View

ఇంటర్య్వూ - మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణీ మాలిక్ (చెక్)

Tuesday,February16th,2021, 01:40 PM

యూత్‌ స్టార్‌ నితిన్‌ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. అనంద ప్రసాద్‌ నిర్మించిన సినిమా ‘చెక్‌’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లు. కల్యాణీ మాలిక్‌ సంగీతం అందించారు. ‘ఐతే...’ తర్వాత చంద్రశేఖర్‌ యేలేటి, కల్యాణీ మాలిక్‌ కాంబినేషన్‌ మళ్లీ ‘చెక్‌’కి కుదిరింది. సినిమాలోని ఏకైక పాట ‘నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను’ ప్రోమో ప్రేమికుల రోజున విడుదలైంది. బుధవారం పూర్తి పాట విడుదల కానుంది. అలాగే, ఈ నెల 26న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కల్యాణీ మాలిక్‌ విలేకరులతో ముచ్చటించారు.


‘ఐతే...’ తర్వాత చంద్రశేఖర్‌ యేలేటితో మళ్లీ సినిమా చేశారు.
- చందూ (చంద్రశేఖర్‌ యేలేటి)తో చేసే అవకాశం ఎప్పుడు వస్తుందా అని 17 ఏళ్లుగా నేను వెయిట్‌ చేస్తున్నా. ‘ఐతే...’ తర్వాత అనుకోని సందర్భాల వలన చందూతో మళ్లీ పని చేయడం కుదరలేదు. అనుకోకుండా ‘చెక్‌’కి కలిసి పని చేశాం. సంగీత దర్శకుడిగా ‘ఐతే...’ నా తొలి సినిమా. బిగినింగ్‌ డేస్‌లో ఎగ్జైట్‌మెంట్‌, భయం–భక్తి ఎలా ఉన్నాయో... ఇప్పటికీ వర్క్‌ పట్ల అదే యాటిట్యూడ్‌ ఉంది. ‘ఐతే...’ తర్వాత ‘ఆంధ్రుడు’, ‘అష్టా చమ్మా’, ‘అలా మొదలైంది’, ‘ఊహలు గుసగుసలాడే’... అన్నీ నా కెరీర్‌లో చాలా మంచి సినిమాలు. నా కెరీర్‌లో సక్సెస్‌లు, ఫ్లాప్‌లు ఉన్నాయి. అయితే, బ్లాక్‌బస్టర్‌ అంటూ ఏమీ లేదు. లైమ్‌ లైట్‌లోకి వచ్చి సినిమా తర్వాత సినిమా వచ్చే స్థితి 7 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదు. నా కెరీర్‌లో ‘చెక్‌’ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అవుతుందని బలంగా నమ్ముతున్నా. ‘చెక్‌’ ఎంత పెద్ద విజయం సాధిస్తుందో నాకు తెలుసు. ఈ సినిమా తర్వాత నాకు గ్యాప్‌ రాదని నమ్మకం ఉంది.


పాటల కంటే నేపథ్య సంగీతం మీద ఆధారపడిన చిత్రమిది. సంగీత దర్శకుడిగా మీరు ఎలాంటి ఛాలెంజ్‌ ఎదుర్కొన్నారు?
- ‘ఐతే...’లో ఒకే ఒక్క పాట ఉంటుంది. ‘చెక్‌’లోనూ అలాగే ఒకే పాట ఉంది. అది బుధవారం విడుదలవుతుంది. పాటతో సంబంధం లేకుండా చందూ ఎంచుకున్న యునీక్‌ సబ్జెక్ట్‌... ఆ జైలు వాతావరణం, నితిన్‌ నటించిన విధానం, స్ర్కీన్‌ప్లేలో పట్టు గానీ చాలా చాలా కొత్తగా ఉంటుంది. ఆ విషయం ఆల్రెడీ చూసిన వాళ్లకు తెలుసు. ‘చెక్‌’లో చాలా థ్రిల్లింగ్‌ ఫ్యాక్టర్లు ఉన్నాయి. ఫైట్‌ సీక్వెన్సులు గానీ, ఫైట్లు వచ్చిన విధానం గానీ బావుంటుంది. ఇటువంటి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న సబ్జెక్ట్‌ను చందూ డీల్‌ చేయడం నాకు తెలిసి ఇదే తొలిసారి. థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు తప్పకుండా థ్రిల్‌ అవుతారు.


ఒక్క పాటే ఉందన్నారు. ఈ సినిమా ఎంపిక చేసుకోవడానికి గల కారణం?
- నేను ఎంపిక చేసుకొనే స్థితిలో లేను. వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఒక్క పాట ఉంటే ఛాలెంజింగ్‌ పార్ట్‌ ఎక్కువ ఉంటుంది. ఐదు పాటలు ఉంటే, ఈ పాట కాకపోతే మరో పాట బాగా చేయవచ్చని ఎస్కేప్‌ అవ్వొచ్చు. ఒక్క పాట ఉంటే ఒళ్లు దగ్గర పెట్టుకుని చేయాలి.


ఒక్క పాటకు కథలో సందర్భం ఉందా? లేదంటే...
- ఉంది. ఫోర్డ్స్‌గా కావాలని పెట్టిన పాట కాదు. ‘నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను’ రొమాంటిక్‌ సాంగ్‌. కథలో భాగంగా, ప్రోపర్‌ స్ర్కీన్‌ప్లేలో వస్తుంది. మరో పాట చేయవచ్చు.


ఈ సందర్భంలో పాట వస్తే బావుంటుందని మీరు ఏమైనా సలహా ఇచ్చారా?
- లేదండీ. కథ పూర్తైన తర్వాతే నా దగ్గరకు వచ్చింది. మరో పాట పెట్టడానికి చందూకి ఎక్కడా స్కోప్‌ దొరకలేదు. రేపు సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకూ అదే అనిపిస్తుంది. ఇటువంటి స్ర్కీన్‌ప్లే బేస్డ్‌ మూవీకి మరో పాట పెట్టకపోవడం మంచిది. ఆ ఒక్క పాటకు 75 ట్యూన్లు ఇచ్చాను. నాకు 25 రోజులు పట్టింది. నా ట్యూన్లు చాలా తొందరగా ఓకే అవుతాయి. కానీ, ఈ సినిమాకి టైమ్‌ పట్టింది.


ఇటువంటి సినిమాలకు నేపథ్య సంగీతం ఇంపార్టెంట్‌. మీరు ఎటువంటి వర్క్‌ చేశారు?
- నా కెరీర్‌లో ఎక్కువ రోజులు నేపథ్య సంగీతం చేసిన సినిమా ‘చెక్‌’. మొత్తం 30 రోజులు పట్టింది. కొన్ని రోజులు రాత్రిపూట విరామం తీసుకోకుండా చేశాం. యాక్చువల్లీ... 30 కంటే ఎక్కువ రోజులు చెప్పాలి. ‘చెక్‌’ నేపథ్య సంగీతానికి నాకు విపరీతమైన పేరు వస్తుంది. ఈ సినిమాకు నేపథ్య సంగీతం ఎంత ఉపయోగపడిందనేది నిలిచిందనేది ప్రేక్షకులు గమనిస్తారు. చందూ డైరెక్షన్‌, నితిన్‌ బాగా యాక్ట్‌ చేయడం వలనే నేను మంచి నేపథ్య సంగీతం చేయగలిగా. నాకు పేరు వస్తే ఆ క్రెడిట్‌ డైరెక్టర్‌, ఆర్టిస్టులదే.


నితిన్‌తో ఫస్ట్‌ టైమ్‌ చేశారు. ఆయన నుంచి ఎటువంటి ఫీడ్‌బ్యాక్‌ వచ్చింది?
- నితిన్‌ చాలా సపోర్టివ్‌, స్పోర్టివ్‌. వెరీ సాప్ట్‌, షై పర్సన్‌. సాధారణంగా ఆయన తక్కువ మాట్లాడతారు. ఆ మాటల్లో ఎంతో ప్రేమ ఉంటుంది. మా కాంబినేషన్‌ హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నా. సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతుందని నమ్మకం ఉంది.


‘ఐతే...’కి, ఇప్పటికీ చంద్రశేఖర్‌ యేలేటిలో గమనించిన మార్పు?
- ఇంతకు ముందు చందూ క్లోజ్డ్‌గా ఉండేవాడు. ఇప్పుడు ఓపెన్‌ అయ్యాడు. సలహాలు ఇస్తే చాలా పాజిటివ్‌గా, ఓపెన్‌ మైండ్‌తో రిసీవ్‌ చేసుకుంటున్నాడు. ఎడిటింగ్‌, డబ్బిండ్‌, రీ–రికార్డింగ్‌లో తను ఇచ్చిన ఫ్రీడమ్‌ అంతా ఇంతా కాదు. చాలా మార్పు గమనించా. తనతోనూ ఆ మాట చెప్పా. ‘నువ్వు చాలా మారిపోయావ్‌. ఈ మార్పే పెద్ద సక్సెస్‌ తీసుకొస్తుంది’ అన్నాను. మార్పు మనలోంచి రావాలి. ప్రతి సలహాను స్వీకరించడం ముఖ్యం. ఏ సినిమాకైనా మొదటి ప్రేక్షకుడు సంగీత దర్శకుడే.


ఫస్ట్‌ టైమ్‌ ‘చెక్‌’ చూసినప్పుడు ఏం అనిపించింది?
- నాకు చందూ అన్‌–ఎడిటెడ్‌ వెర్షన్‌ చూపించాడు. ప్రేక్షకులు చూడబోయే సినిమా చాలా ట్రిమ్‌ అయ్యింది. ఇప్పుడు రన్‌టైమ్‌ 2.13 గంటలే. ఇంతకు ముందు రెండున్నర గంటలు ఉండేది. అదీ నాకు నచ్చింది. డబ్బింగ్‌ తర్వాత మరింత క్రిస్ప్‌ చేశారు. ఫస్ట్‌ టైమ్‌ చూసినప్పుడూ నాకు నచ్చింది. సినిమాలో 80 శాతం జైలులో జరుగుతుంది. జైలు నుంచి సినిమా కదలడం లేదని ఎవరికీ అనిపించదు. ఆ సన్నివేశాలను అందరి మెప్పు పొందేలా చందూ బాగా రాశాడు. ముఖ్యంగా నితిన్‌ నటన... అతని హిట్‌ సినిమాల్లోనూ ఇటువంటి అద్భుత నటన చూసి ఉండరు. నితిన్‌కి ఎక్కువ పేరు వస్తుంది.


మీరు మంచి గాయకుడు. ఇతర దర్శకులు మిమ్మల్ని పాడమని అడగలేదా?
- నాకు పాటలు అంటే చాలా ఇష్టం. చాలామందిని నేనే అడుగుతుంటా. ఫోనులు చేస్తా. మెసేజ్‌లు పెడతా. రీసెంట్‌గా తమన్‌ నాతో పాట పాడించారు. కల్యాణ్‌ ధేవ్‌ ‘సూపర్‌ మచ్చి’లో. నా ట్యూన్‌ కాదు కదా! కొత్త ట్యూన్‌లో నా వాయిస్‌ వింటే కొత్తగా ఉంది.


సంగీత దర్శకుడిగా మీ నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌?
- రెండు వెబ్‌ సిరీస్‌లు స్టార్ట్‌ అయ్యాయు. సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తా.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !