రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై నిర్మిస్తాడనే వార్తలు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ కోసం వక్కంతం వంశీ మంచి కథ తయారు చేసాడని, ఈ కథ ఎన్టీఆర్ ని చాలా ఇంప్రెస్ చేసిందని కూడా టాక్ ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎన్టీఆర్ వెనకడుగు వేసాడట. ఇది వక్కంతం వంశీని చాలా అప్ సెట్ చేసిందని తెలుస్తోంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా తర్వాత వక్కంతం వంశీ, ఎన్టీఆర్ కాంబినేషన్ చిత్రం సెట్స్ పైకి వెళుతుందని అందరూ భావించారు. వక్కంతం వంశీ కూడా అలానే అనుకున్నాడట. అయితే పూరి జగన్నాధ్ చిత్రానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తన ప్రాజెక్ట్ విషయంలో ఎన్టీఆర్ వెనుకడుగు వేస్తున్నాడని ఫిక్స్ అయ్యాడట వక్కంతం వంశీ. దాదాపు మూడేళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్ పై ఆశలు పెట్టుకోవడంతో వక్కంతం వంశీ చాలా అప్ సెట్ అయ్యాడని ఫిల్మ్ నగర్ టాక్. మరి వక్కంతం వంశీకి ఎన్టీఆర్ అవకాశమిస్తాడో.. లేక టోటల్ గా హ్యాండిసినట్టో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.