View

చిట్ చాట్ - నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ (సమ్మోహనం)

Tuesday,June05th,2018, 03:04 PM

శ్రీదేవి మూవీస్ పతాకంపై సుధీర్ బాబు, అదితిరావు హీరోహీరోయిన్లుగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం 'సమ్మోహనం'. జూన్ 15 న ఈ సినిమా థియేటర్ కి వస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం...
- 2016 లో డైరెక్టర్ ఇంద్రగంటి మెహన్ కృష్ణ దర్శకత్వంలో నాని హీరోగా 'జెంటిల్ మన్' సినిమా చేసాను. ఈ సినిమా చక్కటి విజయాన్ని సాధించింది. సరిగ్గా రెండేళ్ల తర్వాత మళ్లీ ఇంద్రగంటి దర్శకత్వంలో 'సమ్మోహనం' చిత్రాన్ని నిర్మించడం జరిగింది.


- 'సమ్మోహనం' స్టోరీ లైన్ గురించి గత యేడాదే నాకు చెప్పారు ఇంద్రగంటి. స్టోరీ లైన్ బాగా నచ్చడంతో డైలాగ్ వెర్షన్ ని రాయమన్నాను. ఫుల్ స్ర్కిఫ్ట్ విత్ డైలాగ్స్ తో రెడీ చేసారు ఇంద్రగంటి. అలా 'సమ్మోహనం' సినిమా సెట్స్ పైకి వెళ్లింది.


- సుధీర్ బాబుగారిని కలిసి కథ చెప్పాము. ఆయనకు కథ బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


- మణిరత్నం గారి 'చెలియా' సినిమా చూసి అదితిరావు హైదరిని హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాం. అదితిరావును కలిసి కథ వినిపించాము. టాలీవుడ్ లో చక్కటి డెబ్యూ అవుతుందని చెప్పి ఈ సినిమా చేయడానికి అంగీకరించింది అదితిరావు.


- ఈ సినిమాలో తండ్రి పాత్రను సీనియర్ నరేశ్ చేసారు. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా మంచి పాత్రలు చేస్తున్నారు. నా సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ సినిమాలోని నా పాత్ర ఎప్పటికీ గుర్తుండే పాత్ర అవుతుందని స్వయంగా నరేశ్ చెప్పడం చాలా సంతోషమనిపించింది.


- సినిమా మేకింగ్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వలేదు. సినిమాని రిచ్ గా ఆవిష్కరించడానికి స్కోప్ ఉంది, కాబట్టి అనుకున్నదానికంటే బడ్జెట్ పెరుగుతుందని ఇంద్రగంటి చెప్పారు. అందుకు నేను సిద్ధపడిపోయాను.


- ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. కుటుంబమంతా కలిసి చూసే సినిమా. అందుకే టైటిల్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉండాలని ఆలోచించి 'సమ్మోహనం' టైటిల్ యాఫ్ట్ అనుకున్నారు ఇంద్రగంటి. అందరికీ ఈ టైటిల్ నచ్చడంతో ఈ టైటిల్ నే కన్ ఫార్మ్ చేసాం.


- ఈ సినిమాకి చక్కటి ట్యూన్స్ కుదిరాయి. విజువల్ గా కూడా సాంగ్స్ చాలా బాగుంటాయి.


- పెయింటింగ్ వేసే ఓ మధ్య తరగతి కుర్రాడికి స్టార్ హీరోయిన్ తో పరిచయం ఏర్పడుతుంది. వారిద్దరి పరిచయం ప్రేమగా మారడం... ఆ తర్వాత వారి ప్రయాణం ఎలా సాగిందనే స్టోరీ లైన్ తోనే ఈ సినిమా తెరకెక్కింది. ఇలాంటి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన శివరంజని, సీతామహలక్ష్మి, రంగీలా సినిమాలు ఎంతటి ఘనవిజయాన్ని అందుకున్నాయో తెలిసిన విషయమే. మా సినిమా 'సమ్మోహనం' కూడా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది.


- బాలకృష్ణగారితో సినిమా చేయాలని ఉంది. మంచి కథ కుదిరితే తప్పకుండా ఆయనతో సినిమా చేస్తాను.


- ప్రస్తుతం 'సమ్మోహనం' చిత్రాన్ని ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉన్నాను. రెండు స్టోరీ లైన్స్ సిద్ధంగా ఉన్నాయి. తదుపరి సినిమాకి సంబంధించి త్వరలోనే ప్రకటిస్తాను.


- మా బ్యానర్ లో రూపొందే ప్రతి సినిమా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండాలని, మా బ్యానర్ ప్రతిష్ఠను పెంచే విధంగా ఉండాలని భావిస్తాను. ఇక ముందు కూడా మా బ్యానర్ నుంచి మంచి సినిమాలు వస్తాయి.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !