నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు కొడుకు మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం గురించి కూడా రంగం సిద్ధం చేస్తున్నారట. 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం క్లయిమ్యాక్స్ లో 10 నిముషాల పాటు కనిపిస్తాడట మోక్షజ్ఞ. ఇదిలా ఉంటే...
మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయడానికి బాలయ్య కొన్ని కథలు వింటున్నారని సమాచారమ్. అందులో భాగంగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి తనయుడు యస్.యస్.కార్తీకేయ కూడా మోక్షజ్ఞ కోసం బాలయ్యకు ఓ కథ చెప్పాడట. కథ అదిరిపోయిందని, బాలయ్యకు బాగా నచ్చిందని సమాచారమ్. అన్నీ కుదిరితే హీరోగా మోక్షజ్ఞ అరంగేట్రం, డైరెక్టర్ గా రాజమౌళి తనయుడు కార్తీకేయ ఆరంగేట్రం ఈ సినిమా ద్వారా జరిగే అవకాశముందని ఫిలింనగర్ టాక్. ఓ ప్రముఖ నిర్మాత మోక్షజ్ఞ, కార్తీకేయ కాంబినేషన్ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వ పర్యవేక్షణ చేస్తారని సమాచారమ్. ఇది నిజంగా క్రేజీ కాంబినేషన్ అవుతుంది. మరి ఎంతవరకూ ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అవుతుందో వేచి చూద్దాం.