలేదా...

ప్రస్తుతం అగ్ర తారలుగా వెలుగొందుతున్నవారిలో అనుష్క, తమన్నా, నయనతార, తాప్సీ హన్సికల పేర్లను ప్రముఖంగా చెప్పుకోవాలి. à°ˆ ఐదుగురికీ ముందు బ్రేక్ ఇచ్చింది తెలుగు చలన చిత్ర పరిశ్రమే. కోట్లు పారితోషికం ఇస్తున్నది కూడా ఇక్కడే.  à°•à°¾à°¨à±€, à°ˆ హీరోయిన్లు ముందుకురాకపోవడంతో... పరాయి రాష్టాల నుంచి వచ్చిన పాపలు కదా, అందుకే తెలుగు గడ్డపై జరిగిన విపత్తు వారి హృదయాలను తాకలేదని అంటున్నారు. 'బాహుబలి', 'రుద్రమదేవి' లాంటి భారీ ప్రాజెక్ట్ చేస్తూ అనుష్క కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటోంది. ఇవి కాకుండా అనుష్క చేతిలో ఇంకా సినిమాలు ఉన్నాయి. తమన్నా ప్రస్తుతం 'బాహుబలి'లాంటి భారీ ప్రాజెక్ట్ చేస్తోంది, ఇటీవలే 'ఆగడు' సినిమా కోసం భారీ పారితోషికం అందుకుంది. అంతే కాదు... à°ˆ ఇద్దరి చేతినిండా సినిమాలున్నాయి. బాగానే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఇక శృతిహాసన్ ని స్టార్ హీరోయిన్ ని చేసింది తెలుగు ప్రేక్షకులే. తెలుగు సినిమాలకు కోటి రూపాయలు పారితోషికం తీసుకుంటోంది. ఈవిడగారు కూడా మొహం చాటేసింది. తెలుగు గడ్డపై జరిగిన విపత్తుపై కనీసం వీరు స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తమను అభిమానించే ప్రేక్షకులు  à°ªà±à°Ÿà±à°Ÿà±†à°¡à± కష్టాల్లో ఉంటే వీరి మనసు కరగలేదు.

నయనతార, త్రిష రియల్ లైఫ్ లో కూడా నటించేస్తున్నారా...

నయనతార, త్రిషను తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరించారు. వీరు ఇతర భాష్లలో నటించినప్పుడు తీసుకోని పారితోషికం తెలుగు సినిమాలు చేస్తున్నప్పుడు నిర్మాతల దగ్గర డిమాండ్ చేసి మరీ తీసుకున్నారు. అవకాశాలు వచ్చినప్పుడు వచ్చి నటించేయడం, డబ్బులు తీసుకుని వెళ్లిపోవడం తప్ప... వీరికి తెలుగు ప్రజలపై ఎలాంటి ప్రేమ లేదని ఫిక్స్ అవ్వాల్సిందే. ఎందుకంటే  à°‰à°¤à±à°¤à°°à°¾à°‚ధ్ర, వైజాగ్ లో జరిగిన ప్రకృతి వైఫల్యం ప్రతి ఒక్కరి మనసులను విపరీతంగా కలచివేసింది. కానీ నయనతార, త్రిష మనసులను మాత్రం à°ˆ బాధాకర ఘటన తాకలేకపోయింది. ఎందుకని? వీరు స్పందించలేదు. బాధ్యత లేదా? సినిమాలు విడుదలైననప్పుడు నాలుగు మాటలు మాట్లాడి, అభిమానులను తబ్బిబ్బు అయ్యేలా చేయడం వరకే వీరి బాధ్యతా? సినిమాల్లో నటించినట్టే, రియల్ లైఫ్ లో కూడా నటించేస్తున్నారని దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు.

ఇలియానా, హన్సిక, తాప్సీకి బాధ్యత లేదా...

ఇలియానాని స్టార్ హీరోయిన్ చేసింది తెలుగు పరిశ్రమే. కోట్లలో పారితోషికం పుచ్చుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన తర్వాతే అమ్మడిని బాలీవుడ్ అయినా, కోలీవుడ్ అయినా పట్టించుకుంది. ఆ విషయం ఇలియానా బొత్తిగా మరిచిపోయినట్టుంది. అసలు ఈ విపత్తు గురించి పట్టించుకోలేదు. కనీసం తనను ఎంతో అభిమానించిన ప్రజలకు ధైర్యం ఇవ్వడానికి కూడా ఇలియానా ఒక ముక్క మాట్లాడలేదు. హన్సిక, తాప్సీ కూడా ఇదే రూటుని ఫాలో అయ్యారు. దర్శక, నిర్మాతలు అవకాశాలు ఇస్తే... ఇక్కడికి వచ్చి నటించి, డబ్బులు తీసుకుని వెళ్లిపోతున్నారే తప్ప, తమను నెత్తిన పెట్టుకుంటున్న తెలుగు ప్రేక్షకులు ఇబ్బందుల్లో ఉంటే కనీసం కనిపించకుండా కామ్ గా సైడ్ అయిపోవడం వీరికే చెల్లింది.

ఇలాంటి హీరోయిన్లలేనా మనం నెత్తిన పెట్టుకుంటుంది అని ఆలోచిస్తే మాత్రం వీరిపై అభిమానంకన్నా, ఒక విధమైన అసహ్యమే ఏర్పడే అవకాశం ఉంది. బహిరంగ సభల్లో 'ఐ లవ్ హైదరాబాద్. తెలుగు ప్రజలంటే ప్రత్యేకమైన అభిమానం. తెలుగు ప్రేక్షకులు సో స్వీట్..' అంటూ వగలు పోతుంటారు ఈ ముద్దుగుమ్మలు. కానీ, అవన్నీ ఉత్తుత్తి మాటలని, అవసరమైనప్పుడు ఈ ముద్దుగుమ్మలు ఉత్తి చేతులే చూపిస్తారని ఈ సంఘటన నిరూపిస్తోంది. ఈ హీరోయిన్లు అందంగా ఉంటారే తప్ప... అందమైన మనసు లేదు. మరి రాబోయే రోజుల్లో అయినా.. ఈ హీరోయిన్లు స్పందిస్తారో లేదో చూద్దాం.

Where is Anushka, Nayanthara, Thamanna



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !