యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న 'జనతా గ్యారేజ్' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. సమంత, నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో మంచి మాస్ మసాలా ఐటమ్ పాట ఉందట. ఈ ఐటమ్ సాంగ్ ని ప్రముఖ హీరోయిన్ తో చేయించాలని డిసైడ్ అయ్యారట.
తాజా వార్తల ప్రకారం మిల్క్ బ్యూటీ తమన్నాని ఐటమ్ సాంగ్ కోసం తీసుకుంటే బాగుంటుందని కొరటాల శివ, ఎన్టీఆర్, దేవిశ్రీ ప్రసాద్ భావిస్తున్నారట. 'ఊసరవెల్లి' చిత్రంలో ఎన్టీఆర్ సరసన జత కట్టింది తమన్నా. ఇప్పుడీ చిత్రంలో తమన్నాతో ఐటమ్ సాంగ్ చేయిస్తే, చాలా క్రేజీగా ఉంటుందని బావిస్తున్నారట. ఇంకా తమన్నాని సంప్రదించలేదట. త్వరలోనే తమన్నాని ఈ ఐటమ్ సాంగ్ చేయమని అడగాలనుకుంటున్నారట. ఈ క్రేజీ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసే అవకాశాన్ని తమ్మూ వదులుకోదని ఊహించవచ్చు. మరి ఫైనల్ గా ఈ సినిమాలోని ఐటమ్ పాటకు ఎన్టీఆర్ తో కలిసి చిందేసే అవకాశం తమన్నాకే దక్కుతుందేమో వేచి చూద్దాం.