'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడనే విషయంలో క్లారటీ రాక ఆయన అభిమానులు తెగ టెన్షన్ పడిపోతున్నారు. పూటకో డైరెక్టర్ పేరు బయటికి రావడం, అబ్బే.. ఆ డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడనే వార్త నిజంకాదని ఆ వెంటనే వార్తలు హల్ చల్ చేయడంతో కథ మొదటికి వస్తోంది. మళ్లీ ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనే చర్చ జరుగుతోంది. తాజాగా ఈ రోజు ఓ వార్త బయటికి వచ్చింది. అదేంటంటే...
డైరెక్టర్ బాబి దర్శకత్వంలో ఎన్టీఆర్ తదుపరి సినిమా రూపొందనుందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. నిజం చెప్పాలంటే 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంతో ఓ భారీ ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు బాబి. 'జనతాగ్యారేజ్' తో తను అందుకున్న సక్సెస్ ని కొనసాగించే విధంగా తన తదుపరి సినిమా ఉండాలని ఎన్టీఆర్ ఆలోచిస్తున్నాడు. అలాంటప్పుడు బాబికి తన తదుపరి సినిమా చేసే అవకాశాన్ని ఇస్తాడా.. ఇది తప్పుడు వార్త అయ్యుంటుందని ఫిల్మ్ నగర్ టాక్. ఇందులో నిజంలేకపోలేదు. ఒకవేళ ఈ వార్త నిజం అయితే మాత్రం ఎన్టీఆర్ ని ఇంప్రెస్ చేసే కథతో బాబి అప్రోచ్ అయ్యుండాలి. మరి అసలు నిజమేంటో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగక తప్పదు. ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం బాబిని వరిస్తే మాత్రం... బంపర్ ఆఫర్ కొట్టిసినట్టే...!