జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రూటు మార్చాలనుకుంటున్నాడట. కేవలం మాస్ సినిమా మాత్రమే చేయాలనే ఆలోచన మార్చుకుని ఫ్యామిలీ, క్లాస్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేయాలని డిసైడ్ అయ్యాడట ఎన్టీఅర్.
ఇలాంటి సినిమా చేయాలంటే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితేనే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యి తన కోసం కథ రెడీ చేయమని త్రివిక్రమ్ కి సంకేతాలు పంపించాడట. త్రివిక్రమ్ కి కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయాలనే ఆలోచన ఉంది. కానీ ఇప్పటికిప్పుడంటే కుదరదు. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయినా సరే ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ వెనక్కి తగ్గలేదని సమాచారమ్.
ఎన్టీఆర్ తో వచ్చే యేడాది సినిమా చేయడానికి త్రివిక్రమ్ సమాయత్తమవుతున్నాడట. ఓ కథ కూడా రెడీ చేస్తున్నాడని తెలుస్తోంది. తన సొంత బ్యానర్ గా భావించే హారిక అండ్ హాసిని సంస్థపైనే ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుకుంటున్నాడట త్రివిక్రమ్. ఇటీవలే ఎన్టీఆర్, హారిక అండ్ హాసిని అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) మధ్య చర్చలు జరిగాయట. చర్చలు సఫలమవ్వడంతో ఎన్టీఆర్ కి ఈ నిర్మాత అడ్వాన్స్ కూడా కమిట్ అయిపోయారని సమాచారమ్. సో... వచ్చే యేడాది ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని ఫిక్స్ అయిపోవచ్చు. భలే కాంబినేషన్ సెట్ అయనట్టే కదా....!