పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది. ఆ వార్త ఏంటంటే...
ఈ సినిమాలో రానా సరసన ఐశ్వర్యరాజేష్ కథానాయికగా నటిస్తోందనే వార్తలు ఉన్నాయి. అయితే తాజా వార్తల ప్రకారం ఈ సినిమా నుంచి ఐశ్వర్యరాజేష్ తప్పుకుందని వార్తలు ప్రచారమవుతున్నాయి. డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ఐశ్వర్యరాజేష్ ఈ సినిమా నుంచి తప్పుకుందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే కొన్నాళ్లు వేచిచూడాల్సిందే.