దేవిశ్రీ ప్రసాద్, చార్మి ప్రేమలో ఉన్నారనే వార్తలు అడపా దడపా వస్తుంటాయ్. ఈ విషయం గురించి ఇద్దరి దగ్గరా ప్రస్తావిస్తే, మేం జస్ట్ ఫ్రెండ్స్ అని చెబుతుంటారు. కానీ, అంతకు మించి ఉందన్నది జనాల ఊహ. ఆ ఊహలు అలానే ఉన్న తరుణంలో తాజాగా దేవిశ్రీ ప్రసాద్ గురించి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఓ హీరోయిన్ తో అతను ప్రేమలో పడ్డాడన్నది ఆ వార్త సారాంశం. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆ విషయానికే వద్దాం...
బెంగళూరు బ్యూటీ ప్రణీత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కన్నడ చిత్రాల కన్నా తెలుగు చిత్రాలే ఎక్కువగా చేస్తున్న ఈ అమ్మడు తన మనసులో దేవిశ్రీ ప్రసాద్ కు స్థానం ఇచ్చేసిందట. దేవి కూడా మనసు పారేసుకున్నాడని సమాచారం. ఇద్దరూ కలిసి తెగ తిరగడంతో పాటు ఫోన్ లో గంటలు గంటలు కబుర్లు చెప్పుకుంటున్నారట. మెసేజ్ లకి కొదవే లేదని ఫిల్మీనగర్ సమాచారమ్. దాంతో చార్మీకి హ్యాండిచ్చేసి ప్రణీతతో దేవి లవ్లో పడ్డాడని చెప్పుకుంటున్నారు. మరి.. ఈ వార్త ఎంతవరకూ నిజమో తెలియాలంటే దేవి, ప్రణీత స్పందించాల్సిందే.