పవన్ కల్యాణ్, మహేశ్ బాబు ఇలా టాప్ స్టార్స్ తో పాటు యువ హీరోల్లో స్టార్ హోదా ఉన్న అల్లు అర్జున్ లాంటి వాళ్లతో సినిమాలు చేస్తూ, అగ్ర దర్శకుడి జాబితాలో ఉన్నాడు త్రివిక్రమ్. అలాంటి త్రివిక్రమ్ యువ హీరోలతో సినిమా చేస్తే అది కచ్చితంగా వార్తే. అందుకే నితిన్ తో అతను 'అ... ఆ' చిత్రం చేస్తున్నాడనగానే చాలామంది వింతగా చెప్పుకున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ అదిరిపోయింది. కాకపోతే, టెక్నికల్ క్రూతో త్రివిక్రమ్ కు ఏర్పడ్డ మనస్పర్థలు కారణంగా ఈ షూటింగ్లో చిన్ని చిన్ని డిస్ర్టబెన్స్ లు ఎదురవుతున్నాయని టాక్.
ఈ చిన్న చిన్న ఆటంకాల వల్ల త్రివిక్రమ్ డిస్ర్టబ్ అయ్యాడట. దాంతో 'అ.. ఆ'పై ఇతగాడికి ఇంట్రస్ట్ తగ్గిందని సమాచారం. షూటింగ్ లొకేషన్లో అంత యాక్టివ్ గా ఉండటంలేదని వినికిడి. అందుకని, షూటింగ్ ని తన అసోసియేట్స్, అసిస్టెంట్ దర్శకుల మీద వదిలేశాడని భోగట్టా. అదే కనుక నిజమైతే... నితిన్ కు త్రివిక్రమ్ అన్యాయం చేస్తున్నట్లే అని పరిశీలకులు అంటున్నారు.