మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ధృవ్' చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇది కాకుండా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు రాంచరణ్. ఈ సినిమాని 'జనతా గ్యారేజ్' నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. కాగా ఈ సినిమాకి సంబంధించి భారీ ప్లానింగ్ జరుగుతోంది.
రాంచరణ్ తో సుకుమార్ చేయబోయే చిత్రం 75కోట్ల బడ్జెట్ తో రూపొందనుందట. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందనుందని వినికిడి. రాంచరణ్ కెరీర్ లోనే ఇంత భారీగా రూపొందనున్న చిత్రం ఇదే కానుంది. కాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలను మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగస్ట్ 22న ఘనంగా జరపడానికి ప్లాన్ చేస్తున్నారు. తాజా వార్తల ప్రకారం ఈ చిత్రానికి 'ఫార్ములా x' టైటిల్ ని ఫిక్స్ చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. కథకు ఈ టైటిల్ అయితే యాఫ్ట్ గా ఉంటుందని భావిస్తున్నారట. నిజంగానే ఈ టైటిల్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందనుంది కాబట్టి ఫార్ములా x ప్రధానాంశంగా ఈ చిత్ర కథ ఉంటుందని ఊహింవచ్చు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నాడు.