యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'బాహుబలి' పార్ట్ 2 'బాహుబలి ది కంక్లూజన్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట. యు.వి.క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కనుంది. సంగీత దర్శకుడు జిబ్రాన్ ఇప్పటికే ఈ సినిమాపై వర్క్ చేస్తున్నాడని సమాచారమ్. ఇదిలా ఉంటే...
'భాహుబలి 2' చిత్రం షూటింగ్ పూర్తయిన వెంటనే పెద్ద గ్యాప్ తీసుకోకుండా ఈ చిత్రం షూటింగ్ తో బిజీ అయిపోవాలనుకుంటున్నాడట ప్రభాస్. కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన నటీనటుల ఎంపిక, లొకేషన్స్ అన్నింటిపై వర్కవుట్ చేయడం ప్రారంభించమని సుజిత్ కి చెప్పేసాడట ప్రభాస్. దాంతో కొంతమంది నటీనటులను ఫైనలైజ్ చేసే పని మీద సుజిత్ ఉన్నాడని తెలుస్తోంది. బాలీవుడ్ నుంచి నీల్ నితిన్ ముఖేష్ ని ప్రభాస్ కోసం రంగంలోకి దింపాలనుకుంటున్నాడట సుజిత్. ఇతగాడు అయితే విలన్ గా పర్ ఫెక్ట్ గా సూట్ అవుతాడని భావిస్తున్నాడట. తమిళ్ చిత్రం 'కత్తి' లో నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా నటించాడు. ఇక హీరోయిన్ గా 'ఎవడు' ఫేం అమీ జాక్సన్ ని తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. మొత్తం మీద ప్రభాస్ కోసం కత్తిలాంటి విలన్.. విదేశీ భామను రంగంలోకి దింపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పొచ్చు.