తెలుగు చలన చరిత్రలో మహానటుడు ఎన్టీఆర్ దో ప్రత్యేకమైన అధ్యాయం. ఆయన నటవారసుడిగా నందమూరి బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఇక, నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం గురించి నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ అరంగేట్రం ఎప్పుడు? అనే చర్చ దాదాపు మూడు, నాలుగేళ్లుగా జరుగుతోంది. 2017లో మోక్షజ్ఞ రంగప్రవేశం ఉంటుందని ఓ సందర్భంలో బాలకృష్ణ చెప్పారు. అప్పట్నుంచి నందమూరి అభిమానులు మోక్షజ్ఞ అరంగేట్రం గురించి చాలా కలలు కంటున్నారు. తాజా వార్తల ప్రకారం బాలయ్య తన తనయుడు మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం గురించి పక్కాగా ప్లాన్ చేస్తున్నారని సమాచారమ్.
రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, కొరటాల శివ... ఈ నలుగురు బాలయ్య పరిశీలనలో ఉన్నారట. అయితే ఈ నలుగురిలో ఎవరి దర్శకత్వంలో మోక్షజ్ఞ తొలి సినిమా చేస్తే బెటర్ అనే అధ్వయనంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరును సన్నిహితులు సూచించినట్టు తెలుస్తోంది. మిగిలిన ముగ్గురూ అయితే భారీ అంచనాలు, మాస్ ఆడియన్స్ లో అంచనాలు, ఫ్యాన్స్ అంచనాలు భారీగా ఉంటాయని, తొలి సినిమాకి ఈ రేంజ్ అంచనాలు పెంచడం మంచిది కాదని బాలయ్య భావిస్తున్నారట. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాలను వారి ఇమేజ్ కి తగ్గట్టు, నితిన్ లాంటి కుర్ర హీరోతో 'అఆ' చిత్రం చేసి విజయం సాధించిన త్రివిక్రమ్ తో మోక్షజ్ఞ తొలి సినిమా చేయించడం బెటర్ అని ఆలోచిస్తున్నారట బాలయ్య. ఓవర్ సీస్ లో కూడా త్రివిక్రమ్ కి మంచి క్రేజ్ ఉంది. ఇవన్ని దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ తో తన తనయుడు తొలి సినిమా గురించి బాలయ్య మాట్లాడాలనుకుంటున్నారని సమాచారమ్. బాలయ్య అడిగితే త్రివిక్రమ్ నో చెప్పే అవకాశంలేదు. సో.. అన్నీ కుదిరితే త్రివిక్రమ్ కే మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే అవకాశం దక్కుతుందని ని ఫిల్మ్ నగర్ టాక్.