మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందనున్న విషయం తెలిసిందే. ఇది తమిళ్ చిత్రం 'కత్తి' కి రీమేక్. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి 'కత్తిలాంటోడు' టైటిల్ ని అనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మించనున్నాడు. అయితే భారీ బడ్జెట్ కాబట్టి 'లైకా ప్రొడక్షన్స్' లో కలిసి చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సమాయత్తమవుతున్నాడు. ఇవన్ని తెలిసిన విషయాలు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త వినబడుతోంది. మెగాభిమానులకు ఓ పెద్ద సర్ ప్రైజ్ ఈ సినిమా ద్వారా మెగా హీరోలు ఇవ్వబోతున్నారనే టాక్ ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే...
చిరు 150వ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మెగా కుటుంబం. కాగా ఈ సినిమాలో చిరుతో కలిసి ఓ సీన్ లో మెగా హీరోలు రాంచరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కనిపించే అవకాశముందని సమాచారమ్. వి.వి.వినాయక్ వీరందరిని కలిపి తెరపై చూపించాలని భావిస్తున్నాడట. ఇందుకోసం ఓ సీన్ ని కూడా రాసుకున్నాడని తెలుస్తోంది. చిరు150 చిత్రం కాబట్టి చిరుతో కలిసి స్ర్కీన్ ఫేర్ చేసుకోవడానికి మిగతా హీరోలదంరూ కూడా ఆసక్తిగానే ఉంటారు. వీరితో పాటు పవన్ కళ్యాణ్ చేరితే ఇక ఈ సినిమాకి మరింత క్రేజ్ చేకూరడం ఖాయం. మరి అన్నయ్య సినిమాలో కనిపించడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో వేచి చూడాల్సిందే. ఒకవేళ పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినా, చిరుతో కలిసి రాంచరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ కనిపిస్తే మెగాభిమానులకు పండుగలానే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదే కనుక జరిగితే ఇంతకంటే బిగ్ సర్ ప్రైజ్ ఏముంటుంది చెప్పండి...!