filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz

View

పాత కొత్త ఫీల్ ప్రేమ కథలకు ఉండదు - శివాత్మిక రాజశేఖర్

Saturday,July06th,2019, 02:20 PM

ఆనంద్ దేవరకొండ, శివాత్మక లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ‘దొరసాని’ జులై 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈమూవీ ట్రైలర్, పాటలతో ప్రేక్షకుల మనసులో ప్రత్యేకమైన ముద్రను వేసింది. కె.వి.ఆర్. దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరగనుంది. దొరసాని ప్రమోషన్స్ లో బాగంగా ఈ రోజు మీడియా తో ముచ్చటించారు హీరోయిన్ శివాత్మిక.


సినిమా తోనే పెరిగాను :
షూటింగ్స్ అనేవి నా ఊహా తెలిసినప్పటినుండి నా జీవితంలో బాగం అయ్యాయి. స్కూల్ కన్నా ఎక్కవుగా షూటింగ్ లోనే టైం స్పెండ్ చేసేదానిని. నేను హీరోయిన్ అవుతానంటే అందుకేనేమో ఇంట్లో ఎవరూ పెద్దగా సర్ ప్రైజ్ అవలేదు. కానీ దొరసాని రిలీజ్ టైం దగ్గర పడుతున్నప్పుడు మాత్రం ఇంట్లో సందండి ఎక్కువవుతుంది.


నేనూ దొరసాని కోసం ఎదురుచూసాను:
ఈ కథ వింటున్నప్పుడు నా పాత్ర బాగా నచ్చింది. దర్శకుడు మహేంద్ర ఆ క్యారెక్టర్ ని వివరించిన విధానం నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. మొత్తం నాలుగు గంటల సేపు కథ చెప్పారు. ఆ తర్వాత ఆడిషన్స్ నన్ను ఆనంద్ ని కలిపే చేసారు. ఆడిషన్స్ కూడా అయ్యాక రెండు నెలలు నాకు ఎలాంటి కబురు అందలేదు. ఆ టైం లో ఆ పాత్ర కోసం నేను ఎదురుచూసాను. నేనే అని తెలిసాక చాలా ఎగ్జైట్ అయ్యాను.


పాత కొత్త ఫీల్ ప్రేమ కథలకు ఉండదు:
పాత, కొత్త అలాంటి తేడాలు ప్రేమకథలకు ఉండవు అని నేను నమ్ముతాను. మోడ్రన్ గాళ్ గా కనిపించాలని అనుకోలేదు. పిరియాడిక్ మూవీస్ అంటే బాగా ఇష్టపడతాను. ఈ ప్రేమకథ లో కనిపించే స్వచ్ఛత నన్ను బాగా ఆకర్షించింది. అందుకే నేను చాలా ఇష్టపడి చేసాను. నేను సంజయ్ లీలా బన్సాలి సినిమాలకు పెద్ద ఫ్యాన్. అలాంటి కథతోనే ఇంట్రడ్యూస్ అవడం చాలా ఆనందంగా ఉంది.


దర్శకుడు కె.వి.ఆర్ మహేంద్ర చాలా ఖచ్చితంగా ఉంటారు:
పాత్రలకోసం రాసుకున్న సన్నివేశాలు ఏమీ లేవు. ఆయన కథతోనే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళారు. నేను ఒక డైలాగ్ చెప్పకుండానే నన్ను సెలెక్ట్ చేసానని షూటింగ్ అయ్యాక చెప్పారు. ఆయన సన్నివేశాలను బాగా ఎక్స్ ప్లెయిన్ చేస్తారు. ఆయన చెప్పిన దాన్ని చేసుకొని చేసుకుంటూ వెళితే చాలు. మొదటి సన్నివేశానికి చాలా టెన్షన్ పడ్డాను, కానీ దర్శకుడు ఇచ్చిన కాన్ఫిడెన్స్ నన్ను నడిపించింది.


అమ్మ సినిమాలే నాకు రిఫరెన్స్:
ఈ కథ 80 దశకాల్లో జరిగే కథ అప్పటి కట్టు బొట్టు గురించి నాకు పెద్దగా తెలియదు. తలంబ్రాలు టైం లో అమ్మ అలంకరణ, స్టైల్ ని రిఫరెన్స్ లా తీసుకున్నాను. అచ్చం అమ్మాలాగే ఉన్నావని షూటింగ్ లోకేషన్స్ లో అంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మ నాకు ఒకటే చెప్పేవారు ఏ క్యారెక్టర్ చేస్తున్నా ఇన్వాల్వ్ అయి చేయమని చెప్పేవారు. అమ్మ నాకు ఎప్పుడూ ఒక ఎనర్జీ సోర్స్ లాగా ఉంటుంది.


మా ప్రేమ కళ్ళలోనే కనపడుతుంది :
చాలా ప్రేమకథలలో కనిపించే స్వేచ్ఛ ఈ ప్రేమ కథలో ఉండదు. మా ప్రేమ కళ్ళలోనే తెలుస్తుంది. అదే ఈ కథను కొత్త గా ప్రజెంట్ చేస్తుంది. నా క్యారెక్ట్ కి పెద్దగా డైలాగ్ లుండవు.. నా పాత్ర లోని ఎమోషన్స్ అన్నీ కళ్ళలోనే పలుకుతాయి. అదే ఛాలెంజ్ గా అనిపించింది. దొరసాని గా కెమెరా ముందు నిలబడే కాన్ఫిడెన్స్ డైరెక్టర్ మహేంద్ర నుండే వచ్చింది. కోదాడ దగ్గర ఒక గడీలో 25 డేస్ షూట్ చేసాము. అది నాకు మంచి ఎక్స్ పీరియన్స్ గా మిగిలిపోతుంది. నేను చేస్తానో లేదో అనే సందేహాలు ఎప్పుడూ లేవు. నేను చెస్తాను అని బలంగా నమ్మేవారు. ఆ నమ్మకమే నన్ను నడిపించింది.


రాజశేఖర్ కూతురి గా ఆనందమే ఎక్కువ:
నాన్న కుండే ఇమేజ్ ని చిన్నతనం నుండి చూస్తూ పెరిగాను. ఈ మద్యనే కల్కి రిలీజ్ అయి ఆ సినిమా తెచ్చిన సందండి ఇంట్లో తగ్గకముందే నా సినిమా రిలీజ్ కి వచ్చేసింది. నాన్న నా సినిమా గురించి అందరికీ గొప్పగా చెబుతుంటే చాలా ఆనందంగా ఒక పక్క టెన్షన్ గా కూడా ఉంది. నాన్న ఇమేజ్ తెచ్చే ఒత్తిడి కంటే ఆనందమే ఎక్కువ . నాన్న డైరెక్టర్స్ హీరో గానే ఉన్నారు,నేను అదే ఫాలో అవుతున్నాను.


గడీల కథలు తెలుసుకున్నాను:
దొరసాని పాత్ర అంగీకరించాక, గడీల గురించి కొంచెం చదువు కున్నాను. దొరల గురించి, దొరసాని ల గురించి తెలుసుకున్నాను. 150 యేళ్ళ నుండి ఉన్న గడిలో షూటింగ్ చేసాము. షూటింగ్ లో జరుగుతున్నప్పుడు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ గడీల గురించి చెప్పేవి విని చాలా ఆశ్చర్యపోయాను. దొరసాని అనే అమ్మయికి బయట ప్రపంచం తెలియకుండా పెరుగుతుంది. ఆ గడీనే ప్రపంచంగా పెరుగుతుంది. రాజు దొరసాని జీవితంలోకి వచ్చాక ఏం జరిగింది అనేదే కథ..? కానీ రాజు దొరసాని ని చేరుకోవడానికి ఏం చేస్తాడు అనేది ఒక రియలిస్టిక్ గా చూపించాడు దర్శకుడు.


ఆనంద్ దేవరకొండ బెస్ట్ :
ఆనంద్ తో వర్క్ చేయడం చాలా కంఫర్ట్ గా ఉంది. చాలా తక్కువ మాట్లాడతాడు కానీ షూటింగ్ లో నెమ్మదిగా ఫ్రెండ్స్ అయ్యాము. నా కుంటే ముందే ఆనంద్ సెలెక్ట్ అయ్యాడు. సెట్ కి వెళ్ళాక రాజు క్యారెక్టర్ ఆనంద్ కంటే బెటర్ గా ఎవరూ చేయరేమో అనిపించింది. చాలా బాగా హార్డ్ వర్క్ చేసాడు. తెలంగాణ స్లాంగ్ కోసం చాలా బాగా ప్రాక్టీస్ చేసాడు. అతని నటన గురించి రిలీజ్ అయ్యాక మాట్లాడుకుంటారు. ప్రేక్షకులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇంకా కథలు ఎమీ ఒప్పుకోలేదు. నా ఎజ్ తగ్గ కథలు చేద్దామనుకుంటున్నాను. దొరసాని గా నా నటనకు ప్రేక్షకులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ కోసం ఏదురుచూస్తున్నాను. అమ్మా, నాన్నలు ఈసినిమా పై, నా నటన పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇంట్లో ఇప్పడు అందరూ మాట్లాడుకునే టాపిక్ దొరసాని గురించే. అందుకే దొరసాని తర్వాత మిగిలిన కథల గురించి ఆలోచిస్తాను.


ఆనంద్ దేవరకొండ, శివాత్మిక హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతోన్న ఈ చిత్రంలో కన్నడ కిశోర్, వినయ్ వర్మ, ‘ఫిదా’ శరణ్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
సురేష్ బాబు సమర్పణలో వస్తోన్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి
ఎడిటర్ : నవీన్ నూలి
సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి.
ఆర్ట్ డైరెక్టర్ : జెకె మూర్తి
పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా
కో ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని
నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని
రచన, దర్శకత్వం : కె.వి.ఆర్. మహేంద్ర



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !