మెగాబ్రదర్ నాగబాబు తనయ, మెగా డాటర్ కొణిదెల నిహారిక ప్రస్తుతం నాగశౌర్య సరసన 'ఒక మనస్సు' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కంటే ముందే నిహారిక ఓ షార్ట్ ఫిలింలో నటించింది. ఇందులో అక్కినేని అఖిల్ కూడా నటించాడు. ఈ ఇద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారనే వార్తలు ఉన్నాయి. కాగా తాజా వార్తల ప్రకారం నిహారికకు అక్కినేని హీరో అఖిల్ అక్కినేనితో రొమాన్స్ చేసే అవకాశం దక్కిందని తెలుస్తోంది.
'అఖిల్' చిత్రం తర్వాత అఖిల్ అక్కినేని చేయబోయే తదుపరి చిత్రం విషయంలో ఇంతవరకూ అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ చిత్రానికి సంబంధించిన చర్చలు జోరుగా జరుగుతున్నాయని, త్వరలోనే ఓ ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారమ్. కాగా అఖిల్ రెండో చిత్రంలో కొణిదెల నిహారిక హీరోయిన్ గా నటించే అవకాశముందని తెలుస్తోంది. ఈ ఇద్దరూ ఓ షార్ట్ ఫిలిం కోసం స్ర్కీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా వెండితెరపై జంటగా కనువిందు చేయడానికి సమాయత్తమవుతున్నారని వినికిడి. ఈ ఇద్దరి జంట బాగుంటుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మరి ఈ ఇద్దరూ కలిసి నటిస్తే, వీరి రొమాన్స్ ఎలా ఉంటుందో, ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ రేంజ్ లో వర్కవుట్ అవుతుందో వేచి చూద్దాం.