filmybuzz

View

ఇంటర్య్వూ - నటుడు సురేందర్‌ రెడ్డి

Friday,October02nd,2020, 10:34 AM

రాజా ది గ్రేట్‌ మూవీలో పగసాధిస్తా.. జయంమనదేరా డైలాగ్స్‌తో పాపులర్‌ అయ్యారు నటుడు సురేందర్‌ రెడ్డి. ఆ తర్వాత వ‌రుస‌గా ఎమ్‌సిఎ.ఎఫ్‌2, శ్రీనివాస కళ్యాణం, ఎంతమంచి వాడవురా, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠ పురములో చిత్రాలతో పాటు లేటెస్ట్‌గా వ‌చ్చిన‌ 'వి' చిత్రంలోనూ నటించి ప్రేక్షకుల మ‌న్న‌ల‌ను పొందారు. త్వరలో మరిన్ని మంచి చిత్రాలతో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేయడానికి సిద్ద‌మైన‌ న‌టుడు సురేందర్‌ రెడ్డి ఇంటర్వ్యూ..


మీ గురించి చెప్పండి?
- మాది నిజామబాద్‌ జిల్లా. చదువుకోసం హైదరాబాద్‌కి వచ్చాను. ఆ త‌ర్వాత‌ దిల్‌రాజు శిరీష్ గార్ల ప్రోత్సాహంతో ఆటోమొబైల్ బిజినెస్‌లోకి వ‌చ్చాను. వాళ్ల‌తో ఉన్న ప‌రిచ‌యంతో రెగ్యుల‌ర్‌గా షూటింగ్స్‌కి వెళ్తుండేవాడిని. అలా వెళ్ళ‌డం వల్ల యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వ‌చ్చింది.  ఒకసారి డీజే సినిమా షూటింగ్‌కి వెళ్లినప్పుడు 'మీరు సినిమాల్లో ట్రై చెయ్యెచ్చు కదా.. మీది విలనీ ఫేస్‌ సినిమాల్లోకి వస్తే తప్పకుండా రాణిస్తారు` అని దర్శకుడు హరీష్‌ శంకర్ అన్నారు.  కాని అప్పటికే డీజే సినిమా షూటింగ్‌ చాలా భాగం పూర్తయ్యింది. ఆ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్‌ అయినా చేస్తాను అని చెప్పాను అయితే  దిల్‌ రాజు గారు చిన్న క్యారెక్టర్‌ వద్దులే నెక్ట్స్‌ మూవీలో చూద్దాం అన్నారు. అలా అనిల్‌ రావిపూడిగారి దర్శకత్వంలో తెరకెక్కిన 'రాజా ది గ్రేట్‌' సినిమాలో నటుడిగా మొదటి అవకాశం వచ్చింది.


మొదటి సినిమా ఎక్స్‌పీరియన్స్‌ ఏంటి?
- అనిల్‌ రావిపూడి గారు ముందుగా ఆడిషన్‌లో ఒక డైలాగ్‌ చెప్పమని ఇచ్చారు. ఆ ఆడిషన్‌ కో-రైటర్‌, అసొసియేట్‌ సాయిగారు తీసుకుని అనిల్‌ గారికి చూపించారు. నా డైలాగ్‌ డెలివరి, బాడీ లాంగ్వేజ్‌ చూసి అనిల్‌ రావిపూడి గారు వెంటనే శిరీష్‌ గారికి ఫోన్‌ చేసి 'సర్‌ సినిమా ఇండస్ట్రీకి మరో మంచి నటుడు దొరికాడు' అని చెప్పి ఆ సినిమాలో పంతులు క్యారెక్టర్‌ నా కోసమే డిజైన్‌ చేశారు. అలా అనిల్‌ రావిపూడి గారు ఈ సినీ ప్రపంచానికి జన్మనిచ్చారు. ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే సాయిగారు వారి ప్రతి సినిమాలో నాకు అవకాశం ఇచ్చి నన్ను సపోర్ట్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్‌ రావిపూడి, సాయిగార్లకు నా హృదయపూర్వక దన్యవాదాలు తెలుపుతున్నాను.


రాజా ది గ్రేట్ సినిమా రిలీజయ్యాక మీకు ఎలాంటి అప్రిసియేషన్‌ వచ్చింది?
- సినిమా విడుదలై పెద్ద హిట్అయింది. అలాగే నా క్యారెక్టర్‌కి కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దాంతో నా స్నేహితులు, సన్నిహితులు ఫోన్‌ చేసి మీ స్క్రీన్‌ ప్రజెన్స్‌ చాలా బాగుంది కంటిన్యూ చేయండి అని అన్నారు. నేను పంతులు క్యారెక్టర్‌లో పగసాధిస్తా..జయం మనదేరా సినిమా పేర్లతో ఉన్న పోస్ట‌ర్ల‌ను ఇప్ప‌టికీ చాలా సందర్భాలలో మీమ్స్‌, ట్రోల్స్‌ లో వాడుతుంటారు.


త‌ర్వాత ఏ ఏ సినిమాల‌లో న‌టించారు?
- ఫస్ట్‌ మూవీలోనే నా పాత్రకి మంచి గుర్తింపు రావడం, నాకు కొంత కెమెరా ఫీయర్‌ పోవడంతో నటనపై ఇంట్రెస్ట్‌ వచ్చింది. ఆ సినిమా జరుగుతున్న సమయంలోనే వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో నానిగారు హీరోగా ఎమ్‌సిఏ సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమాలో లాయర్‌ క్యారెక్టర్‌ చేశాను. ఆ పాత్ర కూడా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత మరోసారి అనిల్‌ రావిపూడి గారి దర్శకత్వంలో ఎఫ్‌2 సినిమాలో వరుణ్‌ ఫాదర్‌ క్యారెక్టర్‌ చేశాను. ఎప్పుడూ పక్కింటి వారితో సీరియల్స్‌ గురించి డిస్కస్‌ చేసే ఆ క్యారెక్టర్‌ కూడా థియేటర్లో ఆడియన్స్‌ చేత నవ్వులు పూయించింది. ఎఫ్‌ తర్వాత శ్రీనివాస కళ్యాణంలో పంతులు క్యారెక్టర్ చేశాను, సంక్రాంతికి విడుద‌లైన స‌రిలేరు నీకెవ్వ‌రు, అల వైకుంఠ‌పుర‌ములో, ఎంతమంచివాడవురా చిత్రాల‌లో మంచి క్యారెక్ట‌ర్స్ చేశాను, రీసెంట్‌గా విడుద‌లైన `వి` మూవీలో కూడా ఒక క్యారెక్ట‌ర్ చేశాను.


దిల్‌రాజు గారి సినిమాల్లోనే ఎక్కువగా కనిపించడానికి రీజనేంటి?
- దిల్‌ రాజుగారు, శిరీష్‌ గారు వారి సినిమాల‌లో అవ‌కాశం ఇచ్చి మొదటినుండి నన్ను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అయితే వారి బేనర్‌లో సినిమాలు చేస్తూనే అల వైకుంఠపురములో, ఎంతమంచి వాడవురా చిత్రల్లో నటించాను. ఇప్పుడు రవితేజగారి క్రాక్‌ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్‌ చేస్తున్నాను. అలాగే ఒక క్రొత్త హీరోతో తెరకెక్కుతోన్న సినిమాలో పూర్తిగా నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర చేశాను ఆ సినిమా త్వరలోనే విడుదలకు సిద్దంగా ఉంది.


ఆర్టిస్ట్‌గా ఎలాంటి క్యారెక్టర్స్‌ చేయాలనుకుంటున్నారు?
- ముందు సీరియస్‌ క్యారెక్టర్స్‌, విలనిజం పండించే క్యారెక్టర్స్‌కి సూట్‌ అవుతాను అనుకున్నాను. కాని అనిల్‌ రావిపూడి గారు నా ఒపీనియన్‌ని పూర్తిగా మార్చేశారు. అప్పటినుండి ఇలాంటి క్యారెక్టర్స్‌ మాత్రమే చేయాలి అని అనుకోవడం లేదు. అన్ని రకాల క్యారెక్టర్స్‌ చేసి  ఒక ఆర్టిస్ట్‌గా నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవాలి అనుకుంటున్నాను.


ప్ర‌స్తుతం మీరు న‌టిస్తున్న సినిమాలు?
- సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ గారి అన్నాత్తై సినిమాలో ప్రకాశ్‌రాజ్‌ ఫ్యామిలీ ఫ్రెండ్‌గా చేస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్‌గారి వకీల్‌సాబ్‌ సినిమాలో లాయర్‌గా నటిస్తున్నాను. యన్‌టిఆర్‌ ఆర్ట్స్‌లో రూపొందుతున్న కొత్త‌ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్‌ చేస్తున్నాను. అలాగే  సంపత్‌నంది గారి ఓదెల రైల్వే స్టేషన్‌ సినిమాలో సర్పంచ్ క్యారెక్ట‌ర్‌తో పాటు కందిరీగ ఫేమ్‌ శ్రీనివాస్‌ గారు తెరకెక్కిస్తోన్న అల్లుడు అదుర్స్‌ సినిమాలోనూ మరో మంచి క్యారెక్టర్స్‌‌ చేస్తున్నాను.


రజినీకాంత్‌ సినిమాలో నటించడం ఎలా అనిపించింది?
- రజినీగారు గొప్ప నటుడు. చాలా డౌన్‌ టు ఎర్త్‌ పర్సనాలిటీ. ఆయన సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆ అనుభవం మాటల్లో చెప్పలేనిది.


దాదాపు స్టార్‌ హీరోలందరి సినిమాల్లో నటించారు క‌దా..?
- ఇంత తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలోని స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే అవకాశం వస్తుందని నేను ఊహించలేదు. చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చి సపోర్ట్‌ చేస్తోన్నద‌ర్శ‌కుల‌కి, నిర్మాత‌ల‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు.


 ఫ‌్యూచ‌‌ర్‌లో ఎలాంటి పాత్ర‌లు చేయాల‌నుకుంటున్నారు?
- చిన్న క్యారెక్టర్‌ అయినా సరే ప్రేక్షకుల అటెన్షన్‌ గ్రాస్‌ చేయగలిగితే చాలు. ముందు ఈ రంగంలో రాణించ‌గ‌ల‌నా అని భ‌యం వేసింది. అయితే త‌ప్ప‌కుండా రాణించ‌గ‌ల‌ను అని ధైర్యం వ‌చ్చింది. ఇక నుండి పూర్తి కాన్సన్‌ట్రేషన్‌తో ఫుల్‌ ఫ్లెజ్‌డ్‌గా సినిమాలు చేస్తాను.  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !