హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. మరో వైపు ప్రేమ వ్యవహారాలతో కూడా బిజీగా ఉందని తెలుస్తోంది. అమ్మడు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇంతకీ రకుల్ ఎవరితో ప్రేమలో పడిందో తెలుసా...
టాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో రానాతో అని జనాలు అంటున్నారు. అదేంటి త్రిష, రానా ప్రేమలో ఉన్నారని చెప్పుకుంటున్నారు కదా అనుకోవచ్చు. నిజమే. ఇప్పుడు వీళ్లిద్దరూ ప్రేమలో లేరట. రకుల్, రానా ప్రేమలో ఉన్నారట. గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ప్రేమ పాఠాలు చెప్పుకుంటున్నారట. ఈ ఇద్దరి వ్యవహారాన్ని చూసినవారు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని చెప్పుకుంటున్నారు. త్రిష, రానా ప్రేమ పెళ్లి వరకూ వెళ్లలేదు. మరి రకుల్, రానా ప్రేమ ఎంతవరకూ వెళుతుందో వేచి చూడాల్సిందే.