మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళుతున్న విషయం తెలిసిందే. కొంత గ్యాప్ తీసుకుని చిరు తదుపరి సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నారనే వార్తలు ఉన్నాయి. ఈ సినిమాని కూడా రాంచరణ్ నిర్మించనున్నాడు. సమ్మర్ లో ఈ సినిమా ఆరంభమయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే....
రాంచరణ్ ఓ భారీ సినిమాని నిర్మించే ప్లాన్ లో ఉన్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో తండ్రితో కలిసి నటించాలని భావిస్తున్నాడట రాంచరణ్. ఈ ప్రాజెక్ట్ కోసం మంచి కథ తయారు చేయమని ఆల్ రెడీ కొంతమంది రచయితలకు రాంచరణ్ చెప్పేసాడట. ప్రస్తుతం వారు ఆ పని మీదే ఉన్నారని తెలుస్తోంది. మంచి స్టోరీ లైన్ వర్కవుట్ అయితే... చిరు, రాంచరణ్ కాంబినేషన్ సినిమాకి రంగం సిద్ధమవుతుందట. అదే కనుక జరిగితే మెగా ఫ్యాన్స్ ఆనందానికి హద్దే ఉండదని చెప్పొచ్చు.