పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంతో బిజీగా ఉంటే, రాంచరణ్ త్వరలో 'తని ఒరువన్' తమిళ్ చిత్రం తెలుగు రీమేక్ తో బిజీ అవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో బాబాయ్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ రాంచరణ్ గురించి ఓ వార్త ప్రచారం అవుతోంది. అదేంటంటే... పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కలిసి ఓ భారీ మల్టీస్టారర్ చేయబోతున్నారట. ఈ మల్టీస్టారర్ వివరాల్లోకి వెళితే...
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ మల్టీస్టారర్ చిత్రానికి కథ రెడీ చేసాడట. ఈ కథ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కి చాలా బాగుంటుందట. కథ ఆల్ రెడీ పవన్ కళ్యాణ్ కి చెప్పాడని, ఈ చిత్రంలో నటించడానికి పవన్ కళ్యాణ్ సుముఖంగా ఉన్నాడట. ఇక పవన్ కళ్యాణ్ అంగీకరిస్తే, రామ్ చరణ్ నో చెప్పే ప్రసక్తి లేదు కాబట్టి, పైగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించాలనే కోరిక రామ్ చరణ్ కి ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అయ్యే అవకాశముందని జనాలు మాట్లాడుకుంటున్నారు. అదే కనుక జరిగి ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అయితే మెగాభిమానులకు అంతకంటే కావాల్సిందేముంది. సంబరాలు జరుపుకోరు. చూద్దాం.. ఈ ప్రాజెక్ట్ ఎంతవరకూ సెట్ అవుతుందో?