View

ఇంటర్య్వూ - హీరో ఈశ్వర్ (4 లెటర్స్)

Friday,February15th,2019, 08:49 AM

బాగా చ‌ద‌వ‌డం, మంచి మార్క‌లు తెచ్చుకోవ‌డం, ఉద్యోగం సంపాదించ‌డం, ల‌క్ష‌ల్లో జీతాలు తీసుకోవ‌డం ఇదేనా లైఫంటే...? ఇంత‌కు మించి ఏమీ లేదా? అని ఆలోచిస్తోన్న క్ర‌మంలో నాకు ఎంతో ఇష్ట‌మైన సినిమా రంగం ప‌ట్ల ఆకర్షితుడ‌య్యాను. దీన్నే నా వృత్తిగా తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకోని హీరోగా '4లెట‌ర్స్' సినిమా చేసానంటున్నారు ఈశ్వ‌ర్‌. ఓం శ్రీ చ‌క్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ప్రొడ‌క్ష‌న్ నెం.1 గా ఉద‌య్ కుమార్ దొమ్మ‌రాజు, ఆర్‌. ర‌ఘురాజ్ ద‌ర్శ‌క‌త్వంలో '4 లెట‌ర్స్' చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈ నెల 22న విడుద‌ల‌కు సిద్ద‌మైంది. ఈ సంద‌ర్భంగా యంగ్ హీరో ఈశ్వ‌ర్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు...


న‌ట‌న‌లో శిక్ష‌ణ ఏమైనా తీసుకున్నారా?
గ‌తేడాది వైజాగ్ స‌త్యానంద్ గారి వ‌ద్ద మూడు నెల‌ల పాటు యాక్టింగ్ లో శిక్ష‌ణ తీసుకున్నాను. వారి ద‌గ్గ‌రే సినిమా గురించి, యాక్ట‌ర్ కావాల్సిన డిసిప్లేన్‌, డెడికేషన్ తో పాటు యాక్ట‌ర్ చేయాల్సిన హార్డ్ వ‌ర్క్ గురించి తెలుసుకున్నాను. అలాగే యుఎస్ లో ఉన్న‌ప్పుడు స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా చేశాను. ఆ అనుభ‌వం ఈ సినిమాకు చాలా హెల్ప‌యింది. అలాగే `ఆ ఇద్ద‌రూ` అనే ఒక షార్ట్ ఫిలింలో న‌టించాను. దానికి మంచి కాంప్లిమెంట్స్ వ‌చ్చాయి.


మీ ఫ్యామిలీకి ఇష్ట‌మేనా సినిమా ఫీల్డ్ లోకి రావ‌డం?
నా గ్రాడ్యుయేష‌న్ కంప్లీట్ అయ్యాక... ఇండియా కెళ్లి నా సినిమా ట్రైల్స్ నేను చేసుకుంటాను అని మా ఫ్యామిలీతో చెప్పాను. మా ఫ్యామిలీ కి కూడా సినిమాలంటే చాలా ఇంట్ర‌స్ట్ ఉండ‌టంతో ఓకే అన్నారు. స‌రే ఎవ‌రో ఎందుకు మ‌న‌మే ఒక బేన‌ర్ పెట్టి సినిమా చేద్దాం అని ఈ సినిమా చేశారు.


ద‌ర్శ‌కుడు గురించి చెప్పండి?
ర‌ఘురాజ్ గారు ఫుల్ స్క్రిప్ట్, లొకేష‌న్స్, షెడ్యూల్స్ తో స‌హా వ‌చ్చి క‌లిసారు. ఫ‌స్ట్ సిటింగ్ లో వారి క్లారిటీ అంద‌రికీ న‌చ్చ‌డంతో ఓకే చేశాం. అందులో తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ప‌ది సినిమాల‌కు పైగా చేశారు. అంత ఎక్స్ పీరియ‌న్స్ ఉన్న ద‌ర్శ‌కుడుతో సినిమా చేస్తే బావుంటుంద‌నిపించింది. అన్న‌ట్టుగానే వారి ద‌గ్గ‌ర నుంచి చాలా నేర్చుకున్నా. ఒక యాక్ట‌ర్ కి కావాల్సిన క్వాల‌టీస్ అన్నీ వారే నేర్పించారు. నేను ఈ సినిమాకు డ‌బ్బింగ్ చెప్పానన్నా, మంచి ప‌ర్ఫార్మెన్స్ ఇవ్వ‌గ‌లిగానన్నా ర‌ఘురాజే గారే కార‌ణం. రెండు నెల‌లు వ‌ర్క్ షాప్ పెట్టి మా అంద‌రికీ శిక్ష‌ణ ఇప్పించారు. ఇందులో డైలాగ్స్ చాలా కొత్త‌గా రాసారు. నా ఫ‌స్ట్ సినిమానే బెస్ట్ డైర‌క్ట‌ర్ తో చేశానన్న సంతృప్తి ఉంది.


సినిమా క‌థేంటి?
కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జ‌రిగే క‌థ ఇది. ఇంజ‌నీరింగ్ స్టూడెంట్స్ లైఫ్ ఎలా ఉంది. ఏంటి? అన్న క‌థాంశానికి ల‌వ్‌, ఎంట‌ర్ టైన్ మెంట్ మిక్స్ చేసి `4లెట‌ర్స్` సినిమాను తెర‌కెక్కించారు మా డైర‌క్ట‌ర్. స్టూడెంట్స్ త‌ల‌చుకుంటే ఏమైనా చేయ‌గ‌ల‌రు అనే సందేశాన్ని ఫైన‌ల్ గా ఇచ్చాము. స్టూడెంట్స్ తో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే విధంగా సినిమా ఉంటుంది. క్లైమాక్స్ లో వ‌చ్చే స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి.


ట్రైల‌ర్ చూస్తుంటే అడ‌ల్ట్ కంటెంట్ ఎక్కువ‌గా ఉంద‌నిపిస్తోంది??
డైలాగ్స్ తో నే కామెడీ జ‌న‌రేట్ చేసాము త‌ప్ప , విజువ‌ల్ గా అయితే వ‌ల్గారిటీ ఉండ‌దు. ప్ర‌జంట్ యూత్ ఎలా బిహేవ్ చే్స్తున్నారో..వారు ఎలా మాట్లాడుకుంటున్నారో అలా నాచ‌రుల్ గా త‌ప్ప వాంటెడ్ గా డ‌బుల్ మీనింగ్ డైలాగులు పెట్ట‌లేదు.


మీ సొంత బేన‌ర్ లో సినిమా చేయ‌డం ఎలా అనిపించింది?
చాలా కంఫ‌ర్ట్ గా అనిపించింది. ఇంట్లోనే నాన్న‌, బాబాయి అన్న‌ట్టు ఉండేవాళ్లం. సెట్స్ మీద‌కు వెళితే...ఎవ‌రి చాలా ఫ్రొఫెష‌న‌ల్ గా ఉండేవాళం. మా ఫాద‌రే ప్రొడ్యూస‌ర్ కావ‌డంతో ఫ‌స్ట్ నుంచి ప్రొడ‌క్ష‌న్ గురించి తెలుసుకునే అవ‌కాశం క‌లిగింది. ప్ర‌తిది ప్లానింగ్ ప్రకారం వెళ్లడంతో ఎక్క‌డ మ‌నీ వేస్ట్ కాకుండా అనుకున్న టైమ్ కు సినిమా తీయ‌గ‌లిగాం.


టెక్నీషియ‌న్స్ గురించి చెప్పండి?
బెంగాల్ టైగ‌ర్, పేప‌ర్ బాయ్, గ‌రుడవేగ (డియో డియో) చిత్రాల‌కు ప‌ని చేసిన భీమ్స్ గారు మా సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రెండు మాస్, రెండు వెస్ట్ర‌న్ సాంగ్ ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. అలాగే ఆర్ ఆర్ కూడా అద్భుతంగా ఇచ్చారు. అలా సినిమాటోగ్ర‌ఫీ, గ‌ణేష్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ సినిమాకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌.


ఇందులో ఒక పాట కూడా పాడిన‌ట్టున్నారు?
అవునండీ నాకు ఫ‌స్ట్ నుంచి మ్యూజిక్ అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే సినిమా ఫీల్డ్ లోకి వ‌చ్చాను. త‌బ‌ల‌, ఫ్లూట్ ప్లే చేస్తాను. భీమ్స్ గారు పాట‌ల ర‌చ‌యిత సురేష్ ఉపాధ్యాయ ద‌గ్గ‌రుండి నాతో పాడించారు. పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. నా క్యార‌క్ట‌ర్ కు నేనే డ‌బ్బింగ్ కూడా చెప్పాను.


వెంక‌టేష్ ట్రైల‌ర్ చూసి ఏమ‌న్నారు?
అవునండీ..వెంక‌టేష్ గారికి ట్రైల‌ర్ చూపించాం. మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చాలా అడ్వైజెస్ కూడా ఇచ్చారు. మాట్లాడిన కొద్దిసేపైనా ఒక యాక్టింగ్ క్లాస్ లా అనిపించింది.


నెక్ట్స్ సినిమా మీ బేన‌ర్ లోనే ఉంటుందా?
నేను వైజాగ్ లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్న‌ప్పుడు మా ఫాద‌ర్ వ‌చ్చారు. అక్క‌డ ఎంతో కొత్త‌వారు యాక్టింగ్ లో శిక్ష‌ణ తీసుకుంటున్నారు. ఎంతో మంది ప్ర‌తిభావంతులు ఉన్నారు. ఇలాంటి వారికి మ‌న వంతుగా అవ‌కాశం క‌ల్పించాలన్న ఉద్దేశంతో బేన‌ర్ స్టార్ట్ చేశారు. క‌చ్చితంగా నాతో పాటు కొత్త‌వాళ్ల‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తూ బ‌య‌ట వాళ్ల‌తో మా బేన‌ర్ లో సినిమాలు చేస్తాం. అలాగే స్టోరీస్ వింటున్నా. ఈ సినిమా విడుద‌ల‌య్యాక నా త‌దుప‌రి సినిమా ప్ర‌క‌టిస్తా. ఇక మీద‌ట హైద‌రాబాద్‌లోను ఉంటూ సినిమాకే అంకిత‌మ‌వ్వాల‌నుకుంటున్నా.


సినిమా రిలీజ్ ఎప్పుడు?
ఈ నెల 22న రిలీజ్ చేస్తున్నాం. ఎక్క‌డా బోర్ లేకుండా సినిమా ఉంటుంది. మంచి సాంగ్స్ , సినిమ‌టోగ్ర‌ఫీ, కొరియోగ్ర‌ఫీ అన్నీ బాగా కుదిరాయి.


సినిమా రిలీజ్ అవుతోంది క‌దా టెన్ష‌న్ ఏమైనా ఉందా?
కొంచెం టెన్ష‌న్ అయితే ఉంది. కానీ మొద‌టి నుంచి నా మెంటాల్టీ ఏంటంటే ..ఏ ప‌ని చేసిన హండ్రెడ్ ప‌ర్సెంట్ ఎఫ‌ర్ట్ పెడ‌తాను. కాబ‌ట్టి క‌చ్చితంగా స‌క్సెస్ అవుతామ‌న్న న‌మ్మ‌కం ఉంది. హిట్ట‌యితే నాన్నకు నేనిచ్చే రిట‌న్ గిఫ్ట్ అవుతుంది.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !