View

ఇంటర్య్వూ - హీరో సంతోష్ శోభన్ (అన్నీ మంచి శకునములే)

Saturday,May13th,2023, 02:57 PM

ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్  'అన్నీ మంచి శకునములే'. మిత్ర విందా మూవీస్‌ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలని పెంచింది. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రం హీరో సంతోష్ శోభన్ విలేకరుల సమావేశంలో 'అన్నీ మంచి శకునములే' విశేషాలని పంచుకున్నారు.


ఈ చిత్రం ఎలా మొదలైంది?
నాకు అడ్వాన్స్‌ చెక్‌ 2018 లో ఇచ్చింది ప్రియాంక దత్‌ గారే. పేపర్‌బాయ్‌ చిత్రం తర్వాత  5 ఏళ్ళ గ్యాప్ తర్వాత సరైన కథ, సరైన టైమ్‌ లో వచ్చింది అనుకున్నాను. అలా ఈ సినిమా ప్రారంభమైంది.


రావురమేష్‌, రాజేంద్రప్రసాద్‌, జానకి గారు ఇలాభారీ తారాగణం గురించి ముందుగానే మీకు చెప్పారా?
నేను కథ విన్నప్పుడు పలు పాత్రలు ఉన్నాయని చెప్పారు. నందినిరెడ్డి గారు స్వప్న గారు నన్ను ఆడిషన్‌ లో ఎంపిక చేశారు. ఆరోజు నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చారు. నేను వారిని కలవడం అనేది చాలా సంతోషంగా ఫీలయ్యాను. వెన్నెల కిశోర్‌ తో ఇంతకుముందు చేశాను. కానీ మిగిలిన వారితో మొదటిసారి నటించా.


ఈ సినిమాలో మీకు మెమొరబుల్‌ సంఘటనలు వున్నాయా?
ఈ సినిమాలో నేను, షావుకారు జానకీ గారు డా ర్లింగ్‌ అని పిలుచుకుంటాం. ఇలాంటి పాత్ర చేసే అవకాశం యూత్‌ లో నాకే వచ్చింది అనుకుంటున్నా. తను చాలా ఫ్రెండ్లీ గా ఉంటారు. సీనియర్‌ గా ఆమె నటనానుభవాలను షేర్‌ చేసుకున్నారు.


వాసుకిగారు మిమ్మల్ని స్వీటెస్ట్‌ అని కాంప్లిమెంట్‌ ఇచ్చారు?
అక్కంటే మా వాసుకి లా ఉండాలి అనిపించింది. ఆమె సూపర్‌. తొలిప్రేమ సినిమా చూశాక వాసుకి లాంటి చెల్లెలు వుంటే బాగుంటుంది అనిపించింది. ఈ సినిమాలో అక్కంటే ఇలాగే ఉండాలి అనిపిస్తుంది. ఎమోషన్స్‌, లైటర్‌ వే లో సీన్స్‌ చాలా అద్భుతంగా చేసింది. ఆమెతో ఇంకా కలిసి సినిమాలు చేయాలనిపించింది.


ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ కదా? కథలో మిమ్మల్ని ఎట్రాక్ట్‌ చేసిన అంశం ఏమిటి?
నందినిరెడ్డి గారితో పనిచేయడం ఎట్రాక్ట్‌. అలా మొదలైంది సినిమా చూశాక, చాలా కాలం తర్వాత బోనిఫైడ్‌ రామ్‌ కామ్‌ ను అద్భుతంగా తీశారనిపించింది. కథలో ప్రేక్షకుల్ని లీనం చేశారు. ఖుషి,తొలిప్రేమ సినిమాలు చూశాక కళ్యాణ్‌ గారి నటన బోనిఫైడ్‌ రామ్‌ కామ్‌ లా అనిపిస్తుంది. అలాగే నాకూ నందినిరెడ్డి గారి అలా మొదలైంది  చూశాక ఆమెతో సినిమా చేయాలనుకున్నా. అనుకోకుండా ఇప్పటికి కుదిరింది. ఈ సినిమాలో చాలా మ్యాజిక్‌ జరిగింది. నాకు అవకాశం రావడం అదృష్టమే.


కెరీర్‌ ఆరంభం నుంచి చూసుకుంటే అన్నీ మంచి శకునములే చిత్రం మీకు  మంచి శకునం అనిపిస్తుందా?
నా కెరీర్‌ లో ఇలాంటి కథకానీ, ఇంతమంది నటీనటుల కాంబినేషన్‌ లో భాగమయ్యే అవకాశం రాదేమోనని అనుకుంటున్నా. నా కెరీర్‌ లోనే బిగ్గెస్ట్‌ కథ, వెండితెరపై చూడాల్సిన సినిమా ఇది. ఆ ఫీలింగ్‌ సినిమా చేసేటప్పుడు అనిపించింది. ఈ సినిమా టైటిల్‌ వినగానే చాలా నిజాయితీగా తీసే సినిమా అనిపించింది. ఇటీవలే ఈ సినిమాను ఎటవంటి బీజియమ్‌ లేకుండా చూశాను. బయటకు వచ్చాక చాలా తేలిగ్గా హాయిగా అనిపించింది. అదే శుభ శకునం నాకు.


ట్రైలర్‌ లో రామ్‌కామ్‌ అక్కడక్కడా అనిపించింది. మొత్తంగా చూసే మీ యు.ఎస్‌.పి. ఇందులో ఏమిటి?
ఫ్యామ్‌ కామ్‌ (ఫ్యామిలీ అంతా హాయిగా నవ్వుకునే) లాంటి సినిమా. నందినీరెడ్డిగారు ఒరిజినల్‌ గా నవ్విసూ ఏడిపిస్తారు. ఈ సినిమాలో ఒరిజినల్‌ స్ట్రెంత్‌.. డ్రామా, ఎమోషన్స్‌, చాలా కొత్తగా అనిపించే సన్నివేశాలే.


అంతమంది సీనియర్స్‌ తో పనిచేయడం వల్ల ఏమి నేర్చుకున్నారు?
1950 నాటి షావుకారు జానకి గారి నుంచి కానీ ,2020 లో వున్న నటీనటులనుంచి కూడా చాలా విషయాలు నేర్చుకునే ఛాన్స్‌ నాకు దొరికింది. రాజేంద్రప్రసాద్‌ గారంటే లెజెండ్రీ. ఏప్రిల్‌1 విడుదలలో ఆయన టైమింగ్‌ ను కాపీ కొట్టి నేర్చుకున్నా.


ప్రభాస్‌ గారి కటౌట్‌ ఓ  సీన్‌లో కనిపిస్తుంది  ఏమిటది ?
యూరప్‌ లో ఒక సీన్‌ వుంటుంది. నా ఫేవరేట్‌ హీరో ప్రబాస్‌ ది పెట్టడం ఆ సీన్‌ చాలా ఫన్‌ గా వుంటుంది. సినిమాలో చూస్తే మీరు ఎంజాయ్‌ చేస్తారు.


13 ఏళ్ళ కెరీర్‌ లో ఇంకా ఆడిషన్‌ అవసరమా అనిపించలేదా?
అది కష్టంకాదు సార్‌. నేను స్టేజి ఆర్టిస్ట్ నుంచి వచ్చాను. మనం ఏమిటో తెలియని వారికి నిరూపించుకోవడం లో అలా చేయడంలో తప్పులేదు.  ఆడిషన్‌ ద్వారా నాకు రావడం చాలా ఆనందంగా వుంది.


మీ పాత్రలో ఇంపార్టెంట్‌ ఏమిటి?
రుషి అనే పాత్ర చేశాను. ఏక్‌ మినీ కథలో బరువు మోసే పాత్ర చేశాను. ఇందులో నవ్వుతూ, నవ్విస్తూ ఉండే పాత్ర పోషించాను. నేను ఇలా చేయగలనా! అని అనిపిస్తుంది చాలా మందికి.


నందిని రెడ్డి గారి దర్శకత్వం ఎలా అనిపించింది?
నా స్ట్రాంగ్‌ జోన్‌ ఆమె దర్శకత్వం చేయడమే.కామెడీ ఎలా ఉండాలి. ఎంత మోతాదులో చూపించాలి. ఓవర్‌ కాకూడదు అనేది ఆమెకు బాగా తెలుసు. దర్శకురాలిగా ఆమె బెస్ట్‌.


టీమ్‌ అంతా మహిళలే కదా? డామినేట్‌ అనిపించిందా?
అలాంటిది ఏమీ లేదు. దర్శక నిర్మాతలు తమ్ముడి లా నన్ను చూసుకున్నారు. డామినేట్‌ కు నో ఛాన్స్‌. హీరో కు ట్రీట్‌ మెంట్‌ ఎలా వుండాలో అలా వుండేలా చూసుకున్నారు.


తొలిదశలోనే పెద్ద బేనర్ల లో చేయడం ఎలా అనిపిస్తుంది?
అశ్వనీదత్‌గారి 50 ఏళ్ళ కెరీర్‌ బేనర్‌ లో నేను చేయడం చాలా ఆనందంగా వుంది. నాన్నగారు అప్పట్లో వారి బేనర్‌ లో ఓ సినిమా చేశారు. నేను కూడా వారి బేనర్‌ లో చేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. స్వప్న సినిమాస్‌, వైజయంతీ మూవీస్‌ లో పనిచేయడం లక్క్‌ గా ఫీలవుతున్నాను.


మీ పై నాన్నగారి ప్రభావం వుందా?
అది నాన్నగారు ఉన్నప్పుడు పెద్దగా తెలియలేదు. వెళ్ళిపోయాక ఆ ప్రభావం బాగా కనిపించింది. నాన్నగారు మంచి రచయిత. బయట నాన్నగారి గురించి చెప్తుంటే నాకు ఆయనతో ఉన్నప్పుడు అర్థం చేసుకోలేకపోయానా అనే ఫీలింగ్‌ వస్తుంది.


సోషల్‌మీడియాలో కిరణ్‌ అబ్బవరం, మీ గురించి కంపేర్‌ చేస్తున్నారు?
అలా కంపేర్‌ చేయకూడదు. సోషల్‌ మీడియా లో ఎక్కువగా ఇలాంటివి రావడం బాధాకరం.


 మాళవిక నటన, మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా వుంది?
ఆమె కళ్ళతోనే అభినయించగల నటి. చాలా తక్కువ మందికి ఆ ప్రతిభ వుంటుంది. ఈ విషయంలో ఆమెను చూసి ఒక్కోసారి జెలసీగా ఫీలవుతా. ఇక కెమిస్ట్రీ అంటారా. మాది మూడు స్టేజీల్లో కథ నడుస్తుంది. ప్రతి చోటా మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది.


కొత్త సినిమాలు?
యు.వి. క్రియేషన్స్‌ తో చేస్తున్నా. ఆ తర్వాత కొత్త బేనర్‌ లో చేయబోతున్నా. త్వరలో వెల్లడిస్తా.


మదర్స్‌ డే సందర్భంగా అమ్మగారి గురించి?
మొన్న టీవీ షోలో కూడా అమ్మగారి గురించి అడిగారు. మాటలు రాలేదు. నటుడిగా సినిమాలు చేయడం ఆమెకు చాలా హ్యాపీగా వుంది. మొదట్లో నటుడిగా చాలా కాలం గేప్‌ తర్వాత కూడా అమ్మ ఇచ్చిన ధైర్యం మర్చిపోలేనిది. ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థల్లో అవకాశాలు రావడం చెప్పలేని ఆనందం. అమ్మ నన్ను నమ్మింది కాబట్టి సినిమాలు చేయగలుగుతున్నాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !