View

ఇంటర్య్వూ - హీరో నితిన్ (లై)

Monday,August07th,2017, 11:18 AM

'అఆ' వంటి సూపర్‌హిట్‌ మూవీ తర్వాత యూత్‌స్టార్‌ నితిన్‌ నటిస్తోన్న చిత్రం 'లై'. 'అందాల రాక్షసి', కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో మేఘా ఆకాష్‌ హీరోయిన్‌గా వెంకట్‌ బోయిన్‌పల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పతాకంపై టేస్ట్‌ఫుల్‌ ప్రొడ్యూసర్స్‌ రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'లై'. ఈ చిత్రం పోస్టర్స్‌కి, ట్రైలర్స్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఫస్ట్‌టైమ్‌ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. స్వర బ్రహ్మ మణిశర్మ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియోకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. హాలీవుడ్‌ చిత్రాలకి ధీటుగా హను రాఘవపూడి 'లై' చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం ఆగస్ట్‌ 11న వరల్డ్‌వైడ్‌గా అత్యధిక స్క్రీన్‌లలో భారీగా రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా యూత్‌స్టార్‌ నితిన్‌ విలేకరులతో పత్రికలవారితో ముచ్చటించారు. ఆ విశేషాలు...


'అఆ' తర్వాత ఇంత గ్యాప్‌ తీసుకోవడానికి రీజన్‌?
- జూన్‌ 2న ఆ సినిమా రిలీజ్‌ అయ్యింది. అంత మంచి హిట్‌ తర్వాత ఏ సినిమా చెయ్యాలి? ఎలాంటి కథను ఎంచుకోవాలి అని కొంచెం డైలమాలో పడ్డాను. ఆ టైమ్‌లో త్రివిక్రమ్‌గారికి కాల్‌ చేశాను. నెక్స్‌ట్‌ రెగ్యులర్‌ మూవీ కాకుండా కొంచెం డిఫరెంట్‌ సినిమా చెయ్యమని సలహా ఇచ్చారు. చాలా కథలు విన్నాను. ఏదీ నచ్చలేదు. హను రాఘవపూడి అరగంట పాటు ఈ కథ చెప్పాడు. ఫస్ట్‌ సిట్టింగ్‌లోనే ఈ కథ ఓకే చేశాను.


'లై' సినిమా ఎలా వుంటుంది?
- రెగ్యులర్‌ మూవీలా కాకుండా లవ్‌, ఎమోషన్‌, స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా 'లై' సినిమా వుంటుంది. హీరో, హీరోయిన్‌ మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ చాలా కొత్తగా వుంటుంది. వారి మధ్య వచ్చే చిన్న చిన్న అబద్ధాలు ఇంట్రెస్టింగ్‌గా వుంటాయి.


మెయిన్‌ 'లై' కాన్సెప్ట్‌ ఏమిటి?
- ఒక ఆవారాగా తిరిగే కుర్రాడు యు.ఎస్‌. వెళ్ళి బాగా డబ్బున్న అందమైన అమ్మాయిని పెళ్లాడి డాలర్స్‌ సంపాదించుకోవాలని అనుకుంటాడు. అలా యు.ఎస్‌. వెళ్లి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనేది మెయిన్‌ కాన్సెప్ట్‌. సినిమా స్టార్టింగ్‌ నుండి ఇంట్రెస్టింగ్‌గా, చాలా థ్రిల్లింగ్‌గా వుంటుంది.


అర్జున్‌గారితో వర్క్‌ చేయడం ఎలా అన్పించింది?
- 'శ్రీ ఆంజనేయం' తర్వాత అర్జున్‌గారితో వర్క్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది. ఫస్ట్‌టైమ్‌ ఆయన విలన్‌గా యాక్ట్‌ చేశారు. వెరీ స్టైలిష్‌గా ఆయన క్యారెక్టర్‌ వుంటుంది. ఆయన లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చి వుండేది కాదు. మా ఇద్దరి మధ్య జరిగే గేమ్‌ చాలా థ్రిల్లింగ్‌గా వుంటుంది. ఎత్తుకి పై ఎత్తులు వేసుకుంటూ ఇద్దరి క్యారెక్టర్స్‌ పోటా పోటీగా వుంటాయి. 'శ్రీ ఆంజనేయం' టైమ్‌లో అర్జున్‌గారు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే వున్నారు. ఆయన్ని చూసి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను.


14 రీల్స్‌ మేకింగ్‌ వేల్యూస్‌ ఎలా ఉన్నాయి?
- నా మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొని కథకు ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టి ఈ సినిమాని హాలీవుడ్‌ స్థాయిలో నిర్మించారు. ఫస్ట్‌ మా నిర్మాతలు రామ్‌, గోపీ, అనీల్‌గారికి థాంక్స్‌. ఈ సినిమా ఎక్కువ శాతం యు.ఎస్‌లో షూటింగ్‌ జరిగింది. ఎవరూ చేయనటువంటి కాస్ట్‌లీ లొకేషన్స్‌లో షూటింగ్‌ జరిపారు.


యాక్షన్‌ పార్ట్‌ ఎంతవరకు వుంటుంది?
- యాక్షన్‌ సీన్స్‌ కోసం బ్యాంకాక్‌ వెళ్లి కొంత ట్రైనింగ్‌ తీసుకున్నాను. కిచ్చ మాస్టర్‌ ఫెంటాస్టిక్‌ యాక్షన్‌ సీన్స్‌ కంపోజ్‌ చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్‌ చాలా హైలైట్‌గా వుంటుంది. ఈ ఫైట్‌లో అర్జున్‌గారు డూప్‌ లేకుండా రియలిస్టిక్‌గా చేశారు.


ఈ సినిమా మీ కెరీర్‌కి ఎంతవరకు ప్లస్‌ అవుతుంది?
- డెఫినెట్‌గా 'లై' సినిమా ఒక కొత్త ఇమేజ్‌ని తెస్తుంది. అలాగే నా కెరీర్‌లో ఒక మెమొరబుల్‌ మూవీగా నిలుస్తుందని నమ్ముతున్నాను.


హిట్‌, ఫ్లాపులను మీరు ఏవిధంగా స్వీకరిస్తారు?
- 'జయం', 'దిల్‌', 'సై' వరుసగా నేను హిట్స్‌ ఇచ్చాను. ఫస్ట్‌ ఆడియన్స్‌ హీరోగా నన్ను యాక్సెప్ట్‌ చేశారు. ఆ తర్వాత హిట్‌, ఫ్లాప్‌లు వచ్చాయి. ఎప్పుడూ మంచి సినిమా చెయ్యాలని తాపత్రయపడుతుంటాను. ఫస్ట్‌ నుండి యాక్టింగ్‌, డ్యాన్స్‌, ఫైట్స్‌ బాగా కసితో చెయ్యాలని ఇంట్రెస్ట్‌ ఎక్కువ వుంటుంది. సంవత్సరానికి చేసే ఒక్క సినిమా అయినా ఆడియన్స్‌కి నచ్చేలా వుండాలని పక్కా ప్లానింగ్‌తో చేస్తాను. హిట్‌, ఫ్లాపులు అనేవి ఎవరికైనా వస్తాయి. ఏ సినిమాకి అయినా కష్టపడి ఇష్టంతో పని చేస్తాం. హిట్‌, ఫ్లాపులు అనేవి ఆడియన్స్‌ చేతిలో వుంటుంది.


మీరు కథ విన్నప్పుడు స్క్రీన్‌పై చూసుకున్నప్పుడు ఎలా అన్పించింది?
- హను నాకు కథ చెప్పినప్పుడు ఎలాగైతే ఫీలయ్యానో, సినిమా చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్‌ కల్గింది. చెప్పిన దాని కన్నా హండ్రెడ్‌ పర్సెంట్‌ స్ట్రాంగ్‌గా ఈ సినిమా తీశాడు. ఒక ఎమోషన్‌తో, మంచి స్టైలిష్‌ సినిమా చూశాం అనే ఫీలింగ్‌తో ఆడియన్స్‌ బయటికి వస్తారు.


మణిశర్మ మ్యూజిక్‌ సినిమాకి ఎంతవరకు ప్లస్‌ అయ్యింది?
- చాలామందిని అనుకుని ఫైనల్‌గా మణిశర్మగారిని ఓకే చేశాం. ఆయన ఒక లెజెండరీ పర్సన్‌. ఈ సినిమాకి ప్రాణం పెట్టి మ్యూజిక్‌ చేశారు. ముఖ్యంగా ఇలాంటి సినిమాకి రీ-రికార్డింగ్‌ చాలా ఇంపార్టెంట్‌. మణిశర్మగారు రీరికార్డింగ్‌ చేయటంలో దిట్ట. ఈ సినిమాకి ఆయన రీరికార్డింగ్‌ ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు. 'లగ్గం టైమ్‌', 'సన్‌షైన్‌', 'బొమ్మాట' సాంగ్స్‌ ఆల్‌రెడీ సూపర్‌హిట్‌ అయ్యాయి. హాలీవుడ్‌ రేంజ్‌లో మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. 'లై'తో మళ్లీ మణిశర్మగారు మంచి ఫామ్‌లోకి వచ్చారు.


ఈ సినిమాలో మీ ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఎంతవరకు వుంది?
- హను, నేను వన్‌ ఇయర్‌ నుండి ట్రావెల్‌ అవుతున్నాం. ఫస్ట్‌ సార్‌.. సార్‌ అని పిలుచుకునేవాళ్లం. షూటింగ్‌ మధ్యలో పేర్లు పెట్టి పిలుచుకున్నాం. ఇప్పుడు ఏరా.. పోరా అనుకుంటున్నాం. అంతలా మా ఇద్దరి మధ్య బాండింగ్‌ కుదిరింది. ఎలాంటి సినిమా అయినా చేయగల సత్తా హనుకి వుంది అని స్ట్రాంగ్‌ ఫీలింగ్‌. ఈ సినిమాతో మేమిద్దరం చాలా క్లోజ్‌ అయ్యాం.


కామెడీ పార్ట్‌ ఎంతవరకు వుంటుంది?
- సెపరేట్‌ కామెడీ ట్రాక్‌ అని ఏమీ వుండదు. కథలో భాగంగా కామెడీ వుంటుంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్‌ మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ హ్యూమరస్‌గా వుంటుంది. అలాగే మధు చేసిన కామెడీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. ఆల్‌ కమర్షియల్‌ ఇంగ్రీడియంట్స్‌ ఈ చిత్రంలో వున్నాయి.


హీరోయిన్‌ మేఘా ఆకాష్‌ క్యారెక్టర్‌ ఎలా వుంటుంది?
- చైత్ర క్యారెక్టర్‌లో మేఘా ఆకాష్‌ నటించింది. బాగా రిచ్‌ అమ్మాయి. ఈ సినిమాకి బాగా యాప్ట్‌ అయ్యింది. మంచి టాలెంట్‌ వుంది. డెఫినెట్‌గా ఫ్యూచర్‌లో బిగ్‌ హీరోయిన్‌ అవుతుంది.


ఈ సినిమాలో పవన్‌కళ్యాణ్‌ని ఇమిటేట్‌ చేశారని తెల్సింది?
- 'తమ్ముడు' సినిమాలోని లుంగి కట్టుకుని, బీడి కాల్చే డ్యాన్స్‌ సీన్‌ని ఈ చిత్రంలో ఉపయోగించాం. చాలామంది పవన్‌కళ్యాణ్‌గారిని నీ సినిమాలకి బాగా వాడుకుంటున్నావ్‌ అని అందరూ అడిగారు. కానీ నేను ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనకి పెద్ద వీరాభిమానిని. నా లైఫ్‌లాంగ్‌ చేసే సినిమాల్లో ఆయన చిత్రంలోని సీన్‌ ఏదో ఒకటి ఉపయోగిస్తాను. ఎందుకంటే ఆయనంటే నాకు అంత ఇష్టం.


క్యారెక్టర్‌ పరంగా ఎలాంటి కేర్‌ తీసుకున్నారు?
- దాదాపు అయిదారు నెలలు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేశాం. నా క్యారెక్టర్‌ పరంగా కానీ, లుక్స్‌పరంగా కానీ చాలా కేర్‌ తీసుకున్నాం. ఈ సినిమాకి అలెగ్జాండర్‌ విజయ్‌ హెయిర్‌ స్టైలిస్ట్‌గా వర్క్‌ చేశారు. చాలామంది హీరోలకి తను చేస్తుంటాడు. ఈ సినిమాలో చాలా రకాల గెటప్‌లలో కన్పిస్తాను. కాస్ట్యూమ్స్‌ పరంగా, హెయిర్‌ స్టైల్‌ పరంగా ఒక కొత్త నితిన్‌ని ఈ సినిమాలో చూస్తారు. స్టైలిష్‌ అనేది సినిమాని బట్టి, క్యారెక్టర్‌ని బట్టి వుంటుంది. ఈ సినిమా చాలా కొత్తగా వుంటుంది.


మీ నెక్స్‌ట్‌ మూవీస్‌?
- ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌-త్రివిక్రమ్‌గార్లు నిర్మించే సినిమా చేస్తున్నాను. కృష్ణచైతన్య దర్శకుడు. మేఘా ఆకాష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కొన్ని కథలు వింటున్నాను. ఇంకా ఏదీ ఫైనలైజ్‌ కాలేదు. చర్చల దశలోనే వున్నాయి.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు యూత్‌స్టార్‌ నితిన్‌.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Aadi Starrer Nuvve Theatrical Trailer

Read More !