ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణితి చోప్రాని కథానాయికగా తీసుకున్నారనే వార్తలు వినిపించాయి, పరిణితి ఈ సినిమా చేయడానికి మూడున్నర కోట్లు డిమాండ్ చేసిందని, అంత పారితోషికం ఇవ్వడానికి అంగీకరించారని వార్తలు వచ్చాయి, అయితే పరిణితి చోప్రాని కన్ ఫార్మ్ చేయలేదట. ఆమెతో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి చర్చలు మాత్రమే జరిగాయట.
కాగా తాజా వార్తల ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ ని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటింపజేయాలనే ప్లాన్ లో డైరెక్టర్ మురుగదాస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్ రెడీ రకుల్ తో చర్చలు కూడా జరుగుతున్నాయట. నిజం చెప్పాలంటే 'బ్రహ్మోత్సవం' చిత్రంలోనే మహేష్ సరసన రకుల్ నటించాల్సి ఉంది. కానీ అప్పట్లో తనకున్న కమిట్స్ మెంట్స్ వల్ల డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ఆ సినిమా వదులుకుంది రకుల్. ఇప్పడు ఖచ్చితంగా మహేష్, మురుగదాస్ సినిమాని వదులుకోదని చెప్పొచ్చు. మరి ఫైనల్ గా ఈ భారీ సినిమా చేసే అవకాశం రకుల్ కే వస్తుందేమో వేచి చూద్దాం.