View

ఇంటర్య్వూ - హీరో అనురాగ్ (రాధాకృష్ణ)

Saturday,February06th,2021, 12:32 PM

రాగల 24 గంటల్లో చిత్రంతో  పరిచయమయ్యి  మొదటి చిత్రంతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో అనురాగ్. ప్రస్తుతం ప్ర‌ముఖ ద‌ర్శకుడు ఢ‌మ‌రుకం ఫేమ్ శ్రీనివాస‌రెడ్డి స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణలో రూపొందిన చిత్రం రాధాకృష్ణ‌. అనురాగ్‌, ముస్కాన్ సేథీ (పైసా వ‌సూల్ ఫేమ్‌) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నంద‌మూరి లక్ష్మీ పార్వతి ఒక కీల‌క‌పాత్ర‌ పోషించారు. టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రాన్ని హ‌రిణి ఆరాధ్య‌ క్రియేష‌న్స్ ప‌తాకంపై పుప్పాల సాగ‌రిక కృష్ణ‌కుమార్‌ నిర్మించారు.  ఫిబ్ర‌వ‌రి 5న సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సక్సెస్ ఫుల్ టాక్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో అనురాగ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు...


సినిమా ఎలా స్టార్ట్ అయ్యింది. యాక్టర్ గా మీ ప్రయాణం ఎలా మొదలైంది?
- ఇండస్ట్రీలో అలీ గారు నాకు పరిచయం. ఆయన ద్వారా శ్రీనివాసరెడ్డి గారిని కలిశాం. నా గురించి ఆలీ గారు శ్రీనివాసరెడ్డి గారికి చెప్పారు. అప్పట్నుంచి వారితో నాకు మంచి సాన్నిహిత్యం మొదలైంది. వారు చెప్పడం వల్ల 'రాగల 24 గంటల్లో' సినిమాలోని ముగ్గురు హీరోల్లో ఒకరిగా చేశాను. నా యాక్టింగ్ బాగా నచ్చి నన్ను 'రాధాకృష్ణ' మూవీకి రికమండ్ చేశారు. అలా రాధాకృష్ణ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. శ్రీనివాసరెడ్డి గారి వల్ల ఈ సినిమా ఇప్పుడు ఇంత సక్సెస్ అయ్యింది.


మీ క్యారెక్టర్ గురించి విన్నప్పుడు మీరు ఎంత ఎగ్జైట్ అయ్యారు?
- మెయిన్ లీడ్ క్యారెక్టర్ నన్ను చేయడమనడం నాకు పెద్ద విషయంగా అనిపించింది. 'రాగల 24 గంటల్లో' సినిమాలో నా క్యారెక్టర్ డ్యూరేషన్ తక్కువగా ఉంటుంది. రాధాకృష్ణ లో చేయమనగానే చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఒక పక్క టెన్షన్గా ఉంది. మరోవైపు ఎగ్జైట్మెంట్. రాధాకృష్ణ సినిమాలో మంచి క్యారెక్టర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.


నిర్మల్ బొమ్మల బ్యాక్ డ్రాప్ లో సినిమా చేశారు?
- నిర్మల్ బొమ్మల బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయడాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిర్మల్ బొమ్మల ప్రసిద్ధి గురించి ఇప్పటి వారికి అంతగా తెలియదు. ఈ సినిమా ద్వారా ఓ మంచి సందేశం నా ద్వారా వెల్లడం చాలా ఆనందంగా ఉంది.


ఈ సినిమా ద్వారా ఏం తెలుసుకున్నారు?
- నిర్మల్ బొమ్మలను తయారు చేసే వారి కష్టం తెలిసింది. మన సంస్కృతిను కాపాడుకోవాలి. మాటల్లో చెప్పలేను వారి కష్టాన్ని. వారికి ఈ సినిమా ద్వారా పరోక్షం గా హెల్ప్ చేశామని మాకు అనిపిస్తోంది.


షూటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి?
- అమేజింగ్ షూటింగ్ ఎక్స్పీరియన్స్. మన దగ్గర కూడ ఇంత మంచి  లొకేషన్స్ ఉన్నాయా? అనిపించింది. చిత్ర యూనిట్ అందరు బాగా సహకరించారు. శ్రీనివాస రెడ్డిగారి స్క్రీన్ ప్లే కు ఓ డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకున్నాను. ముస్కాన్ హార్డ్ వర్కింగ్ హీరోయిన్.


మీ సినిమాకు డైరెక్టర్, ప్రొడ్యూసర్ కొత్తవారు. సినిమా స్టార్టింగ్లో ఏమనిపించింది?
- మేజర్ గా కొత్తవారు ఉన్నా....ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కూడ ఉన్నారు. ప్రసాద్ అన్న శ్రీనివాసరెడ్డి గారి దగ్గర పనిచేశారు. ప్రసాద్ గారికి ఆ అనుభవం ఉంది కాబట్టి మా పని సులువు అయ్యింది. శ్రీలేఖ గారు మంచి సంగీతం అందించారు. చిన్న సినిమా అని ఆమె అనుకోలేదు. మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. థియేటర్లో సినిమాను చూసినప్పుడు ప్రేక్షకులు ఎమోషనల్ అయ్యారు. మేం కూడా భావోద్వేగానికి లోనయ్యాం. మా టీమ్ అంతా కష్టపడి మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాం. చాలా ఆనందంగా ఉంది.


విజయశాంతిగారు మీ సినిమాలోని పాటను విడుదల చేశారు?
- విజయశాంతి గారు మా సినిమాలోని 'నిర్మల బొమ్మా' సాంగ్  విడుదల చేశారు. ఆమెకు థ్యాంక్స్. విజయశాంతి గారిని చిన్నప్పుడు సినిమాల్లో, టీవీల్లో చూశాను. సాంగ్ రిలీజ్ చేయడానికి వెళ్లినప్పుడు ఆమె చాలా బాగా మాట్లాడారు. విజయశాంతి గారితో మాట్లాడిన మాటలను మర్చిపోలేను.


లక్ష్మీపార్వతిగారితో కలిసి నటించడం గురించి చెప్పండి?
- లక్ష్మీపార్వతి గారు మా సినిమాలో నటిస్తారని మేం ఊహించలేదు. షూటింగ్ కి రెండు రోజుల ముందు మాకు తెలిసింది ఆమె చేస్తున్నారని. లక్ష్మీపార్వతి గారితో కలిసి  వర్క్ చేయడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను.


మీ డ్రీమ్ రోల్ ఏంటీ?
- ఒక యాక్టర్ గా అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు నన్ను నేను సిల్వర్ స్క్రీన్ పై కొత్తగా చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు చేస్తున్న సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అది ప్రేక్షకులకు నచ్చుతుంది.


మీ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పండి?
- నేను హైదరాబాదీని. ఇంటీరియర్ డిజైనింగ్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చాను. మా ఫ్యామిలీ నన్ను బాగా సపోర్ట్ చేస్తుంది. నా కుటుంబ సభ్యుల సపోర్ట్ వల్లే నేను హీరో కాగలిగాను.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !