మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న 'తని ఒరువన్' తెలుగు రీమేక్ చిత్రం త్వరలో ఆరంభంకానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం శృతిహాసన్ ని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. శృతిహాసన్ కూడా నటించడానికి అంగీకరించిందట. అయితే కోటిన్నర పారితోషికం డిమాండ్ చేసిందట. దాంతో ఆమెకు జలక్ ఇచ్చాడు రాంచరణ్. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించనున్నారు. కాగా బడ్జెట్ విషయంలో జాగ్రత్త పాటించాలని డిసైడ్ అయిన అల్లు అరవింద్, రాంచరణ్ కోటిన్నర పారితోషికం ఇచ్చి శృతిహాసన్ ని తీసుకోవడం కరెక్ట్ కాదని ఫిక్స్ అయ్యారట. అందుకే శృతిహాసన్ కి హ్యాండిచ్చేసాడు రాంచరణ్.
తాజా వార్తల ప్రకారం ఈ చిత్రానికి హీరోయిన్ ని ఖరారు చేసారని తెలుస్తోంది. 'నేను శైలజ' చిత్రంలో రామ్ సరసన నటించిన కీర్తి సురేష్ ని ఈ సినిమా కోసం తీసుకున్నారట. ఆమె పారితోషికం 30లక్షలకు మించిలేదట. పైగా 'నేను శైలజ' చిత్రంతో కీర్తికి చాలా మంచి పేరు వచ్చింది. ఆమెకు మంచి భవిష్యత్తు ఉందని కూడా పరిశీలకులు అంటున్నారు. అందుకే కీర్తితో రొమాన్స్ చేయడానికి రాంచరణ్ పచ్చజెండా ఊపేసాడని సమాచారమ్. సో... కీర్తికి మంచి అవకాశం దక్కినట్టే కదా...!