'అందాల రాక్షసి' చిత్రం ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయిన లావణ్య త్రిపాఠి 'భలే భలే మగాడివోయ్'. 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రాలతో భారీ విజయాలను చవిచూసింది. అమ్మడికి టాలీవుడ్ లో మంచి ఆఫర్లే వస్తున్నాయి. ఓ వైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న లావణ్య ప్రేమ వ్యవరాలతో కూడా ఫుల్ బిజీగా ఉందని సమాచారమ్. ఓ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందట. అంతే కాదు... ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా...
లావణ్య త్రిపాఠి తొలి హీరో నవీన్ చంద్ర. ఈ ఇద్దరూ కలిసి 'అందాల రాక్షసి' చిత్రం ద్వారా హీరో, హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఆ సినిమా అప్పట్నుంచే ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోందట. ఈ విషయంలో ఇప్పటివరకూ సీక్రెన్సీ మెయింటెన్ చేస్తున్న నవీన్ చంద్ర, లావణ్య మరికొన్నాళ్లు కూడా ఈ విషయాన్ని బయటపడకుండా చూసుకోవాలనుకుంటున్నారట. అయినా సరే వీరి ప్రేమ వ్యవహారం బయటపడటం జనాలు చెవులు కోరుక్కోవడం జరిగిపోతోంది. మరి లావణ్య, నవీన్ ప్రేమ ఎంతవరకూ వెళుతుందో వేచి చూడాల్సిందే.