'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నారు. 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' జీవితాన్ని ఆధారంగా తీసుకుని పరుచూరి బ్రదర్స్ ఓ స్ర్కిఫ్ట్ రెడీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చేయడానికి చిరు పచ్చజెండా ఊపేసారని తెలుస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మించనున్నాడు. కాగా తాజా వార్తల ప్రకారం ఈ చిత్రానికి హీరోయిన్ ని ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నాయట.
విశ్వసనీయమైన సమాచారం మేరకు చాలామంది అనుష్కను హీరోయిన్ గా తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారట. చిరంజీవి 'స్టాలిన్' చిత్రంలో అనుష్క ఐటమ్ పాట చేసింది. కానీ ఇప్పటివరకూ మెగా హీరోలతో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా అనుష్క జత కట్టలేదు. చిరంజీవి 150వ సినిమా కోసం అనుష్కను తీసుకోవడానికి ప్రయత్నాలు చేసారు. కానీ 'బాహుబలి ది కంక్లూజన్' చిత్రంతో బిజీగా ఉండటంల వల్ల అనుష్క ఈ సినిమా చేయలేకపోయింది. అయితే చిరు సరసన హీరోయిన్ గా నటించే అవకాశం వస్తే ఖఛ్చితంగా ఆ అవకాశాన్ని వదులుకోనని ఓ సందర్భంలో చెప్పింది అనుష్క. ఇప్పుడు చిరు 151వ సినిమా కోసం అనుష్కను హీరోయిన్ గా తీసుకోవాలంటే, అనుష్క వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం ఖాయం.. మరి ఫైనల్ గా అనుష్కనే ఈ అవకాశం వరిస్తుందా వేచి చూద్దాం.