యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'స్టూడెంట్ నెం.1', 'సింహాద్రి', 'యమదొంగ' వంటి హిట్ చిత్రాలు రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందాయి. 'భాహుబలి 2' తర్వాత భారీ బడ్జెట్ తో ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకునే చిత్రాన్ని చేయడానికి రాజమౌళి, ఎన్టీఆర్ సమాయత్తమవుతున్నారనే వార్తలు ఉన్నాయి.
విశ్వసనీయమైన సమాచారం మేరకు ఎన్టీఆర్ తో 'యమదొంగ' చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. ఈ సీక్వెల్ కోసం రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ తన టీమ్ తో కలిసి కథ కూడా రెడీ చేస్తున్నారట. కాగా ఈ సినిమాని నిర్మించడానికి ప్రిన్స్ మహేష్ బాబు బావ, ఎం.పి గల్లా జయదేవ్ ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారమ్. ఈ సినిమాని నిర్మించే అవకాశం గల్లా జయదేవ్ కి ఇవ్వడానికి రాజమౌళి కూడా సిద్ధంగా ఉన్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఈ చిత్రానికి సంబంధించి గల్లా జయదేవ్, రాజమౌళి మధ్య చర్చలు జరుగుతున్నాయట. సో.. మహేష్ బావ ఈ సినిమాని నిర్మిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మరి ఇదే జరుగుతుందేమో వేచి చూద్దాం.