View

ఇంటర్య్వూ - భీమినేని శ్రీనివాసరావు (కౌసల్య కృష్ణమూర్తి)

Monday,August26th,2019, 04:30 PM

'శుభమస్తు' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యి 'శుభాకాంక్షలు', 'సుస్వాగతం', 'సూర్యవంశం' లాంటి సూపర్‌ హిట్‌ చిత్రాలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా చెరగని ముద్ర వేశారు భీమినేని శ్రీనివాసరావు. లేటెస్ట్‌గా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి'. ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ తమిళ్‌ హీరో శివ కార్తికేయన్‌ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ విభిన్నకథా చిత్రం ఆగష్టు 23 ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌తో మంచి కలెక్షన్స్‌ సాధిస్తూ.. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది..ఈ సందర్భంగా దర్శకుడు భీమినేని శ్రీనివాస రావు ఇంటర్వ్యూ...


మూవీ రిలీజ్ అయింది కదా! రెస్పాన్స్‌ ఎలా ఉంది?
- మా చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి' విడుదలై మూడు రోజులు అవుతుంది. నాకు ఈ సినిమాకు వచ్చినన్ని అప్రిసియేషన్‌ కాల్స్‌ మరే సినిమాకు రాలేదు. అలాగే మీడియా మిత్రులకి ఈ సినిమా నచ్చడంతో సొంత సినిమా అనుకోని సపోర్ట్‌ చేశారు. మంచి రివ్యూస్‌ ఇచ్చారు. మా సినిమాకు పాజిటివ్‌ ఆర్టికల్స్‌, రివ్యూస్‌ రాసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఆడియన్స్‌ కూడా సినిమాకు 100 పర్సెంట్‌ కనెక్ట్‌ అయ్యారు. వారందరి నుండి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ముఖ్యంగా చాలా మంది కాలేజ్‌ స్టూడెంట్స్‌ ఫోన్‌ చేసి మా స్టూడెంట్స్‌ అందరికి ఒక ఇన్స్పిరేషన్‌లా ఉందని అంటున్నారు.


ఇండస్ట్రీ ప్రముఖుల నుండి ఎలాంటి అప్రిసియేషన్‌ వస్తోంది?
- కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి గారు వారి కుటుంబసభ్యులతో కలిసి 'జిమాల్‌
'లో సినిమా చూడడం జరిగింది. సినిమా వారికి విపరీతంగా నచ్చడంతో నన్ను, ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌ రామారావు గారిని ఇంటికి పిలిచి స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు ప్రతి ఫ్రేమ్‌ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది అని అభినందించారు. అలాగే రాజేంద్ర ప్రసాద్‌, ఐశ్వర్య రాజేష్‌, హీరో కార్తీక్‌ రాజు నటనను కొనియాడారు. వారికి ఫోన్‌ చేసి అభినందించారు. మున్ముందు ఇలాంటి మంచి సినిమాలు ప్రజలకు రీచ్‌ అవడానికి తనవంతు సహకారం తప్పకుండా చేస్తానని చెప్పారు. అందుకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా...


'కౌసల్య కృష్ణమూర్తి' మీకెలాంటి అనుభూతినిచ్చింది?
- కెరీర్‌ స్టార్టింగ్‌లో 'శుభాకాంక్షలు', 'సుస్వాగతం', 'సూర్యవంశం' లాంటి మంచి సినిమాలు చేసినా... మంచి కాన్సెప్ట్‌ దొరకడం కష్టం అవుతున్న ఈ మధ్యకాలంలో 'కౌసల్య కృష్ణమూర్తి' లాంటి ఒక గొప్ప సినిమా దర్శకత్వం వహించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఇది నా కెరీర్‌ బెస్ట్‌ ఫిలిమ్‌.


క్రికెట్‌ నేపథ్యం ఉన్న సినిమాలు చాలా వచ్చాయి కదా?
- ఈ మధ్య కాలంలో 'మజిలీ', 'జెర్సీ' లాంటి క్రికెట్‌ నేపథ్యం ఉన్న సినిమాలు వచ్చి సక్సెస్‌ సాధించినా... ఇది ఒక ఫిమేల్‌ సెంట్రిక్‌ మూవీ. ఒక క్రికెటర్‌గా ఎదుగుతూనే ఒక తండ్రి కూతుళ్ళ మధ్య ఉండే ఎమోషన్‌ చూపించిన సినిమా. అలాగే దానికి ప్యారలల్‌గా రైతుల సమస్యలను చూపించడం జరిగింది. అన్ని ఎమోషన్స్‌ని అండర్‌ కరెంట్‌ ప్యాకేజీలా స్క్రీన్‌ప్లే నడిపిన సినిమా ఇది. స్క్రీన్‌ ప్లే ప్రతి ఒక్కరికి నచ్చడంతో పాటు ఎమోషన్స్‌కి అందరు కనెక్ట్‌ అవుతున్నారు.


ప్రొడక్షన్ వాల్యూస్ గురించి?
- క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌లో గతంలో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి.. సూపర్‌ హిట్స్‌ సాధించాయి. అలాంటి గొప్ప బేనర్‌లో 'కౌసల్య కృష్ణమూర్తి' లాంటి మంచి సినిమా చేసే అవకాశం వస్తుందని నేను ఊహించలేదు. అందుకు కె.ఎస్‌ రామారావు గారిని, నిర్మాత కె.ఏ వల్లభ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.


శివ కార్తికేయన్‌ క్యారెక్టర్‌ కోసం ఎవరినైనా అనుకున్నారా?
- ఈ చిత్రం తమిళ్‌లో వచ్చిన 'కనా' సినిమాకు రీమేక్‌. శివకార్తికేయన్‌ గారే ఆ సినిమాకి నిర్మాత. తమిళంలో అంత పెద్ద హీరో అయుండి కూడా ఒక ఫిమేల్‌ ఓరియంటెడ్‌ మూవీని ప్రొడ్యూస్‌ చేయడం, అందులో గెస్ట్‌రోల్‌లో నటించడం నిజంగా గొప్ప విషయం. తమిళంలో ఆ క్యారెక్టర్‌ బాగా చేయడం, ఆయనకు ఇంట్రెస్ట్‌ ఉండడంతో ఆ క్యారెక్టర్‌ వారితోనే చేపించడం జరిగింది. ఆ క్యారెక్టర్‌కి తెలుగులో కూడా మంచి అప్లాజ్‌ వస్తుంది.


ఎక్కువ మంది తమిళ్ టెక్నీషియన్స్‌ వర్క్‌ చేశారు కదా! వారి గురించి?
- అరుణ్‌ రాజాకామరాజ్‌ అని ఫస్ట్‌ టైమ్‌ 'కనా' సినిమా ద్వారా తమిళంలో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆయన రాసిన కథ బాగుండడం, ఆయనతో కలిసి పని చేసిన అందరి ఎఫర్ట్‌ బాగుండడంతో వారినే తెలుగులో కూడా తీసుకోవడం జరిగింది. అలాగే మ్యూజిక్‌ డైరెక్టర్‌ ధిబు నినన్‌ థామస్‌ చాలా ఫేమస్‌. ఆయన తన మ్యూజిక్‌తో ఈ సినిమాకు ప్రాణం పోశారు. అలాగే ఆండ్రు గారి విజువల్స్‌ సినిమాకు చాలా ప్లస్‌ అయ్యాయి.


మీరు ఎక్కువగా రీమేక్ సినిమాలే చేశారు?
- ఆడియన్స్‌కి కథ నచ్చితే అది డబ్బింగ్‌ సినిమా, ఒరిజినల్‌ సినిమానా అని చూడకుండా మంచి సినిమాను ఆదరిస్తున్నారు. హిట్‌ చేస్తున్నారు. అలాంటప్పుడు ఒక మంచి కథ ఎక్కడ ఉన్న మన తెలుగు ప్రేక్షకులకి చూపించాలనే సంకల్పంతో ఇప్పటివరకూ ఎక్కువ రీమేక్‌ సినిమాలే చేశాను. మారుతున్న కాలంతో పాటు మనము మారాలి. ప్రేక్షకుల అభిరుచిని ద ష్టిలో పెట్టుకొని మంచి సినిమాలు తీయాలి అప్పుడే మనం విజయం సాధించగలం.


ఈ సినిమాలో మీ క్యారెక్టర్‌ కి మంచి రెస్పాన్స్‌ వస్తుంది కదా? నటుడిగా ఇతర సినిమాల్లో నటిస్తారా?
- నేను స్కూల్‌, కాలేజ్‌ డేస్‌ నుండే నేను రైటర్‌గా, ఆర్టిస్ట్‌గా చేసేవాన్ని.. ఆ అనుభవంతో సినిమా మీద ఫ్యాషన్‌తో ఇండస్ట్రీకి రావడం జరిగింది. నటుడిగా చేయాలంటే కొంత భయం వేసిటెక్నీషియన్‌ గా చేరడం జరిగింది. నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేస్తున్న టైమ్‌ 'అశ్వద్ధామ' సినిమాలో ఒక క్యారెక్టర్‌ చేశాను. అలాగే
ఆర్‌ నారాయణమూర్తి 'ఆలోచించండి' సినిమాలో సెకండ్‌ హీరోగా చేశాను. ఈ మధ్య కాలంలో 'కుదిరితే కప్పు కాఫీ' సినిమాలో తండ్రి క్యారెక్టర్‌ చేశాను, 'కెరటం'లో ఒక మంచి సినిమా క్యారెక్టర్‌ చేశాను. తరువాత 'కౌసల్య క ష్ణమూర్తి 'లో బ్యాంకు మేనేజర్‌ క్యారెక్టర్‌ చేశాను. ఈ సినిమాలో నాదొక్కటే నెగటివ్‌ రోల్‌ అయినా మంచి కాంప్లిమెంట్స్‌ వస్తున్నాయి. ఇక ముందు కూడా మంచి క్యారెక్టర్‌ వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను.


సుడిగాడు 2 చేసే ఆలోచన ఉందా?
- 'సుడిగాడు' సినిమా కాన్సెప్ట్‌ చాలా మంచిది. ఈ దర్శకుడికైనా కొన్ని సినిమాలు మైలేజ్‌నిస్తాయి అలాంటి ఒక సినిమా 'సుడిగాడు'. నాకెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా. నేను అల్లరి నరేష్‌ కూడా 'సుడిగాడు2' మీద చాలా క్యూరియస్‌గా ఉన్నాం. మంచి అవకాశం వస్తే ఆ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటూ ఇంటర్వ్యూ ముగించారు దర్శకుడు భీమినేని శ్రీనివాస రావు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !